
సాక్షి,న్యూఢిల్లీ: దివాళీకి ముందే వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మెగా ఆఫర్ ప్రకటించింది.కొత్తగా రూ 399 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ప్రీపెయిడ్ యూజర్లు 90 జీబీ 4జీ డేటాను వాడుకోవడంతో పాటు రీచార్జ్ చేయించుకున్నప్పటి నుంచి ఆరు నెలల వరకూ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమేనని తెలిసింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 399 ప్లాన్‌కు దీటుగా పండగ సీజన్ ఆరంభంలోనే కొత్త ప్లాన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేసింది. ఎయిర్‌టెల్ 399 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల పాటు 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రిలయన్స్ జియో 399 ప్లాన్‌లో తన ప్రైమ్ యూజర్లకు 84 రోజుల పాటు 84 జీబీ డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ప్లాన్‌లో జియో ప్రైమ్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌ను ఆఫర్ చేసింది.ఇక దివాళీ ఆఫర్లలో భాగంగా రూ 399 రీచార్జి చేసుకునే కస్టమర్లకు వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. రూ 50 డినామినేషన్‌తో ఉండే ఈ వోచర్లు నవంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment