
ఐటెల్ ఏ23 ప్రో ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలైంది. ఇది రెండు రంగు కలర్స్ తో లభిస్తుంది. ఐటెల్ ఏ23 ప్రో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద నడుస్తుంది. ఇది సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఎంట్రీ లెవల్ ఫోన్ కావడంతో, డిస్ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్‌తో టాప్ బెజెల్ హౌసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐటెల్ ఏ23 ప్రో రిటైల్ ధర రూ. 4,999, కానీ రిలయన్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ కింద రూ.3,899 ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐటెల్ ఏ23 ప్రో ఫీచర్స్:
- 5 అంగుళాల డిస్ ప్లే
- క్వాడ్-కోర్ యునిసోక్ SC9832E ప్రాసెసర్
- 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా
- డ్యూయల్ సీమ్ 4జీ, వై-ఫై, వోల్టిఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
- మైక్రో-యుఎస్‌బి చార్జర్
- ఫేస్ అన్‌లాక్ ఫీచర్
- 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment