Itel phones
-
తక్కువ ధరలోనే ఐటెల్ 4జి ట్యాబ్ వచ్చేసింది.. వివరాలు
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఐటెల్ కంపెనీ తన మొదటి ట్యాబ్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ట్యాబ్ పేరు 'ఐటెల్ ప్యాడ్ వన్'. దీని ధర రూ.12,999. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ ట్యాబ్ త్వరలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ తక్కువ ధరలకు లభించే లేటెస్ట్ ట్యాబ్. ఇది డీప్ గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 4జీ కనెక్టివిటీ ఫీచర్ కలిగి, మెటల్ బాడీ పొందుతుంది. 10.1 ఇంచెస్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ట్యాబ్ ఎడ్జ్‌లు ఫ్లాట్‌గా ఉండటం వల్ల మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్‌లో యునీఎస్ఓసీ ఎస్సీ9863ఏ1 ప్రాససెర్ ఉంటుంది. మొమరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. అంతే కాకుండా, ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ట్యాబ్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కావున ఇది స్టాండర్డ్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వైపై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అప్షన్ అవుతుంది. -
ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐటెల్ అతి తక్కువ ధరలో 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. మ్యాజిక్ సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ మొబైల్లో వైఫై, హట్‌స్పాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎనిమిది డివైజ్‌లను కనెక్ట్ చేసుకొవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫోన్ డ్యూయల్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తోంది. కాగా ఈ ఫోన్ ధరను రూ. 2,349గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్ వేరియంట్లలో లభించనుంది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ ఫీచర్లు 2.4-అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే 128 ఏంబీ ర్యామ్, 64 జీబీ ఎక్పపాండబుల్ స్టోరేజ్ 1,900 ఎంఏహెచ్ బ్యాటరీ 1.3 ఎంపీ రియర్ కెమరా విత్ ఫ్లాష్ వైఫై, హట్‌స్పాట్ బ్లూటూత్ చదవండి: పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ -
కేవలం రూ.4 వేలకే ఐటెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
ఐటెల్ ఏ23 ప్రో ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలైంది. ఇది రెండు రంగు కలర్స్ తో లభిస్తుంది. ఐటెల్ ఏ23 ప్రో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద నడుస్తుంది. ఇది సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఎంట్రీ లెవల్ ఫోన్ కావడంతో, డిస్ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్‌తో టాప్ బెజెల్ హౌసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐటెల్ ఏ23 ప్రో రిటైల్ ధర రూ. 4,999, కానీ రిలయన్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ కింద రూ.3,899 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐటెల్ ఏ23 ప్రో ఫీచర్స్: 5 అంగుళాల డిస్ ప్లే క్వాడ్-కోర్ యునిసోక్ SC9832E ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా డ్యూయల్ సీమ్ 4జీ, వై-ఫై, వోల్టిఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మైక్రో-యుఎస్బి చార్జర్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
ఆ ఫోన్లకు వొడాఫోన్ ఫ్రీ టాక్‌టైమ్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌ను ఇప్పటికే కుదేలు చేసిన రిలయన్స్ జియో, 4జీ ఫీచర్ ఫోన్‌తో టెల్కోలను మరింత దెబ్బకొట్టడానికి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయాయి. సెప్టెంబర్‌లో ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. తమల్ని మరింత కుదేలు చేయడానికి వస్తున్న జియోకు ఎలాగైనా పోటీగా నిలబడాలని టెలికాం దిగ్గజాలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా దేశీయంగా రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా పేరున్న వొడాఫోన్ ఇండియా, చైనాకు చెందిన ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంటెల్ 2జీ ఫీచర్‌ఫోన్లపై భారీమొత్తంలో వాయిస్ కాల్స్‌ను, క్యాష్‌బ్యాక్‌లను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. వాయిస్ యూజర్ బేస్ జియోకు తరలిపోకుండా ఆపేందుకు వొడాఫోన్ ఈ ప్లాన్ వేసింది. ఎవరైతే రూ.800 నుంచి రూ.1600 మధ్యలో ధర కలిగిన ఇంటెల్ ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తారో వారికి, రూ.50 విలువ కలిగిన టాక్‌టైమ్ 18 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వొడాఫోన్‌కు 80 శాతం రెవెన్యూలు వాయిస్ వ్యాపారాల నుంచి వస్తుండటంతో, టెల్కో ఈ ఆఫర్ల వర్షం కురిపిస్తుందని సెక్టార్ యానలిస్టులు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ చెప్పారు. ఈ ఆఫర్ కింద వొడాఫోన్ యూజర్లు ఇంటెల్ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్న ఇన్స్టాల్మెంట్లలో నెలలో రూ.100 మొత్తంతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రతినెలా రూ.50 విలువ కలిగిన అదనపు టాక్‌టైమ్, వచ్చే 18 నెలల పాటు అందించనుంది. మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇంటెల్ అందించనుంది. అంటే రూ.800 ఇంటెల్ ఫోన్ పూర్తిగా ఉచితమన్నమాట. ఫెస్టివ్ సీజన్‌కు అనుకూలంగా ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 31 వరకు వొడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుందని ఇంటెల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుదీర్ కుమార్ చెప్పారు. జియో ఫోన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్, ఇంటెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. వాయిస్ సర్వీసుల కోసం ఫీచర్ ఫోన్ వాడుతున్న మెజార్టీ కస్టమర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్కు చెందినవారే. ఎక్కువగా వారి రెవెన్యూలు కూడా వాయిస్ నుంచే వస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా ఎయిర్టెల్ కూడా రూ.2500 ధరతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది.