ఐటెల్‌ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్‌   | Itel Launches 4G Smart Phone | Sakshi
Sakshi News home page

ఐటెల్‌ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్‌  

Published Tue, Jun 15 2021 9:34 PM | Last Updated on Tue, Jun 15 2021 10:18 PM

Itel Launches 4G Smart Phone   - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఐటెల్‌ అతి తక్కువ ధరలో 4జీ మొబైల్‌ను లాంచ్‌  చేసింది. మ్యాజిక్‌ సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ఐటెల్ మ్యాజిక్‌-2 4జీ మొబైల్లో వైఫై, హట్‌స్పాట్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎనిమిది డివైజ్‌లను కనెక్ట్‌ చేసుకొవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తోంది. కాగా ఈ ఫోన్‌ ధరను రూ. 2,349గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్‌ వేరియంట్లలో లభించనుంది.  

ఐటెల్‌ మ్యాజిక్‌-2 4జీ ఫీచర్లు

  • 2.4-అంగుళాల 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే
  • 128 ఏంబీ ర్యామ్, 64 జీబీ ఎక్పపాండబుల్‌ స్టోరేజ్‌
  • 1,900 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 1.3 ఎంపీ రియర్‌ కెమరా విత్‌ ఫ్లాష్‌
  • వైఫై, హట్‌స్పాట్‌
  • బ్లూటూత్‌ 

చదవండి: పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్‌మీ జీటీ 5జీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement