relieved
-
TG: ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన ప్రభుత్వం
సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్ 16) సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయనున్నారు. ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు క్రిస్టినా, జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.ఇదీ చదవండి: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
ఆ పాస్టర్‌ను తప్పించారు..
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను తాత్కాలికంగా పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటికన్ నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం అందిందని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా గురువారం నిర్ధారించింది. కేరళ నన్‌పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో చట్టపరంగా వాటిని ఎదుర్కొనేవరకూ తనను చర్చి బాధ్యతల నుంచి తప్పించాలని ములక్కల్ పోప్‌కు లేఖ రాసిన క్రమంలో బిషప్ వినతిని అంగీకరించారు. జలంధర్ చర్చ్‌కు బిషప్ అగ్నెలో రఫినో గ్రాసియస్ను నియమిస్తున్నట్టు వాటికన్ ప్రకటన పేర్కొంది. కాగా ములక్కల్‌ను కేరళ పోలీసులతో కూడిన సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ములక్కల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించిన కేరళ హైకోర్టు ఈనెల 25న విచారణను చేపట్టనుంది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. -
జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తాజా ప్రకటనపై సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి అమలు కానున్న టారిఫ్‌లను ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రీకి ఊరట లభించినట్టు పేర్కొంది. ఉచిత సేవలస్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్రమకు గుడ్ న్యూస్ అని వ్యాఖ్యానించింది ఉచిత సేవలకు టాటా చెపుతూ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించడంపై టెలికాం సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉన్నప్పటికీ , పరిశ్రమ పరిశీలకుడిగా, జియో ప్రకటనతో పరిశ్రమ ఉపశమనంగా ఉంటుందని చెప్పగలననికాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పీటీఐకి తెలిపారు. ఇప్పటికైనా చార్జీల వసూళ్లను ప్రారంభించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. జియో మంగళవారం ప్రకటించిన రూ.99, రూ.303 ప్లాన్స్ మంచివే అన్నారు. యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ రూ.180 నుంచి రూ.300గా నిలవనుందని తెలిపారు. కాగా ముంబైలో నేడు ప్రెస్ మీట్ నిర్వహించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తన టెలికాం వెంచర్ జియో కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ చందాదారులు మైలురాయిని ప్రకటించారు. జియో ఎంట్రీతో యూజర్లను డిజిటల్‌గా, బ్యూటిఫుల్ మార్చేసామన్నారు. దీంతోపాటు ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రాంను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లను వెల్లడించారు. రూ 99 , రూ 303 నెలకు రుసుముగా వన్ టైం పేమెంట్ ద్వారా జియో మార్చి 31, 2017 తరువాత కూడా తన ప్రస్తుత చందాదారులు మరియు కొత్త వినియోగదారులు, మరో సంవత్సరం దాని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' అపరిమిత ప్రయోజనాలు కొనసాగుతాయని ప్రకటించారు. మార్చి 31, 2018 వరకు ఉచిత కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.