ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కానీ వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ వంటి ముఖ్యమైన ఫీచర్ల విషయంలో వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ వాట్సాప్ వాయిస్ రికార్డ్ ఫీచర్ అవసరమైన యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. వాట్సాప్ సంస్థ.. కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య పెంచడం, ఎమోజీ రియాక్షన్స్, ఎక్కువ మందికి వాయిస్ కాల్స్ చేసుకోవడం, చాట్ ఫిల్టర్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఏడాదిలో మరో 15 కొత్త ఫీచర్లను విడుదల చేయాల్సి ఉండగా .. ఇప్పుడు మనం అదే థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగించి వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే
వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ ప్లే స‍్టోర్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న క్యూబ్ కాల్ అనే వాట్సాప్ రికార్డ్ వాయిస్ కాల్స్ థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్స్‌కు మనం మాట్లాడుతున్న వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేసేందుకు సెట్టింగ్‌లో అనుమతి ఇవ్వాలి. సెట్టింగ్‌లో యాక్సెప్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే కాల్స్ రికార్డ్ చేయలేం.
ఒకవేళ ఉచితంగా కాల్ రికార్డ్ ఆప్షన్ లేకపోతే వారానికి లేదంటే నెలకి కొంతమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల‍్లించినప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment