Vodafone offer
-
కస్టమర్లకు వొడాఫోన్ మరో ఆఫర్
ముంబై: మొబైల్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా తమ పోస్ట్‌పేడ్ కస్టమర్లకు మరో ఆఫర్ ప్రకటించింది. పోస్ట్‌పేడ్ కస్టమర్లకు ఈసిమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అయితే యాపిల్ స్మార్ట్ఫోన్లను వాడే కస్టమర్లకు మాత్రమే మొదటగా ఇసిమ్ అందుబాటులో రానుందని తెలిపింది. కాగా త్వరలోనే శాంసంగ్ గాలెక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ గాలెక్సీ ఫోల్డ్ స్మార్ట్ఫోన్లకు ఇసిమ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలు తమ కస్టమర్లకు ఇసిమ్ సేవలు అందుబాటులో ఉంచామని, త్వరలోనే దేశంలోనే మిగతా నగరాలకు విస్తరిస్తామని వోడాఫోన్ తెలిపింది ఇసిమ్‌ను ఇన్స్టాల్ చేసుకునే విధానం: వొడాఫోన్ కస్టమర్ అయితే 199నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి, తరువాత eSIM(ఇసిమ్) ఈమెయిల్ ఐడీని టైప్ చేయాలి. ఈమెయిల్‌ను నమోదు చేశాక మెదట ఎస్ఎమ్ఎస్ను పంపించి, ఇన్స్టాల్ ప్రక్రియను ప్రారంభించాలి. సరియైన ఈమెయిల్‌ను నమోదు చేస్తే 199 అనే నంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఆ తరువాత ఇసిమ్ ఆఫర్‌ను నిర్దారిచడానికి కస్టమర్లు ఈసిమ్‌వైతో రిప్లై చేయాలి. ఆ తర్వాత కస్టమర్ల అభ్యర్థనకు మరోసారి 199నెంబర్‌తో మరో ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్టరయిన ఈమెయిల్‌కు క్యూఆర్ కోడ్ వస్తుంది. కస్టమర్లు క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియలో మొదటగా కస్టమర్లు తమ మొబైల్‌ను వైఫైలేదా మొబైల్ డేటాకు కనెక్ట్ చేయాలి. కనెక్టు చేశాక సెట్టింగ్స్ ఆఫ్టన్‌లోకి వెళ్లాక యాడ్ డేటా ప్లాన్ దగ్గర క్లిక్ చేయాలి. మరోవైపు కొత్త కస్టమర్లకు వొడాఫోన్ స్టోర్స్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. పైన తెలిపిన ప్రక్రియనే వారు కూడా అనుసరించవచ్చు. ఇసిమ్‌ను ద్వారా విభిన్న ఫ్రోఫైల్స్‌ను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (చదవండి: భారత్‌లో కష్టమే అంటున్న వొడాపోన్ ఐడియా) -
వొడాఫోన్ 399 ప్లాన్
సాక్షి,న్యూఢిల్లీ: దివాళీకి ముందే వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మెగా ఆఫర్ ప్రకటించింది.కొత్తగా రూ 399 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ప్రీపెయిడ్ యూజర్లు 90 జీబీ 4జీ డేటాను వాడుకోవడంతో పాటు రీచార్జ్ చేయించుకున్నప్పటి నుంచి ఆరు నెలల వరకూ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమేనని తెలిసింది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో 399 ప్లాన్‌కు దీటుగా పండగ సీజన్ ఆరంభంలోనే కొత్త ప్లాన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేసింది. ఎయిర్టెల్ 399 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల పాటు 4జీ హ్యాండ్సెట్ యూజర్లకు అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రిలయన్స్ జియో 399 ప్లాన్‌లో తన ప్రైమ్ యూజర్లకు 84 రోజుల పాటు 84 జీబీ డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ప్లాన్‌లో జియో ప్రైమ్ యూజర్లు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్ చేసింది.ఇక దివాళీ ఆఫర్లలో భాగంగా రూ 399 రీచార్జి చేసుకునే కస్టమర్లకు వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. రూ 50 డినామినేషన్‌తో ఉండే ఈ వోచర్లు నవంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
ఆ ఫోన్లకు వొడాఫోన్ ఫ్రీ టాక్‌టైమ్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌ను ఇప్పటికే కుదేలు చేసిన రిలయన్స్ జియో, 4జీ ఫీచర్ ఫోన్‌తో టెల్కోలను మరింత దెబ్బకొట్టడానికి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయాయి. సెప్టెంబర్‌లో ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. తమల్ని మరింత కుదేలు చేయడానికి వస్తున్న జియోకు ఎలాగైనా పోటీగా నిలబడాలని టెలికాం దిగ్గజాలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా దేశీయంగా రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా పేరున్న వొడాఫోన్ ఇండియా, చైనాకు చెందిన ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంటెల్ 2జీ ఫీచర్‌ఫోన్లపై భారీమొత్తంలో వాయిస్ కాల్స్‌ను, క్యాష్‌బ్యాక్‌లను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. వాయిస్ యూజర్ బేస్ జియోకు తరలిపోకుండా ఆపేందుకు వొడాఫోన్ ఈ ప్లాన్ వేసింది. ఎవరైతే రూ.800 నుంచి రూ.1600 మధ్యలో ధర కలిగిన ఇంటెల్ ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తారో వారికి, రూ.50 విలువ కలిగిన టాక్‌టైమ్ 18 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వొడాఫోన్‌కు 80 శాతం రెవెన్యూలు వాయిస్ వ్యాపారాల నుంచి వస్తుండటంతో, టెల్కో ఈ ఆఫర్ల వర్షం కురిపిస్తుందని సెక్టార్ యానలిస్టులు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ చెప్పారు. ఈ ఆఫర్ కింద వొడాఫోన్ యూజర్లు ఇంటెల్ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్న ఇన్స్టాల్మెంట్లలో నెలలో రూ.100 మొత్తంతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రతినెలా రూ.50 విలువ కలిగిన అదనపు టాక్‌టైమ్, వచ్చే 18 నెలల పాటు అందించనుంది. మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇంటెల్ అందించనుంది. అంటే రూ.800 ఇంటెల్ ఫోన్ పూర్తిగా ఉచితమన్నమాట. ఫెస్టివ్ సీజన్‌కు అనుకూలంగా ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 31 వరకు వొడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుందని ఇంటెల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుదీర్ కుమార్ చెప్పారు. జియో ఫోన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్, ఇంటెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. వాయిస్ సర్వీసుల కోసం ఫీచర్ ఫోన్ వాడుతున్న మెజార్టీ కస్టమర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్కు చెందినవారే. ఎక్కువగా వారి రెవెన్యూలు కూడా వాయిస్ నుంచే వస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా ఎయిర్టెల్ కూడా రూ.2500 ధరతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది.