
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను తాత్కాలికంగా పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటికన్ నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం అందిందని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా గురువారం నిర్ధారించింది. కేరళ నన్‌పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో చట్టపరంగా వాటిని ఎదుర్కొనేవరకూ తనను చర్చి బాధ్యతల నుంచి తప్పించాలని ములక్కల్ పోప్‌కు లేఖ రాసిన క్రమంలో బిషప్ వినతిని అంగీకరించారు. జలంధర్ చర్చ్‌కు బిషప్ అగ్నెలో రఫినో గ్రాసియస్‌ను నియమిస్తున్నట్టు వాటికన్ ప్రకటన పేర్కొంది. కాగా ములక్కల్‌ను కేరళ పోలీసులతో కూడిన సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు ములక్కల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించిన కేరళ హైకోర్టు ఈనెల 25న విచారణను చేపట్టనుంది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment