జియో ఎఫెక్ట్..ఎయిర్ టెల్ కూడా..
న్యూఢిల్లీ: జియో ఉచిత కాల్స్,ఉచిత డాటా సేవల పొడిగింపు నేపథ్యంలో మరో ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా క్యూ కట్టేసింది. దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవల్ని అందించే ఈ పథకాలను గురువారం ప్రకటించింది. రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెస్తోంది.
రూ.345 ప్యాక్ ప్రీపెయిడ్ వినియోగదారులకు భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా ఉచిత వాయిస్ కాల్స్,(లోకల్ అండ్ ఎస్టీడీ) చేయడానికి అనుమతిస్తోంది. అలాగే 1 జీబీ 4జీ డేటా ఉచితం.
రూ. 145దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం. అలాగే 300ఎంబీ 4జీ డాటా స్మార్ట్ ఫోన్లకు అందిస్తోంది. దీంతోపాటు 50ఎంబీ డాటా బేసిక్ ఫోన్లకు అందిస్తున్నట్టు తెలిపింది. 28 రోజుల వాలిడిటీ ఈరెండు ప్లాన్లను ప్రకటించింది. అయితే కేరళ ఖాతాదారులకు 2/4 జీ నెట్ వర్క్ లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వినూత్న ఆఫర్లతో ఉన్నతమైన నెట్వర్క్ అనుభవాన్ని అందించే ప్రయత్నాల్లో మరో ఆకర్షణీయమైన ఆఫర్లని ఎయిర్ టెల్ మార్కెట్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) డైరెక్టర్ పూరి తెలిపారు. కాగా రిలయన్స్ జియో సంచలన ఉచిత డాటా , కాలింగ్ సదుపాయం మార్చి 2017 పొడిగించింది. ఈక్రమంలో బీఎస్ ఎన్ఎల్, వోడాఫోన్ తన ఆపర్లను సవరించుకొని, వినియోగదారులకు కొత్త ప్రయోజనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.