న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీల్లో వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ సదుపాయం కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
‘‘లాకప్‌లు, కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ప్రాంతం, వరండాలు, ఔట్‌హౌస్‌లు, ఇన్‌స్పెక్టర్ చాంబర్ వంటి అన్నిచోట్లా నైట్ కాప్చరింగ్ సదుపాయంతో కూడిన వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ తప్పనిసరని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ సీసీటీవీ వ్యవస్థలను ఆధునీకరించాలని స్పష్టంగా చెప్పింది’’ అని గుర్తు చేసింది. ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్లో ఆడియో రికార్డింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని తప్పుబడుతూ కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment