హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ హీరో రెండో కూతురు | Arjun Sarja Daughter Sanjana Likely To Enter In Movie Industry, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ హీరో రెండో కూతురు

Published Mon, Sep 23 2024 12:30 PM | Last Updated on Mon, Sep 23 2024 1:30 PM

Arjun Sarja Daughter Sanjana Enter In Movie Industry

యాక్షన్‌ కింగ్‌ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు అర్జున్‌. కన్నడ రాష్ట్రానికి చెందిన ఈయన బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత అన్నది తెలిసిందే. ఇప్పటికీ నటిస్తున్న అర్జున్‌ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈయన కుటుంబం సినిమాకు కేరాఫ్‌ అనే చెప్పవచ్చు. అర్జున్‌ సతీమణి పేరు నివేదిత. ఈమె కూడా వివాహానికి ముందు కథానాయకిగా నటించారు. అంతేకాదు ఈమె తండ్రి కూడా నటుడే. 

అర్జున్‌తో వివాహం జరిగిన తర్వాత నివేదిత నటనకు స్వస్తి చెప్పారు. అర్జున్‌, నివేదిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే. వీరిలో పెద్ద కూతురు ఐశ్వర్య కూడా నటిగా రంగప్రవేశం చేశారు. ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా పట్టత్తు తానై అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత నటుడు అర్జునే మెగా ఫోన్‌ పట్టి కూతురు హీరోయిన్‌గా చేసిన చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. కాగా ఇటీవలే నటి ఐశ్వర్య నటుడు ఉమాపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

కూతురు, అల్లుడు హీరో హీరోయిన్‌గా అర్జున్‌ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అర్జున్‌ రెండవ కూతురు అంజనా కూడా కథానాయకిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశం లేకపోలేదు అని సమాధానం సినీ వర్గాల నుంచి వస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా అంజన తను ప్రత్యేకంగా తీయించుకున్న గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement