బిషప్ ఫ్రాంకో ములక్కల్ (ఫైల్‌ఫోటో)
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న జలంధర్ చర్చ్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్ అయిన తొలి భారతీయ కాథలిక్ బిషప్ ములక్కల్ కావడం గమనార్హం. కొచ్చిలో శుక్రవారం సాయంత్రం బిషప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఫ్రాంకో ములక్కల్ జలంధర్ చర్చ్ కేరళలో నిర్వహిస్తున్న స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన క్రమంలో పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించాలని పోప్‌కు ములక్కల్ లేఖ రాసిన క్రమంలో ఆయన స్ధానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్ నుంచి అధికారిక సమాచారం అందిందని చర్చి వర్గాలు తెలిపాయి. బిషప్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలి నుంచి తాజా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మూడు రోజుల కిందట కేసుకు సంబంధించి ములక్కల్‌ను పోలీసు అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment