ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు, రియాక్షన్స్‌తో పాటు లార్జ్‌ఫైల్ షేరింగ్ చేసే సౌకర్యాన్ని యూజర్లకు అందించనున్నట్లు మెటా ఫ్లాట్ ఫామ్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్ బెర్గ్ వాయిస్ కాల్స్ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ఒకే సారి 32 మందికి వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో, పీడీఎఫ్ వంటి 1జీబీ డేటా ఫైల్స్‌ను పంపుతుండగా ఇకపై 2జీబీ వరకు ఫార్వర్డ్ చేయోచ్చు.
ఉదాహరణకు ఓ స్కూల్‌కు చెందిన 10 వాట్సప్ గ్రూప్‌లు ఉంటే.. అందరికి ఒకే సమయంలో ఒకే మెసేజ్‌ను పంపేలా టూల్‌ను డిజైన్ చేయనున్నట్లు వాట్సాప్ స్పోక్ పర్సన్ తెలిపారు. రోజూవారీ జీవితంలో భాగమైన చాటింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అడ్వాన్స్‌గా యూజర్లకు పరిచయం చేసేలా కొత్త కొత్త యాప్స్‌ను బిల్డ్ చేస్తున్నట్లు జుకర్ బెర్గ్ తెలిపారు. తద్వారా వందల మంది యూజర్ల నుంచి వేల మంది యూజర్లు చాట్ చేసుకునేలా వీలు కలగనుంది.
చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్‌కు తలా రూ.5వేలు ఇస్తారా!!
Comments
Please login to add a commentAdd a comment