voice calls
-
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ పచ్చ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్ కాల్స్ పేరుతో జనాలకు ఫోన్లు చేసి విసిగిస్తోంది. ఫోన్ ఎత్తితే చాలు.. సీఎం జగన్‌పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. ఎవరో ఫోన్ చేస్తున్నారనుకుని ఆ ఫోన్ ఎత్తితే చాలు.. ఆ వాయిస్ కాల్లో సీఎం జగన్‌ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్ కాల్స్‌ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్‌పై ట్రూకాలర్‌లో యువర్ జగన్, జగన్ లీడర్, మాస్ లీడర్ జగన్.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్‌ను అభిమానించే వారు ఫోన్లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్‌ఫిలిమ్స్‌తో సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.జగన్‌పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
టెల్కోల వాయిస్ కాల్స్‌కు ఓటీటీ దెబ్బ
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్ఎంఎస్ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది. 2013 జూన్ క్వార్టర్లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది. -
మస్క్ సంచలనం.. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు!
ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్లో కాల్స్, మెసేజ్‌లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు, లాంగ్ ఫార్మ్ ట్విట్లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెటా తరహాలో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్విటర్లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను బాస్‌గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
గూగుల్ మీట్లో అదిరిపోయే ఫీచర్లు
గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. గూగుల్ మీట్ ఫీచర్లో ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండగా.. ఇకపై గూగుల్ మీట్ కాల్స్ సంభాషణలు టెక్ట్స్ రూపంలో కనిపించనున్నాయి. అవసరం అయితే ఆటెక్ట్స్ను గూగుల్ డాక్ ఫార్మాట్లోనూ సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు కేవలం గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ప్రైజ్ స్టార్టర్, ఎంటర్ప్రైజ్ స్డాండర్డ్, ఎంటర్ప్రైజ్ ప్లస్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్‌గ్రేడ్ కస్టమర్లకు అందించనుంది. దశల వారీగా సాధారణ యూజర్లు సైతం వినియోగించేలా అందుబాటులోకి తీసుకొని రానుంది. కాగా ఈ ఫీచర్ అక్టోబర్ 24 నుంచి ఎనేబుల్ కానుంది. -
వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కానీ వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ వంటి ముఖ్యమైన ఫీచర్ల విషయంలో వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ వాట్సాప్ వాయిస్ రికార్డ్ ఫీచర్ అవసరమైన యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వాట్సాప్ సంస్థ.. కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య పెంచడం, ఎమోజీ రియాక్షన్స్, ఎక్కువ మందికి వాయిస్ కాల్స్ చేసుకోవడం, చాట్ ఫిల్టర్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఏడాదిలో మరో 15 కొత్త ఫీచర్లను విడుదల చేయాల్సి ఉండగా .. ఇప్పుడు మనం అదే థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగించి వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం. వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న క్యూబ్ కాల్ అనే వాట్సాప్ రికార్డ్ వాయిస్ కాల్స్ థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్స్‌కు మనం మాట్లాడుతున్న వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేసేందుకు సెట్టింగ్‌లో అనుమతి ఇవ్వాలి. సెట్టింగ్‌లో యాక్సెప్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే కాల్స్ రికార్డ్ చేయలేం. ఒకవేళ ఉచితంగా కాల్ రికార్డ్ ఆప్షన్ లేకపోతే వారానికి లేదంటే నెలకి కొంతమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించినప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. -
జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త!
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. ఇకపై జియో ఫోన్లలో వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఇకపై కైయోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్) మోబైల్ వినియోగదారులు కూడా వాయిస్ కాల్స్ మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్ అప్ డేట్ తో తాజా వెర్షన్ 2.2110.41 తో లభిస్తుంది. కొత్తగా తెచ్చిన ఈ ఫీచర్ ను కైయోస్ ఓఎస్ లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ తప్పని సరిగా ఉండాలని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కైయోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్ట్ ఉన్న ఫోన్లలో ఈ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఒకవేళ కైయోస్ ఓస్ వినియోగదారులు ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు తన కుటుంబసభ్యులతో, స్నేహితులతో మాట్లాడేందుకు గతంలోకంటే ఇప్పుడు వాట్సాప్ మీద ఆదారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులు వాట్సాప్ ను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా కైయోస్ ఓఎస్ లో వాట్సాప్ కాల్స్ ఫీచర్ ను ఎనేబుల్ చేసినట్లు వాట్సాప్ సీఓఓ మ్యాట్ ఐడెమా తెలిపారు. చదవండి : సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు -
డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యాన్ని డెస్క్ టాప్ యాప్‌నకూ కలిపించినట్టు వాట్సాప్ గురువారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్/ల్యాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. డెస్క్ టాప్ యాప్‌నకూ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్ కాల్స్ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ నమోదయ్యాయని వెల్లడించింది. చదవండి: భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్ ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ -
రిలయన్స్ జియో... వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
జియో వడ్డన : ఇంపార్టెంట్ అప్డేట్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో బాదుడుకి దిగన సంగతి తెలిసిందే. గురువారం నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్గోయింగ్ కాల్లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జియో ట్విటర్ ద్వారా వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ జియోయేతర నంబర్లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్ ట్విటర్ పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే, రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు అందుబాటులోఉంటాయని తెలిపింది. . అంటే ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత, ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాగా జియో ఈ వారం ప్రారంభంలో నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్లను ప్రకటించింది. రూ. 10 - రూ. 100. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు అందిస్తున్నాయి. జియో-కాని నంబర్లకు అవుట్ గోయింగ్ కాల్స్ పొందటానికి జియో ప్లాన్‌తో సంబంధం లేకుండా కొత్త టాప్-అప్ అవసరం. An important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC — Reliance Jio (@reliancejio) October 10, 2019 -
మొబైల్‌ఫోన్, ల్యాండ్‌లైన్ సేవలు రీస్టార్ట్!
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించి.. నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో 144 సెక్షన్ అమల్లో ఉంచి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, భారీ నిరసనలు జరగకుండా ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కేంద్రం నిర్ణయాల నేపథ్యంలో భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో జనజీవనం పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ల్యాండ్‌లైన్ సేవలు నిలిపేయడం, ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేయడంతో బయటి ప్రపంచానికి కశ్మీర్‌తో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో లోయలోని తమ వారి యోగక్షేమాలు తెలియక బయట ఉన్న కశ్మీరీలు ఆందోళన చెందుతుండగా.. బయట ఏం జరుగుతుందో తెలియ లోయ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనపై కశ్మీర్లో పెద్దగా నిరసనలు.. అలజడి చెలరేగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. శనివారం సాయంత్రం కల్లా జమ్మూకశ్మీర్‌లో మొబైల్ ఫోన్ వాయిస్ కాల్ సేవలు, లాండ్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 144 సెక్షన్ అమలులోనూ సడలింపులు ఇచ్చే అవకాశముంది. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. -
హలో గురూ ఓటు కోసమే..!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు, అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. నేటి స్మార్ట్‌యుగంలో ప్రచారం కూడా స్మార్ట్‌గానే చేస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్ కాల్స్‌తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకటి, రెండు పార్టీలు మినహా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయినా, టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నవారు అభ్యర్థుల పేర్లతో బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అంటూ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లకు సందేశాలు పంపారు. 2014 ఎన్నికల్లోనే చాలామంది అభ్యర్థులు ఈ విధానంలో కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అభ్యర్థులు, ఆశావహుల చేతికి తమ ఫోన్ నంబర్లు ఎలా వెళుతున్నాయన్నది పౌరులకు అంతుచిక్కడంలేదు. వారికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా లేకున్నా టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ వెళుతుండటం గమనార్హం. ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీలు, కేబుల్ ఆపరేటర్లు, బ్యాంకులు, షాపింగ్‌మాల్స్, టౌన్షిప్, అపార్ట్మెంట్ ఆఫీసులు, ఓటరులిస్టుల ద్వారా ఫోన్ నంబర్లను కొందరు అక్రమంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలు రేటు కట్టి ఫోన్ నంబర్ల జాబితాలను విక్రయిస్తున్నారు. అభ్యర్థులు వీటిని వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు అందజేసి ఆ నంబర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, పోటీచేసే వ్యక్తి ఇంటింటికీ తిరిగినా ఓటర్లందరినీ కలిసే అవకాశాల్లేవు. అందుకే ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. బల్క్ మెసేజ్ ప్యాకేజీలు రోజుకు రూ.వెయ్యి నుంచి ఆపై వరకు ఉన్నాయి. ఇంటర్నెట్ సాయంతో రోజుకు వేలాది సందేశాలు పంపే వెసులు బాటు కూడా ఉంది. అయితే ఫోన్ కాల్కి మాత్రం రూపాయి నుంచి రూ.5 వరకు చార్జీ చేస్తున్నారు. ఆ లెక్కన రోజుకు 30 నుంచి 40 వేల ఫోన్లకు వాయిస్‌కాల్స్ పంపే వెసులుబాటు ఉంది. వీటి ప్యాకేజీలు రూ.50 వేల నుంచి ఉన్నాయి. ఈ లెక్కన 119 నియోజవర్గాల్లో అభ్యర్థులు, రెబెల్స్ అంతా కలుపుకుంటే ఈ లిస్టు చాంతాడంత అవుతుంది. అంతా ఇదే విధానాన్ని అనుసరిస్తే ఆ వ్యయం రూ.కోట్లల్లో ఉంటుంది. నామినేషన్ వేసే దాకా.. తాము పోటీలో ఉన్నామని వారి పార్టీల అధిష్టానాలకు, తమ ప్రత్యర్థులకు చాటుకోవాలన్న తాపత్రయంలో, గెలుపుపై ధీమాను చాటేందుకు ఆశావహులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏదో ఒక పార్టీపై బీ–ఫారం సంపాదించి నామినేషన్ వేసే వరకు అది అతని వ్యక్తిగత ప్రచారమే అవుతుంది. అయితే, ఈ ప్రచారానికి వీరు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపెడతారా? లేదా.. అన్నది సందేహమే. అనుమతి లేకుండా ఫోన్ చేయడం, మెసేజ్‌లు పంపడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పోలీసులు, న్యాయనిపుణులు అంటున్నారు. దీనిపై వినియోగదారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జనాభాలో 40 శాతం యువత ఉంది. సోషల్‌మీడియాలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. అందుకే, వారిని చేరుకునేందుకు పార్టీలు, నేతలు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. -
వాట్సాప్‌లో ఇక గ్రూప్ కాలింగ్
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి మాత్రమే వాయిస్ కాల్, వీడియో కాల్ చేసుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా ఎక్కువ మందితో సంభాషణలు జరిపేందుకు ‘గ్రూప్ కాల్’సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఒకేసారి వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మంగళవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉందంది. వాట్సాప్‌లో కుడి వైపు పైభాగంలో కనిపించే ‘యాడ్ పార్టిసిపెంట్’అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా కాలింగ్‌లో సభ్యులను ఆహ్వానించవచ్చని పేర్కొంది. ఒక వ్యక్తి గరిష్టంగా నలుగురు వ్యక్తులతో సంభాషించవచ్చంది. వాట్సాప్‌ను 130 కోట్ల మంది ఉపయోగిస్తుండగా.. ఇందులో రోజుకు దాదాపు 200 కోట్ల నిమిషాలను కాల్స్ కోసం వెచ్చించారని వెల్లడించింది. -
ఇంటర్నెట్తో వాయిస్ కాల్స్ మళ్లింపు
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ మళ్లిస్తూ ప్రభుత్వ బొక్కసానికి చిల్లుపెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హాజీ గఫూర్‌సాబ్ వీధిలో ఉంటున్న హిమాయతుల్లా షరీఫ్ కుమారుడు షేక్ ముక్కపాలెం హఫీజుల్లా ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. సమాచారం అందుకున్న కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా విలువజేసే మూడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీఓఐపీ) వస్తువులు, 120 ఒడాఫోన్, రిలయన్స్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తే అది కంప్యూటర్ ద్వారా దేశంలోని అనధికారిక ఎక్స్ఛేంజిలకు వస్తుందని, అక్కడినుంచి సాధారణ కాల్స్ మాదిరి మారుతాయని ఆయన వివరించారు. ఆ కాల్స్‌ను నిందితుడు తనకు తెలిసిన సాంకేతికత, ఆధునిక పరికరాలతో సాధారణ కాల్స్ మాదిరి మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడని డీఎస్పీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఇతర సెల్‌ఫోన్ సంస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడన్నారు. హఫీజుల్లాకుతోడు విజయవాడలో చిరంజీవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ కాల్స్ మళ్లించడంలో నైపుణ్యం పొందాడన్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ ఎస్ఐలు యోగేంద్ర, మోహన్, ఎస్బీ ఎస్ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వొడాఫోన్ 399 ప్లాన్
సాక్షి,న్యూఢిల్లీ: దివాళీకి ముందే వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మెగా ఆఫర్ ప్రకటించింది.కొత్తగా రూ 399 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ప్రీపెయిడ్ యూజర్లు 90 జీబీ 4జీ డేటాను వాడుకోవడంతో పాటు రీచార్జ్ చేయించుకున్నప్పటి నుంచి ఆరు నెలల వరకూ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమేనని తెలిసింది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో 399 ప్లాన్‌కు దీటుగా పండగ సీజన్ ఆరంభంలోనే కొత్త ప్లాన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేసింది. ఎయిర్టెల్ 399 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల పాటు 4జీ హ్యాండ్సెట్ యూజర్లకు అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రిలయన్స్ జియో 399 ప్లాన్‌లో తన ప్రైమ్ యూజర్లకు 84 రోజుల పాటు 84 జీబీ డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ప్లాన్‌లో జియో ప్రైమ్ యూజర్లు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్ చేసింది.ఇక దివాళీ ఆఫర్లలో భాగంగా రూ 399 రీచార్జి చేసుకునే కస్టమర్లకు వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. రూ 50 డినామినేషన్‌తో ఉండే ఈ వోచర్లు నవంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
ముకేశ్ మేజిక్!
ఉచితం ఒక ఫోన్–ఒక షేర్ ♦ 40వ ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన ♦ ఉచితంగా 4జీ ఫీచర్ మొబైల్ ‘జియో ఫోన్’ ♦ రూ. 1,500 సెక్యూరిటీ డిపాజిట్ కడితే చాలు; మూడేళ్ల తర్వాత మళ్లీ వెనక్కి ♦ నెలకు రూ.153 టారిఫ్; వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం.. అపరిమిత డేటా ♦ ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా విడుదల... 24 నుంచి బుకింగ్స్ మొదలు ♦ 50 కోట్ల మంది అల్పాదాయ యూజర్లను ఆకర్షించడమే లక్ష్యం... ♦ వాటాదారులకు బంపర్ ఆఫర్; ఒక షేరుకు మరో షేరు ఫ్రీ ♦ గంటన్నరపాటు ఏజీఎంలో ప్రసంగించిన ముకేశ్.... ♦ తొలిసారి ఏజీఎం వేదికపైకి ఎక్కిన కుమారుడు ఆకాశ్, కుమార్తె ఇషా టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది. కంపెనీ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లతోపాటు రిలయన్స్ వాటాదారుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. రిలయన్స్ జియో కస్లమర్లుగా చేరేవారికి ఉచితంగా మొబైల్ ఫోన్‌ను ఇవ్వడంతోపాటు జీవితకాలంపాటు ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు అన్లిమిటెడ్ 4జీ డేటా ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఆర్ఐఎల్ ఇన్వెస్టర్లకు ప్రతి ఒక్క షేరుకి మరో షేరును ఇవ్వనున్నట్లు ముకేశ్ ఏజీఎంలో వెల్లడించారు. మొత్తంమీద ఈసారి ఏజీఎంలో ముకేశ్ ప్రసంగం, అనూహ్య నిర్ణయాలను చూస్తే...ధీరూభాయ్ రోజుల్లో ఏజీఎంను తలపించిందనేది కార్పొరేట్ వర్గాల విశ్లేషణ. ముంబై శుక్రవారం, జూలై 21, ఉదయం 10.00... ముంబై మహానగరం ఎప్పటిలాగే బిజీబిజీగా రోజును మొదలుపెట్టింది. చిరు జల్లులు కురుస్తున్నాయి. న్యూ మెరైన్ లైన్ రోడ్డులోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియం వద్ద మాత్రం ఆ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా కిక్కిరిసిన జనసందోహం లోనికి వెళ్లేందుకు క్యూ కట్టారు. వీళ్లంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు. ఇక్కడ జరుగుతున్న కంపెనీ 40వ ఏజీఎంలో అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి ప్రకటనలు చేస్తారోనన్న ఉత్కంఠ అక్కడున్నవారిలోనే కాదు... దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అయితే, సన్నగా మొదలైన వర్షం.. ఆ తర్వాత ముకేశ్ అంబానీ ప్రకటించే ఆఫర్ల సునామీగా మారుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఏజీఎంలో ఆయన చేసిన అనూహ్య ప్రకటనలు అటు కంపెనీ వాటాదారులు, ఇటు టెలికం యూజర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే... పోటీ టెలికం సంస్థలకు మాత్రం మరోసారి గట్టి షాక్ తగిలేలా చేశాయి. తమ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లుగా మారేవారికి ఎవరికైనా ఉచితంగా టెలిఫోన్‌ను ఇస్తామని ముకేశ్ ఏజీఎంలో ప్రకటించారు. ‘జియో ఫోన్’ పేరుతో ఈ 4జీ ఫీచర్ ఫోన్‌ను ఏజీఎంలో ప్రవేశపెట్టారు. గంటన్నరపాటు ప్రసంగించిన ముకేశ్ అంబానీ... చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో సేవలను ప్రారంభించి ఉచిత వాయిస్, అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకుని జియో కొత్త రికార్డును సృష్టించింది కూడా. ప్రస్తుతం జియోకు 12.5 కోట్లకుపైగా సబ్స్క్రయిబర్లు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కంపెనీ బిల్లింగ్‌ను కూడా మొదలుపెట్టింది. ప్రధానంగా ఉచిత జియో ఫోన్ ఆఫర్‌తో దేశంలోని 50 కోట్ల మందికిపైగా ఫీచర్ ఫోన్లను వాడే అల్పాదాయ వర్గాలను తమ కస్టమర్లుగా మార్చేసుకోవాలనేది రిలయన్స్ జియో లక్ష్యంగా కనబడుతోంది. ఫోన్ ఉచితమే కానీ.... జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం కావడం గమనార్హం. అయితే, పైసా చెల్లించకుండానే ఈ 4జీ ఫోన్‌ను ఎవరైనా తీసుకోవచ్చని ప్రకటించిన ముకేశ్ అంబానీ.. ఒక మెలిక మాత్రం పెట్టారు. వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇచ్చేస్తామన్నారు. ‘జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ అనేది ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్లను ప్రవేశపెడతాం. 24 నుంచి ప్రీ–బుకింగ్స్ మొదలవుతాయి. ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుంచి ఫోన్లను చేతికి అందిస్తాం’ అని అంబానీ వివరించారు. వారానికి 50 లక్షల జియో ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని... ఈ ఏడాది చివరి త్రైమాసికంనాటికి వీటిని పూర్తిగా ఇక్కడే తయారు చేయనున్నామని తెలిపారు. కాగా, ఆఫర్లో భాగంగా జియో ఫోన్లోని కంటెంట్‌ను టీవీలో చూసేవిధంగా కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్‌ను కూడా కంపెనీ ఇవ్వనుంది. ప్రపంచ టాప్–50 కంపెనీల్లో చోటే లక్ష్యం...: ‘రిలయన్స్ 50వ ఏజీఎం నాటికి(ప్రస్తుతం 40వది) ప్రపంచంలో టాప్–50 కార్పొరేట్ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ను నిలబెట్టాలనేది నా లక్ష్యం. వచ్చే పదేళ్లూ మనకు స్వర్ణయుగమే’ అని ముకేశ్ అంబానీ ప్రకటించగానే... హాల్ అంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. ‘వచ్చే పదేళ్లలో రిలయన్స్ అసామాన్యమైన వృద్ధిని సాధిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. అంతేకాదు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేదోడు అందించనున్నాం కూడా. తద్వారా గడిచిన 40 ఏళ్లలో మన ఎకానమీ సాధించిన ప్రగతి వచ్చే పదేళ్లలో కొత్త పుంతలు తొక్కనుంది’ అని ముకేశ్ పేర్కొన్నారు. ఇంధన, మెటీరియల్ వ్యాపారాల్లో వచ్చే కొన్నేళ్లలోనే రూ.లక్ష కోట్ల స్థూల లాభాన్ని సాధించే సత్తా రిలయన్స్‌కు ఉందని చెప్పారు. ఆర్ఐఎల్ విజయ ప్రస్థానంపై ముకేశ్ ఏం చెప్పారంటే... ⇔ 1977లో అంటే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన ఏడాది రిలయన్స్ టర్నోవర్ రూ.70 కోట్లు. ఇప్పుడిది రూ.3,30,000 కోట్లు. 4,700 రెట్లు ఎగబాకింది. ⇔ ఇక 1977లో నికర లాభం రూ.3 కోట్లు కాగా, ప్రస్తుతం ఇది రూ.30,000 కోట్లకు చేరింది. 10,000 రెట్లు దూసుకెళ్లింది. ⇔ కంపెనీ మొత్తం ఆస్తులు రూ.33 కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు ఎగిశాయి. 20 వేల రెట్ల వృద్ధి సాధించాం. ⇔ ఇక మార్కెట్క్యాప్ అయితే, దాదాపు 50 వేల రెట్లు పెరిగింది. 1977లో రూ.10 కోట్ల నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 5లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ⇔ ఇక 1977లో ఎవరైనా రిలయన్స్ షేర్లలో రూ.1,000 పెట్టుబడి పెట్టి ఉంటే... ఇప్పుడది రూ.16,54,500కు చేరినట్లు లెక్క. అదే రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయినట్టే. అంటే ప్రతి రెండున్నరేళ్లకు పెట్టుబడి మొత్తం రెట్టింపు అయింది. ⇔ ఇక జియో విషయానికొస్తే... దేశంలో అతిపెద్ద 4జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం రూ.2 లక్షల కోట్లను పెట్టుబడిగా వెచ్చించాం. జియో సేవలు ప్రారంభించిననాటి నుంచి ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జతచేసుకోగలిగాం. ⇔ కేవలం ఆరు నెలల్లోనే భారత్‌లో నెలవారీ డేటా వినియోగం 20 కోట్ల జీబీ నుంచి 120 కోట్ల జీబీకి ఎగబాకింది. డేటా వినియోగంలో మనం అమెరికా, చైనాలను అధిగమించాం కూడా. ⇔ జియో ప్రారంభానికి ముందు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో భారత్ 155 స్థానంలో ఉంది. రానున్న కొన్ని నెలల్లోనే నంబర్ వన్ స్థానానికి చేరేదిశగా దూసుకెళ్తున్నాం. డేటా వినియోగంలో ఇప్పటికే మనం టాప్ ర్యాంకుకు చేరిపోయాం. బోనస్ బొనాంజా... 40వ∙ఏజీఎంలో ఎవరూ ఊహించని ప్రకటనేదైనా ఉందంటే అది బోనస్ అనే చెప్పొచ్చు. ఎనిమిదేళ్ల వ్యవధి తర్వాత మళ్లీ తమ వాటాదారులకు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను ఇవ్వనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బోనస్ ఇష్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.13 చొప్పున డివిడెండ్‌ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా, లిస్టెడ్ కంపెనీగా 40 ఏళ్ల రిలయన్స్ చరిత్రలో ఇది నాలుగో బోనస్ కావడం గమనార్హం. చివరిసారిగా కంపెనీ 2009లో బోనస్ షేర్లను ఇచ్చింది. తొలిసారిగా 1983లో 3:5 నిష్పత్తిలో(అంటే ప్రతి 5 షేర్లకు 3 షేర్లు ఉచితంగా) బోనస్ షేర్లను ప్రకటించింది. కాగా, గురువారం 10 నిమిషాల పాటు డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని, బోనస్ షేర్లకు రికార్డు తేదీని తదుపరి ప్రకటించనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పెయిడ్–అప్ షేర్ క్యాపిటల్ రూ.3,251.74 కోట్లు(రూ.10 ముఖ విలువగల 325.17 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇందులో 17.18 కోట్ల షేర్లు సబ్సిడరీ కంపెనీలకు చెందినవి). తాజా బోనస్ తర్వాత పెయిడ్–అప్ క్యాపిటల్ రూ.6,331.59 కోట్లకు చేరుతుంది(రూ.10 ముఖ విలువగల 633.15 కోట్ల షేర్లు). కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 39 భారతీయ కంపెనీలు బోనస్‌లను ప్రకటించాయి. త్వరలో ల్యాండ్‌లైన్ సేవలు కూడా... రిలయన్స్ జియో వైర్లెస్ సేవల విస్తరణ అనంతరం.. ల్యాండ్‌లైన్(ఫిక్స్డ్ లైన్) సేవలను కూడా ప్రవేశపెట్టనున్నామని ముకేశ్ అంబానీ ఏజీఎంలో ప్రకటించారు. ‘తదుపరి దశలో గృహ, వాణిజ్య సంస్థలకు సబంధించి ఫిక్స్డ్ లైన్ కనెక్టివిటీపై దృష్టిపెడతాం. ప్రస్తుతానికైతే వచ్చే 12 నెలల్లో దేశంలోని 99 శాతం ప్రజలకు జియో వైర్లెస్ నెట్‌వర్క్‌ను చేరువచేయాలన్నది లక్ష్యం. 2జీ కవరేజీ స్థానంలో పూర్తిగా 4జీని తీసుకురావాలన్నదే మా ప్రయత్నమంతా’ అని వాటాదారులు అడిగిన ఒక ప్రశ్నకు ముకేశ్ సమాధానమిచ్చారు. కాగా, బాలాజీ టెలీఫిల్మ్స్‌లో 25 శాతం వాటా కొనుగోలువల్ల ప్రయోజనం ఏంటని కొంతమంది ప్రశ్నించగా.. మీడియా, ఎంటర్టైన్మెంట్ సబ్సిడరీ టీవీ18 పనితీరుపైనా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రశ్నలు లేవనెత్తారు. టీవీ–18 పనితీరును మెరుగుపరిచి.. విలువను పెంచే ప్రణాళికలపై కసరత్తు జరుగుతోందని ముకేశ్ వెల్లడించారు. ఏజీఎంకు హాజరైన ముకేశ్, నీతా, ఇషా, అనంత్, ఆకాశ్ (వరుసగా కుడి నుంచి) ముకేశ్ భావోద్వేగం... రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా తీర్చిదిద్దిన విధానం, ఆయన మార్గనిర్ధేశం గురించి ప్రస్తావిస్తూ ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది కంపెనీకి 40వ వార్షికోత్సవం. నా తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ ఇప్పటికీ మనతోనే ఉన్నారని నేను భావిస్తా. భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకు పుట్టుక మరణం అనేవి ఉండవు. అందుకే ఆయన మన హృదయంలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. అందుకే ఆయనను మనం ఏజీఎంకు సాదరంగా ఆహ్వానిద్దాం’ అంటూ ముకేశ్ తీవ్ర భావోద్వేగంతో చెప్పారు. దీంతో వేదిక కింద ముందువరుసలో కూర్చున్న తల్లి కోకిలాబెన్ కంటతడి పెట్టారు. ఆమెను ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ ఇతర అంతరంగికులు సముదాయించడంతో... కొద్ది క్షణాలు విరామం తర్వాత ముకేశ్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ప్రసంగం కొనసాగుతుండగానే ధీరూభాయ్ అంబానీకి గత స్మృతులతో కూడిన ఒక లఘు చిత్రాన్ని వేదికవెనుకనున్న తెరపై ప్రదర్శించారు. ‘గడిచిన 40 ఏళ్లలో కంపెనీ సాధించిన విజయాలు (లాభాలు, మార్కెట్ క్యాప్, టర్నోవర్, వాటాదారులకు రాబడి ఇతరత్రా అంశాల్లో) అన్నింటినీ ధీరూభాయ్ అంబానీకి అంకితం ఇస్తున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. సందడి చేసిన ఆకాశ్, ఇషా... ఏజీఎంకు ముకేశ్ అంబానీ... తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఇషా అంబానీలతో కలిసి హాజరయ్యారు. కోకిలాబెన్, చిన్న కుమారుడు అనంత్‌లు మాత్రం వేదిక కింద తొలి వరుసలో కూర్చున్నారు. ఇప్పటికే ఆర్ఐఎల్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్న నీతా అంబానీతోపాటు తొలిసారిగా ఆకాశ్, ఇషా(వీళ్లిద్దరూ కవలలు. వయస్సు 25 ఏళ్లు) కూడా ముకేశ్‌తో పాటు వేదికపైన కనిపించారు. వాళ్లిద్దరినీ ఇన్వెస్టర్లకు పరిచయం చేసేందుకు ముకేశ్ కీలకమైన 40వ ఏజీఎంను ఉపయోగించుకున్నారు. ‘కంపెనీలో ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది. రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీళ్లిద్దరికీ మీ ఆశీస్సులు కోరుతున్నా’ అని ముకేశ్ పేర్కొన్నారు. కాగా, ఆకాశ్, ఇషాల నేతృత్వంలో రిలయన్స్ జియో లక్ష మంది ఉద్యోగులతో అత్యంత యవ్వన కంపెనీగా ఆవిర్భవించిందని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జియో ఫోన్ ప్రత్యేకతలను వివరించాల్సిందిగా ముకేశ్ వారిద్దరినీ ఆహ్వానించారు కూడా. ఆతర్వాత ఆకాశ్, నిషా అంబానీలు జియో ఫోన్ గురించి లైవ్ డెమో ఇచ్చారు. -
రూ.103కే అపరిమిత డేటా, వాయిస్ కాల్స్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎంట్రీ, డేటా ఖర్చులతో సతమతమవుతున్న వారికి ఏ మేర ఉపయోగపడిందంటే. కంపెనీలు భారీ ఎత్తున్న డేటా ఆఫర్లు ప్రకటించేలా చేసింది. జియో దెబ్బకు కంపెనీలన్నీ డేటా రేట్లను తగ్గిస్తూ వినియోగదారులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమతమ డేటా రేట్లను భారీగా తగ్గించగా.. తాజాగా టెలినార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 103 రూపాయలకే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. యూజర్లందరూ తమ టెలినార్ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ స్కీమ్ కింద యూజర్లకు అందుబాటులో ఉండే అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చట. అదేవిధంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని 90 రోజులు వరకు వాడుకోవచ్చని తెలిపింది. రూ.103 ప్యాక్ కింద కొత్త 4జీ యూజర్లైతే 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ భరించేలా రూపొందించింది. అదేవిధంగా అపరిమతి 4జీ డేటా లిమిట్ కూడా వారు రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుంది. టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. -
జియో ఎఫెక్ట్..ఎయిర్ టెల్ కూడా..
న్యూఢిల్లీ: జియో ఉచిత కాల్స్,ఉచిత డాటా సేవల పొడిగింపు నేపథ్యంలో మరో ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా క్యూ కట్టేసింది. దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవల్ని అందించే ఈ పథకాలను గురువారం ప్రకటించింది. రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెస్తోంది. రూ.345 ప్యాక్ ప్రీపెయిడ్ వినియోగదారులకు భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా ఉచిత వాయిస్ కాల్స్,(లోకల్ అండ్ ఎస్టీడీ) చేయడానికి అనుమతిస్తోంది. అలాగే 1 జీబీ 4జీ డేటా ఉచితం. రూ. 145దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం. అలాగే 300ఎంబీ 4జీ డాటా స్మార్ట్ ఫోన్లకు అందిస్తోంది. దీంతోపాటు 50ఎంబీ డాటా బేసిక్ ఫోన్లకు అందిస్తున్నట్టు తెలిపింది. 28 రోజుల వాలిడిటీ ఈరెండు ప్లాన్లను ప్రకటించింది. అయితే కేరళ ఖాతాదారులకు 2/4 జీ నెట్ వర్క్ లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వినూత్న ఆఫర్లతో ఉన్నతమైన నెట్వర్క్ అనుభవాన్ని అందించే ప్రయత్నాల్లో మరో ఆకర్షణీయమైన ఆఫర్లని ఎయిర్ టెల్ మార్కెట్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) డైరెక్టర్ పూరి తెలిపారు. కాగా రిలయన్స్ జియో సంచలన ఉచిత డాటా , కాలింగ్ సదుపాయం మార్చి 2017 పొడిగించింది. ఈక్రమంలో బీఎస్ ఎన్ఎల్, వోడాఫోన్ తన ఆపర్లను సవరించుకొని, వినియోగదారులకు కొత్త ప్రయోజనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ జియో సర్వీస్ అంటూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. తక్కువ రోజుల్లోనే కోట్లమంది జియో సిమ్ యూజర్లను సంపాదించుకున్నారు. టెల్కోలు గగ్గోలు పెడుతున్నా తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఆగస్టులో జియో సర్వీస్ తీసుకొచ్చినా.. సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా ఈ జియో సిమ్ సర్వీస్ లాంచ్ చేశారు. ఈ డిసెంబర్ 31వరకూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, డాటా బ్రౌజింగ్, డౌన్ లోడ్ సర్వీసులు అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన కస్టమర్లు తొలుత జియో సిమ్స్ అంటూ రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ మినీ స్టోర్స్ ముందు క్యూ కట్టేవారు ప్రస్తుతం ఇతర నెట్ వర్క్ యూజర్స్ నెట్ వర్క్ పోర్టబిలిటీ ద్వారా నంబర్ మార్చే అవసరం లేకుండా జియోకు మారిపోతున్నారు. అధికారికంగా 50లక్షల మంది జియో యూజర్లు నమోదైనట్లు సమాచారం. ఇక జియో అధినేత అంచనా ప్రకారం వీరి సంఖ్య 10కోట్లకు చేరితే ఆపై ఈ సమస్య తీవ్రత ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడం కష్టం. జియో వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే జియో వెలకం ఆఫర్ తెలుసు కాబట్టి.. ఫ్రీ సిమ్ పొంది హాయిగా నెట్ వాడేశారు. కానీ, సెప్టెంబర్ 5తర్వాత జియో ప్రభంజనం మొదలైంది. యూజర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. అందులో ముఖ్యమైన సమస్యలు ఇవే.. వాయిస్ కాల్స్ ఫెయిల్యూర్ ఎలాంటి రీచార్జ్ చేయకుండానే నెట్ సౌకర్యం ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉన్నా, ఇతర నెట్ వర్క్ వారు జియో యూజర్లకు ఇంటర్ కాల్స్ కనెక్షన్ సౌకర్యం కల్పించకపోవడంతో గతవారం వరకూ 15 కోట్ల వాయిస్ కాల్స్ చేయగా అందులో దాదాపు 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. జియో ఉన్నా, ఎమర్జెన్సీ కాల్స్ కోసం ఇతర నెటవర్క్ సిమ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని యూజర్లు వాపోతున్నారు. తగ్గిన ఇంటర్ నెట్ స్పీడ్ జియో వచ్చిన తొలిరోజుల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో 40ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 5ఎంబీపీఎస్ లోపే ఉండగా, కొన్ని నగరాలలో 6-10 వేగంతో నెట్ వస్తుందని చెబుతున్నారు. మూవీ చూస్తే కనీసం ఒక్కసారి కూడా బఫర్ కాని పరిస్థితి నుంచి చిన్న వీడియో చూసినా చాలా సమయం తీసుకుంటుంది. జియో యాప్స్ తో సమస్యలు జియో యాప్స్ లో ఏ ఒక్కటి స్మార్ట్ ఫోన్లో లేకున్నా.. ఇతర యాప్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. జియో 4జీ వాయిస్ చాలా సందర్భాలలో ఆఫ్ లైన్ అని వస్తుంది. ఆ సమయంలో మనం డాటా వాడుకోవచ్చు కానీ, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలుండదు. జియో టీవీ యాప్ క్రాష్ అయితే, తిరిగి టీవీ ఆన్ చేయడానికి చాలా సమయం వృథా చేసుకోకతప్పదు. వీఓఎల్టీఈ సపోర్ట్ లేదు 4జీ సౌకర్యం ఉన్న చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో ఎల్టీఈ మాత్రమే ఉంది. VOLTE సపోర్ట్ చేయని యూజర్లకు ఈ కష్టాలు కాస్త ఎక్కువ. జియో 4జీ వాయిస్ వారికి నెట్ అందుబాటులో ఉన్నా సౌకర్యాన్ని వాడుకోలేరు. ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న ఫోన్లలో 3జీ మొబైల్స్ వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. బ్యాటరీని తోడేస్తుంది రిలయన్స్ జియో తమ సర్వీస్ లను 4జీ పై అందిస్తున్నాయి. 2జీ, 3జీ సపోర్టెట్ మొబైల్స్ కంటే 4జీ మొబైల్స్ వేగంగా పనిచేయడంతో తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ తీసుకుంటుంది. కొన్ని కంపెనీలు 4జీ సర్వీసులు అందిస్తున్నా, బ్యాటరీ విషయంలో కనీసం 3వేల ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కూడా అందించడం లేదు. నెట్ వినియోగించి తరచూ వీడియోలు వీక్షించే యూజర్లు ఎక్కువగా తమ ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి ఉంటున్న విషయం తెలిసిందే. -
వాట్సాప్‌లో మరో బంపర్ ఫీచర్!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కైప్, యాపిల్ ఫేస్‌టైమ్ వంటి పోటీ యాప్స్ ను తట్టుకొని నిలబడటానికి తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్ యాడ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. తన వినియోగదారులు వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కూడా కల్పించేందుకు వాట్సాప్ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. డాటా కనెక్షన్ ఉపయోగించుకొని వినియోగదారులు ఫేస్ టు ఫేస్ వీడియో కాల్స్ చేసుకునేవిధంగా ఈ కొత్త ఫీచర్ ఉండనుంది. 'వీడియో కాల్స్'తో పాటు మరిన్ని మేజర్ ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్, జిప్ ఫైల్ షేరింట్ వంటివి సపోర్ట్ చేసేవిధంగా వాట్సాప్‌ను తీర్చిదిద్దుతోంది. ఆండ్రాయిడ్ పోలీసు వెబ్సైట్ కథనం ప్రకారం బెటా వెర్షన్ వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్ త్వరలోనే యాప్ కు చేర్చే అవకాశముందని, దీని స్క్రీన్ షాట్స్‌ను కూడా అది పోస్టు చేసింది. నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచే వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌పై వదంతులు షికారు చేస్తున్నాయి. ఇదిగో వచ్చింది.. అదిగో వచ్చింది అంటూ దీని గురించి ఊరిస్తూ కథనాలు వచ్చాయి. ఇతర భాషల నుంచి అనువదించుకునే స్ట్రీంగ్స్‌ను వాట్సాప్ యాడ్ చేసిన తర్వాత వీడియో కాల్ వచ్చేసిందంటూ కొన్ని దేశాల్లో కథనాలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిస్ కాల్ ఫీచర్ ను జోడించిన వాట్సాప్ త్వరలోనే వీడియో కాల్ అవకాశాన్ని కూడా చేర్చవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.