
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో బాదుడుకి దిగన సంగతి తెలిసిందే. గురువారం నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జియో ట్విటర్ ద్వారా వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ జియోయేతర నంబర్లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్ ట్విటర్ పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే, రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు అందుబాటులోఉంటాయని తెలిపింది. .
అంటే ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత, ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్‌గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్‌లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాగా జియో ఈ వారం ప్రారంభంలో నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్‌లను ప్రకటించింది. రూ. 10 - రూ. 100. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు అందిస్తున్నాయి. జియో-కాని నంబర్లకు అవుట్ గోయింగ్ కాల్స్ పొందటానికి జియో ప్లాన్‌తో సంబంధం లేకుండా కొత్త టాప్-అప్ అవసరం.
An important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC
— Reliance Jio (@reliancejio) October 10, 2019