సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్ 16) సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయనున్నారు.
ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు క్రిస్టినా, జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.
ఇదీ చదవండి: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment