కుటుంబకథా చిత్రంగా కాదల్ కాలమ్ | Family film Kaadhal column | Sakshi
Sakshi News home page

కుటుంబకథా చిత్రంగా కాదల్ కాలమ్

Dec 25 2015 2:36 AM | Updated on Sep 3 2017 2:31 PM

కుటుంబకథా చిత్రంగా కాదల్ కాలమ్

కుటుంబకథా చిత్రంగా కాదల్ కాలమ్

కాదల్ కాలమ్ చిత్ర పాటలు బాగున్నాయని ప్రముఖ దర్శకుడు కే.భాగ్యరాజ్ అభినందించారు.

కాదల్ కాలమ్ చిత్ర పాటలు బాగున్నాయని ప్రముఖ దర్శకుడు కే.భాగ్యరాజ్ అభినందించారు. తమిళకొడి ఫిలింస్ పతాకంపై వెప్పడై. జీ.సెల్వరాజ్ నిర్మిస్తున్న చిత్రం కాదల్ కాలమ్. కె.భాగ్యరాజ్ శిష్యుడు సోమసుందరం కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నూతన నటుడు చంద్రు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా తెలుగు నటి శిల్పాశెట్టి నటిస్తుండగా మరో హీరోయిన్‌గా సార్వీ చేకూరి నటిస్తోంది.
 
 జయానందన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంతకు ముందే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ ఆవిష్కరించి ముగ్గురు స్నేహితులు కలిసి నిర్మిస్తున్నారని తెలిసి అభినందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నై, వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో నిర్వహించారు. చిత్ర ఆడియోను భాగ్యరాజ్ ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు పాండ్యరాజన్ అందుకున్నారు. భాగ్యరాజ్ మాట్లాడుతూ సోమసుందరం కఠన శ్రమజీవి అని ప్రశంసించారు.రచయిత అయిన ఆయన పత్రికా విలేకరిగా మారి ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తారని తెలిపారు.
 
 ఈ కాదల్ కాలమ్ చిత్రం చూసిన సెన్సార్ బృందం కే.భాగ్యరాజ్ చిత్రం చూసినట్లు ఉందని అభినందించారట. ఇది ఒక గురువుగా తాను గర్వపడే విషయం అన్నారు. చిత్ర పాటలు చూశానని చాలా బాగున్నాయని చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర నిర్మాత సెల్వరాజ్ మాట్లాడుతూ ఎంత సంపాదించినా అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారన్నారు. అలాంటి ఇతి వృత్తంతో రూపొందుతున్న ప్రేమ సన్నివేశాలతో కూడిన కుటుంబకథాచిత్రం కాదల్ కాలమ్ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement