జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం | Industry relieved that Jio will start charging: COAI | Sakshi
Sakshi News home page

జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం

Published Tue, Feb 21 2017 6:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం

జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో తాజా ప్రకటనపై   సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా  (సీఓఏఐ) హర్షం వ్యక్తం చేసింది.    రిలయన్స్ జియో ఉచిత సేవలకు   గుడ్‌ బై చెప్పి   టారిఫ్‌ వార్‌ లోకి  ఎంట్రీ ఇవ్వడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి  అమలు కానున్న టారిఫ్‌లను ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రీకి ఊరట లభించినట్టు  పేర్కొంది.  ఉచిత సేవలస్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్రమకు గుడ్‌ న్యూస్‌ అని  వ్యాఖ్యానించింది

 ఉచిత సేవలకు టాటా చెపుతూ టారిఫ్‌ ప్లాన్స్‌ను ప్రకటించడంపై  టెలికాం సంస్థలు ఇంకా  స్పందించాల్సి ఉన్నప్పటికీ , పరిశ్రమ పరిశీలకుడిగా, జియో ప్రకటనతో పరిశ్రమ ఉపశమనంగా ఉంటుందని   చెప్పగలననికాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌  రాజన్‌ మాథ్యూస్‌ పీటీఐకి తెలిపారు.  ఇప్పటికైనా చార్జీల వసూళ్లను ప్రారంభించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. జియో మంగళవారం ప్రకటించిన రూ.99,  రూ.303 ప్లాన్స్‌ మంచివే అన్నారు.  యావరేజ్‌ రెవెన్యూ పెర్‌ యూజర్‌ రూ.180 నుంచి రూ.300గా నిలవనుందని తెలిపారు.  

కాగా ముంబైలో నేడు  ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ  తన టెలికాం వెంచర్ జియో కేవలం 170 రోజుల్లో  100 మిలియన్ చందాదారులు మైలురాయిని ప్రకటించారు.   జియో ఎంట్రీతో యూజర్లను డిజిటల్‌గా,  బ్యూటిఫుల్‌ మార్చేసామన్నారు.  దీంతోపాటు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రాంను మార్చి 1 నుంచి  ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లను వెల్లడించారు. రూ 99 , రూ 303 నెలకు రుసుముగా వన్‌ టైం  పేమెంట్‌ ద్వారా జియో మార్చి 31, 2017 తరువాత కూడా తన ప్రస్తుత చందాదారులు మరియు కొత్త వినియోగదారులు, మరో సంవత్సరం దాని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' అపరిమిత ప్రయోజనాలు కొనసాగుతాయని ప్రకటించారు. మార్చి 31, 2018 వరకు ఉచిత కాలింగ్‌ సదుపాయం అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించిన సంగతి  తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement