మరో మహా వినాశనం!
మానవ చర్యల వల్ల జీవజాతులు అంతరించిపోవడం వేగవంతమైందని.. ఇది భూమ్మీద ఆరో మహా వినాశనం మొదలైంది అనేందుకు నిదర్శనమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోటానుకోట్ల ఏళ్ల క్రితం గ్రహశకలం ఢీకొట్టడంతో రాక్షసబల్లులు అంతరించిపోతే.. ఆ తర్వాతి కాలంలో వేర్వేరు కారణాల వల్ల అధిక శాతం జీవజాతులు అంతరించిపోయాయి. ఇలాంటి సంఘటనలనే మహా వినాశన విపత్తులు అంటారు. అయితే ఈ తాజా మహా వినాశనం గత సంఘటనల కంటే అనూహ్యమైన వేగంతో సాగుతోందని అంటోంది 2015 నాటి అధ్యయనం.
వెన్నెముక గత జీవజాతులు ఏడాదికి సగటున రెండు చొప్పున అంతరించి పోతున్నాయని, ఉభయచర జీవుల విషయంలో 41 శాతం జాతులపై కత్తి వేలాడు తుండగా.. 28% క్షీరదాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందని యూనియన్ ఫర్ కన్స ర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) జాబితా చెబుతోంది. నివాస ప్రాంతాలను కోల్పోవడం.. చేపల్లాంటి వాటిని విచ్చలవిడిగా వినియోగించడం, కాలు ష్యం.. రసాయనాలు, వాతావరణ మార్పులతో పాటు.. ఒక చోటి నుంచి ఇంకో చోటికి చేరుతున్న జీవజాతుల వల్ల స్థానిక జాతులకు ముప్పు ఏర్పడటం ఈ మహా వినాశనానికి హేతువులని ఈ అధ్యయ నానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ గెరార్డో సెబలోస్ అంటున్నారు.
దాదాపు 27,600 పక్షి, ఉభయచర, క్షీరద, సరీసృపాలు ఉండే ప్రాంతాలను గుర్తించి ఈ అధ్యయనం చేశారు. ఉష్ణమండల ప్రాంతాల్లో జీవజాతుల వినాశనం ఎక్కువగా ఉండగా.. సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ ఇదేస్థాయిలో కొన్ని చోట్ల ఎక్కువగానూ జీవనాశనం ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో క్షీరదాలు ఎక్కువగా నష్టపోతున్నాయని అంచనా వేశారు. పరిస్థితి ఇలాగే కొనసా గితే.. ఈ జీవజాతుల వల్ల మనం పొందుతున్న ప్రయోజనాలు చాలా జీవుల్ని కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.