బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే.. | Best Gaming Phones Under Rs 15000 | Sakshi
Sakshi News home page

బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..

Published Wed, Nov 27 2024 8:51 PM | Last Updated on Wed, Nov 27 2024 9:21 PM

Best Gaming Phones Under Rs 15000

భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్‌లను గురించి వివరంగా తెలుసుకుందాం.

సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.

పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్‌ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.

రెడ్‌మీ 13 5జీ: రెడ్‌మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్‌ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.

ఇన్‌ఫినిక్స్‌ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్‌లలో ఇన్‌ఫినిక్స్‌ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్‌ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement