పాలపొడితో దీపావళి కోసం స్పెషల్‌ స్వీట్‌.. చేసుకోండిలా | Diwali Festival 2023 Special Recipes: How To Made Dish Sheer Pira Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Sheer Pira Recipe: పాలపొడితో దీపావళి కోసం స్పెషల్‌ స్వీట్‌.. చేసుకోండిలా

Published Fri, Nov 10 2023 2:46 PM | Last Updated on Fri, Nov 10 2023 3:32 PM

Diwali Spcial Sweet Dish Sheer Pira Recipe In Telugu - Sakshi

షీర్‌ పీరా తయారికి కావల్సినవి:

పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు;
బాదం పలుకులు – టేబుల్‌ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్‌ స్పూను;
పిస్తా పలుకులు – టేబుల్‌ స్పూను; కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూను;
యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్‌ స్పూను;
గార్నిష్‌ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్‌ స్పూను (పెద్దసైజువి). 

తయారీ విధానమిలా:
డ్రైఫ్రూట్స్‌ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే  ఉండాలి ∙

దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్‌మిస్‌ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్‌చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement