IUCS
-
వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా జియోకు షాకిచ్చింది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి)ను వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన కొద్ది గంటలకే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్) కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. జియో చార్జీల వడ్డనతో కస్టమర్లను ఆగ్రహం తెప్పిస్తే వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. తన వినియోగదారులకు ఇతర నెట్ వర్క్ కాల్స్ కోసం విడిగా బిల్లింగ్ చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా ఉచితమేనని తెలిపింది. వినియోగదారులపై భారం పడకూడదనేది తమ లక్ష్యమని వెల్లడించింది. అంతేకాదు, ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇంటర్ కనెక్ట్ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినేషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయాలని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది. వొడాఫోన్ ఐడియా భారతదేశం అంతటా వినియోగదారులకు 2జీ, 3జీ, 4జీ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు కూడా, భారతదేశంలో 50శాతం కంటే ఎక్కువ మొబైల్ వినియోగదారులు తమ ఫీచర్ ఫోన్లలో 2జీ నెట్‌వర్క్‌నే ఉపయోగిస్తున్నారని దేశంలోని మారుమూల ప్రాంతాల వినియోగదారులకు సేవ చేయడం లాభదాయకం కానప్పటికీ తాము సేవలందిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లలో 60శాతం కంటే ఎక్కువ మంది తక్కువ ఖర్చు చేసే బ్రాకెట్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ కోసం టాప్-అప్ ప్యాక్‌ల అదనపు అవసరాన్ని వారి భరించాలని కోరుకోరని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి, వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారుడు వారి మొబైల్ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి రూ.24 రీఛార్జ్ చేయవలసి ఉంటుంది, ఇది 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. కాగా జియో కానీ నెట్వర్క్ కాల్స్‌కు ఐయుసి ఛార్జీల వడ్డను ప్రకటించి వినియోగదారులకు షాకిచ్చింది జియో.ఇక పై ఇతర నెట్వర్క్ కాల్స్‌కు నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని తెలిపింది. దీనికోసం 10 రూపాయల నుంచి అదనపు టు-అప్ ప్యాక్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో వడ్డన : ఇంపార్టెంట్ అప్డేట్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో బాదుడుకి దిగన సంగతి తెలిసిందే. గురువారం నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్గోయింగ్ కాల్లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జియో ట్విటర్ ద్వారా వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ జియోయేతర నంబర్లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్ ట్విటర్ పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే, రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు అందుబాటులోఉంటాయని తెలిపింది. . అంటే ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత, ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాగా జియో ఈ వారం ప్రారంభంలో నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్లను ప్రకటించింది. రూ. 10 - రూ. 100. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు అందిస్తున్నాయి. జియో-కాని నంబర్లకు అవుట్ గోయింగ్ కాల్స్ పొందటానికి జియో ప్లాన్‌తో సంబంధం లేకుండా కొత్త టాప్-అప్ అవసరం. An important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC — Reliance Jio (@reliancejio) October 10, 2019 -
మరో మహా వినాశనం!
మానవ చర్యల వల్ల జీవజాతులు అంతరించిపోవడం వేగవంతమైందని.. ఇది భూమ్మీద ఆరో మహా వినాశనం మొదలైంది అనేందుకు నిదర్శనమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోటానుకోట్ల ఏళ్ల క్రితం గ్రహశకలం ఢీకొట్టడంతో రాక్షసబల్లులు అంతరించిపోతే.. ఆ తర్వాతి కాలంలో వేర్వేరు కారణాల వల్ల అధిక శాతం జీవజాతులు అంతరించిపోయాయి. ఇలాంటి సంఘటనలనే మహా వినాశన విపత్తులు అంటారు. అయితే ఈ తాజా మహా వినాశనం గత సంఘటనల కంటే అనూహ్యమైన వేగంతో సాగుతోందని అంటోంది 2015 నాటి అధ్యయనం. వెన్నెముక గత జీవజాతులు ఏడాదికి సగటున రెండు చొప్పున అంతరించి పోతున్నాయని, ఉభయచర జీవుల విషయంలో 41 శాతం జాతులపై కత్తి వేలాడు తుండగా.. 28% క్షీరదాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందని యూనియన్ ఫర్ కన్స ర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) జాబితా చెబుతోంది. నివాస ప్రాంతాలను కోల్పోవడం.. చేపల్లాంటి వాటిని విచ్చలవిడిగా వినియోగించడం, కాలు ష్యం.. రసాయనాలు, వాతావరణ మార్పులతో పాటు.. ఒక చోటి నుంచి ఇంకో చోటికి చేరుతున్న జీవజాతుల వల్ల స్థానిక జాతులకు ముప్పు ఏర్పడటం ఈ మహా వినాశనానికి హేతువులని ఈ అధ్యయ నానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ గెరార్డో సెబలోస్ అంటున్నారు. దాదాపు 27,600 పక్షి, ఉభయచర, క్షీరద, సరీసృపాలు ఉండే ప్రాంతాలను గుర్తించి ఈ అధ్యయనం చేశారు. ఉష్ణమండల ప్రాంతాల్లో జీవజాతుల వినాశనం ఎక్కువగా ఉండగా.. సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ ఇదేస్థాయిలో కొన్ని చోట్ల ఎక్కువగానూ జీవనాశనం ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో క్షీరదాలు ఎక్కువగా నష్టపోతున్నాయని అంచనా వేశారు. పరిస్థితి ఇలాగే కొనసా గితే.. ఈ జీవజాతుల వల్ల మనం పొందుతున్న ప్రయోజనాలు చాలా జీవుల్ని కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.