ఆ ఫోన్లకు వొడాఫోన్‌ ఫ్రీ టాక్‌టైమ్‌ ఆఫర్లు | To combat Reliance Jio, Vodafone to offer free talk time with Itel phones | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్లకు వొడాఫోన్‌ ఫ్రీ టాక్‌టైమ్‌ ఆఫర్లు

Published Sat, Aug 26 2017 9:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

ఆ ఫోన్లకు వొడాఫోన్‌ ఫ్రీ టాక్‌టైమ్‌ ఆఫర్లు

ఆ ఫోన్లకు వొడాఫోన్‌ ఫ్రీ టాక్‌టైమ్‌ ఆఫర్లు

సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌ను ఇప్పటికే కుదేలు చేసిన రిలయన్స్‌ జియో, 4జీ ఫీచర్‌ ఫోన్‌తో టెల్కోలను మరింత దెబ్బకొట్టడానికి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభమైపోయాయి. సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. తమల్ని మరింత కుదేలు చేయడానికి వస్తున్న జియోకు ఎలాగైనా పోటీగా నిలబడాలని టెలికాం దిగ్గజాలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా దేశీయంగా రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా పేరున్న వొడాఫోన్‌ ఇండియా, చైనాకు చెందిన ఇంటెల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంటెల్‌ 2జీ ఫీచర్‌ఫోన్లపై భారీమొత్తంలో వాయిస్‌ కాల్స్‌ను, క్యాష్‌బ్యాక్‌లను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. 
 
వాయిస్‌ యూజర్‌ బేస్‌ జియోకు తరలిపోకుండా ఆపేందుకు వొడాఫోన్‌ ఈ ప్లాన్‌ వేసింది. ఎవరైతే రూ.800 నుంచి రూ.1600 మధ్యలో ధర కలిగిన ఇంటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తారో వారికి, రూ.50 విలువ కలిగిన టాక్‌టైమ్‌ 18 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వొడాఫోన్‌కు 80 శాతం రెవెన్యూలు వాయిస్‌ వ్యాపారాల నుంచి వస్తుండటంతో, టెల్కో ఈ ఆఫర్ల వర్షం కురిపిస్తుందని సెక్టార్‌ యానలిస్టులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ చెప్పారు. ఈ ఆఫర్‌ కింద వొడాఫోన్‌ యూజర్లు ఇంటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్న ఇన్‌స్టాల్‌మెంట్లలో నెలలో రూ.100 మొత్తంతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రతినెలా రూ.50 విలువ కలిగిన అదనపు టాక్‌టైమ్‌, వచ్చే 18 నెలల పాటు అందించనుంది. మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇంటెల్‌ అందించనుంది. అంటే రూ.800 ఇంటెల్‌ ఫోన్‌ పూర్తిగా ఉచితమన్నమాట. 
 
ఫెస్టివ్‌ సీజన్‌కు అనుకూలంగా ఆగస్టు 25 నుంచి అక్టోబర్‌ 31 వరకు వొడాఫోన్‌ కస్టమర్లకు ఈ ఆఫర్‌ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుందని ఇంటెల్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుదీర్‌ కుమార్‌ చెప్పారు. జియో ఫోన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్‌, ఇంటెల్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. వాయిస్‌ సర్వీసుల కోసం ఫీచర్‌ ఫోన్‌ వాడుతున్న మెజార్టీ కస్టమర్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌కు చెందినవారే. ఎక్కువగా వారి రెవెన్యూలు కూడా వాయిస్‌ నుంచే వస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ కూడా రూ.2500 ధరతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement