తిరువనంతపురం : లైంగిక దాడి కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ నన్‌పై బిషప్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నాల వెనుక నిందితుడు ములక్కల్ ప్రమేయం ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
సరైన పత్రాలను పోలీసులకు సమర్పించని పక్షంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌పై తాను ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించారు. కాగా ఈ కేసుకు సంబంధించి తాజా సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను తక్షణమే సమర్పించాలని పాలాలోని జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు దర్యాప్తు అధికారిని ఆదేశించింది. బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనను లైంగికంగా వేధించారని కేరళ నన్ 2018 జూన్ 27న కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment