Diwali special
-
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్‌చేసి సర్వ్ చేసుకోవాలి. -
డీమార్ట్ ఉన్న ఏకైక మాల్ మాదే... ప్రతి వీకెండ్ ఈవెంట్స్ ఉంటాయి
-
Recipe: వాల్నట్ హల్వా.. ఇలా ట్రై చేసి చూడండి!
Recipes In Telugu: వాల్నట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. అయితే చాలా మంది నోటికి అంతగా రుచించదు ఈ డ్రైఫ్రూట్. అలాంటి వారికి ఈ దీపావళి పండుగ వేళ వాల్‌నట్స్‌తో హల్వా చేసి పెట్టండి. నోరు తీపి చేయడంతో పాటు పోషకాలూ అందించినట్లవుతుంది! వాల్నట్ హల్వా తయారీకి కావాలసిన పదార్థాలు: ►వాల్నట్స్ – ఒక కప్పు ►పంచదార – అర కప్పు ►పాలు – అర కప్పు ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ►కుంకుమ పువ్వు – చిటికెడు ►గార్నిషింగ్ కోసం సిల్వర్ ఫాయిల్ వాల్నట్ హల్వా తయారీ విధానం: ►వాల్‌నట్స్‌ను బరకగా దంచుకోవాలి. ►పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ►ఒక గిన్నెలో పంచదార, పాలు, కుంకుమ పువ్వు వేయాలి ►పంచదార కరిగి పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టాలి. ►ఆ తర్వాత మూకుడులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి ►అందులో వాల్నట్స్ పొడి వేసి, సన్నని మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించాలి ►వేగిన తర్వాత దీనిలో పాల మిశ్రమం పోయాలి. రెండు నిమిషాలు బాగా కలపాలి ►ఆ తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి ►అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ►నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారనివ్వాలి ►దీని పైన సిల్వర్ ఫాయిల్ అద్ది, ముక్కలుగా కట్ చేసుకుంటే వాల్నట్ హల్వా రెడీ! ఇవి కూడా ట్రై చేయండి: Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా! ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి! -
దీపావళి ధర్మ సందేహాలు
-
వెలుగు జిలుగులు: ఆకట్టుకుంటున్న విభిన్న ఆకృతుల ప్రమిదలు
-
Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!!
పండగంటే పెద్దగా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది. మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీ మధుర స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా. డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ మీ లైఫ్‌లో ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ బెస్ట్! ఇదేకాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు, టోఫీలు, కప్‌కేక్‌లు వంటి ఇతర తినగలిగిన వస్తువులు ఉన్న బాస్కెట్లను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చు. కుకీస్ గిఫ్ట్ కుకీస్‌లను బహుమతిగా ఇవ్వవడం మంచి ఎంపిక. టీ, కాఫీలతో తినడానికి ఇవి ఉత్తమమైనవి. ఈ రోజుల్లో, చోకో చిప్, జీడిపప్పు బాదం, తాజా పండ్లు వంటి అనేక రకాల కుకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ప్రియమైన వ్యక్తులకు ఇస్తే అస్సలు వద్దనరు. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. ఫ్రూట్ బాస్కెట్ మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా సర్ది కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు. స్నాక్స్ మీరు ఏదైనా విభిన్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. అల్పాహారంగా తినగలిగే స్నాక్స్ ఐటమ్స్ మిక్స్ చేసిన గిఫ్ట్ బాక్స్‌ను తయారు చేసి ఇవ్వొచ్చు. ఇందులో పోహా, ఓట్స్ మ్యాగీ, ఇడ్లీ దోస పిండి, రవ్వ ఇడ్లీ పిండి, చాక్లెట్లు, టోఫీ పెట్టుకోవచ్చు. టెట్రా జ్యూస్ ప్యాక్ మిక్స్ విభిన్న రుచుల్లో ఉండో టెట్రా జ్యూస్ ప్యాక్‌లతో కూడా గిఫ్ట్ బాక్స్‌లను తయారు చేయవచ్చు. వీటిని కూడా మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా అందించవచ్చు. చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
పండుగ రుచులు.. కరాచీ హల్వా, ఛెన పొడ ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పండుగకు ఈ కొత్త రుచులతో మీ ఇంటి అతిధులకు పసందైన విందు ఇవ్వండి. కరాచీ హల్వా కావల్సిన పదార్థాలు కార్న్‌ఫ్లోర్ – కప్పు, నీళ్లు – ఒకటింబావు కప్పు, పంచదార – ఒకటి ముప్పావు కప్పు యాలకులపొడి – అర టీస్పూను నెయ్యి – ముప్పావు కప్పు పిస్తా, జీడి పప్పు, బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ ఫుడ్ కలర్– చిటికెడు తయారీ విధానం ►గిన్నెలో కార్న్‌ఫ్లోర్ ఒకటింబావు కప్పు నీళ్లు , ఆరెంజ్ కలర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కనబెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కిన తరువాత పంచదార, ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ►సుగర్ సిరప్ తీగపాకం వచ్చాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి తిప్పుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడిన తరువాత నెయ్యి, డ్రైఫ్రూట్స్వేసి తిప్పాలి. ►నెయ్యి పైకి తేలి, బాణలీకి అంటుకోకుండా ఉండకట్టినప్పుడు బాణలి నుంచి తీసి నెయ్యిరాసిన పాన్‌లో వేయాలి. రెండు గంటలు ఆరాక ముక్కలు కట్ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ. ఛెన పొడ కావల్సిన పదార్థాలు పాలు – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – పావు కప్పు సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు – మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి – టీస్పూను, బాదం, జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – పావు టీస్పూను తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, తరువాత నిమ్మరసం వేసి తిప్పాలి. ►విరిగిన పాలను వడగట్టి పాల మిశ్రమాన్ని తీసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తరువాత పంచదార, రవ్వ వేసి, పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ►ఇప్పుడు కొద్దిగా నీళ్లుపోసుకుని కేక్ బ్యాటర్లా కలపాలి. ►తరువాత టీ స్పూను నెయ్యి, బాదం, జీడిపలుకులు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు ఒక పాత్రకు అడుగుభాగంలో నెయ్యిరాసి ఈ బ్యాటర్‌ను దానిలో పోయాలి. ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి, అడుగు భాగంలో సాల్ట్‌వేసి పైన చిన్న స్టాండ్ పెట్టి కేక్ బ్యాటర్ గిన్నె పెట్టాలి. కుకర్ మూతకున్న గ్యాస్కటర్, విజిల్ తీసి కుకర్ మూతపెట్టి అరగంట పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఒవెన్ ఉన్నవారు 180 డిగ్రీల సెల్సియస్‌లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ►అరగంట తరువాత మూత తీసి పాత్రను చల్లారనిచ్చి ముక్కలు చేస్తే ఛెనపొడ రెడీ. చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
దీపావళి స్పెషల్ 2021: కామాఖ్య ఆలయం.. విహార విశేషాలు!
శుభ కామన దీపం అస్సాం రాష్ట్రం, గువాహటి. నీలాచల పర్వత శ్రేణులతో అందమైన ప్రదేశం. ఇక్కడే ఉంది కామాఖ్య ఆలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పురాణకాలంలో నరకాసురుడు నిర్మించాడని చెబుతారు. పదహారవ శతాబ్దం నాటి పాలకులు ధ్వంసం చేయడంతో పదిహేడవ శతాబ్దంలో స్థానిక కూచ్‌బేహార్ పాలకుడు మహారాజా బిశ్వసింగ్ పునర్నిర్మించాడు. కామరూప రాజ్యానికి ప్రతీక దేవత కాబట్టి కామాఖ్య అనే పేరు వచ్చినట్లు మరో కథనం. ప్రధాన ఆలయానికి సమీపంలో సౌభాగ్య కుండం ఉంది. దీనిని దేవతల రాజు దేవేంద్రుడు తవ్వించాడని నమ్మకం. మరో ప్రధాన కుండం పేరు భైరవ్ కుండం. ఇందులో మనం ఊహించనంత పెద్ద సైజు తాబేళ్లుంటాయి. కటి బిహు పంటల వేడుక కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీపాలు వెలిగించడమే ప్రధానం. తులసి చెట్టు దగ్గర మొదలు పెట్టి ఇంటి ఆవరణ అంతా దీపాలతో వెలుగులు నింపుతారు. ఇంటింటా వెలిగే దీపాలతోపాటు ఊరంతా సామూహికంగా వెలిగించే దీపాన్ని ఆకాశబంటి అంటారు. దీపం వెలిగిస్తూ ఏ కోరిక కోరితే అది తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. బ్రహ్మపుత్రలో విహారం మూడు రోజుల కామాఖ్య టూర్ ప్యాకేజ్‌లో గువాహటి విమానాశ్రయంలో టూర్ ఆపరేటర్లు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తరవాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలో సన్‌సెట్ క్రూయిజ్ విహారం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవి దర్శనం, ఆ తర్వాత బాగలా ఆలయం, భువనేశ్వరి, ఉమానంద, నబగ్రహ, ఉగ్రతార, సుక్లేశ్వర్, బాలాజీ ఆలయాలు, భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం, వశిష్ట ఆలయం, హస్తకళల ఎంపోరియమ్ సందర్శనం ఉంటాయి. మూడవ రోజు గువాహటి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ప్యాకేజ్ పూర్తవుతుంది. ఈ సీజన్లో క్రూయిజ్ ప్యాకేజ్‌లో కటి బిహు వేడుకలను కూడా చూసే అవకాశం ఉంటుంది. కన్నడ తీరాన రాయల విడిది మడకశిరలో సత్యభామ సంతాన వేణుగోపాల స్వామితోపాటు దర్శనమిస్తుంది. అదే విగ్రహంలో రుక్మిణి కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కర్నాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన రాయలు ఇక్కడ ఆలయాన్ని కట్టించి, తన విహారకేంద్రంగానూ, విడిది కేంద్రంగానూ మలుచుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు వృద్ధాశ్రమం నిర్మించి అభాగ్యులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించడమైంది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే... తులసీమాత ఆలయం. దేశంలో మరెక్కడా తులసీమాతకు ఆలయం లేదని ఇది మాత్రమే ఏకైక ఆలయం అని ఇస్కాన్ ధృవీకరించింది. దీపావళి పండుగతోపాటు దీపావళి తర్వాత పన్నెండు రోజులకు వచ్చే చిలకద్వాదశి కూడా వేడుకగా నిర్వహిస్తారు. ట్రావెల్ టిప్స్ ►మీరు వెళ్తున్న ప్రదేశంలో కరోనా కేసుల తీవ్రతలేదని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశంలో కూడా కరోనా తీవ్రత లేకపోతేనే ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. ►మీ బస శానిటైజ్ అయినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. అవసరమైతే మరోసారి శానిటైజ్ చేయవలసిందిగా కోరాలి. ►మీరు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇంకా వేసుకోనట్లయితే పర్యటన ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ►పర్యాటక ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రతతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ►మీ ఇంట్లో కోవిడ్ హైరిస్క్ పీపుల్ ఉంటే మీ పర్యటన ఆలోచన మానుకోవడమే మంచిది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
Tourist Spot: సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకత అదే!
లోకంలో దీపాలకాంతులు వెలగడానికి దుష్టసంహారం రూపంలో చీకట్లు పారదోలే గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ప్రధాన భూమిక సత్యభామదే. అందుకే... దీపావళి పండుగలో ప్రధాన పాత్ర సత్యభామదే. ఈ కథనంలో కృష్ణుది సపోర్టింగ్ పాత్ర మాత్రమే. నరకాసుర వధ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపకాంతులతో ఆనందంగా నిర్వహించుకునే ఈ వేడుక అందరికీ తెలిసిందే. అయితే అంత గొప్ప మహిళకు ఆలయం ఎక్కడైనా ఉందా?... ఉంది. అనంతపురం జిల్లా మడకశిర సమీపాన కృష్ణుని విగ్రహంతోపాటు సత్యభామ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల కంటే మిన్నగా దీపావళి వేడుకలు జరుగుతాయి. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కృష్ణుడితోపాటు సత్యభామ పూజలందుకుంటోంది. ధీర వనిత సత్యభామను పూజలందుకునే పౌరాణిక పాత్రగా గౌరవించింది మన సంస్కృతి. ఈ పండుగలో సత్యభామది నాయిక పాత్ర అయితే ప్రతినాయక పాత్ర నరకాసురుడిది. నరకాసురుడికి ఆలయం లేదు కానీ, అస్సాంలో నరకాసురుడు కట్టించిన ఆలయం ఉంది. అది గువాహటిలోని కామాఖ్య ఆలయం. చిత్తూరు జిల్లా, కార్వేటి నగరంలో సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకొంటున్న రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి మూర్తులను కార్వేటి నగరానికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు వంశానికి చెందిన నారాయణరాజుకు సంతానం లేకపోవడంతో తపస్సు చేసినట్లు, అదే వంశానికి చెందిన వెంకట పెరుమాళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. ఈ ఆలయంలో శిల్పనైపుణ్యం అద్బుతంగా ఉంటుంది. ఆలయంలో మకరతోరణం, గోమాత సహిత రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. గాలి గోపురానికి ఎదురుగా ఉన్న 105 అడుగుల ధ్వజస్తంభం ఏకశిల నిర్మితం. రాణి మహల్ 14 ఎకరాల పుష్కరిణి ఈ ప్రాంతాన్ని 19వ శతాబ్దంలో తీవ్రమైన కరువుపీడించింది. అçప్పుడు ప్రజలను కాపాడేందుకు కార్వేటినగరం సంస్థానధీశుడు వెంకట పెరుమాళ్ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో స్కంధపుష్కరిణిని నిర్మించాడు. ఏ దిక్కు నుంచి చూసినా నీటి మట్టం సమాంతరంగా కనిపించడం దీని నిర్మాణ విశిష్టత. పుష్కరిణి మెట్ల మీద దేవతామూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలు నాటి శిల్పకళకు ప్రతిబింబిస్తున్నాయి. పుష్కరిణి కోసం పని చేసిన వారికి వెంకట పెరుమాళ్ రాజు స్వయంగా దోసిళ్లతో నాణేలను ఇచ్చారని స్థానిక కథనం. ఇక్కడి చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెరువు నుంచి ఏడు బావులకు నీరు సరఫరా అవుతుంది. ఏడు బావుల నుంచి స్కంద పుష్కరిణికి చేరుతుంది. స్కంద పుష్కరిణి చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. కార్వేటి నగరంలో చూసి తీరాల్సిన మరో నిర్మాణం రాణి మహల్ (అద్దాల మహల్). ఈ మహల్ నిర్మాణంలో కోడిగుడ్డు సొన ఉపయోగించిన కారణంగా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతోపాటు నీటితో తుడిస్తే గోడలు అద్దంలా మెరుస్తుంటాయి. అందుకే దీనికి అద్దాల మహల్ అనే పేరు వచ్చింది. ఏపీ టూరిజం నిర్వహించే ప్యాకేజ్ టూర్లో తిరుమలతోపాటు చంద్రగిరి, నారాయణవనం, నాగులాపురం, కార్వేటి నగరం ఉంటాయి. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల ఆలయం ఏకశిల ధ్వజస్తంభం చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
దీపావళిలో కొత్త సినిమావళి
దీపావళి అంటే దీపాల వరుస. కరోనాతో షూటింగ్‌ల వరుస తప్పిన చిత్రపరిశ్రమ ఇప్పుడు వరుస సినిమాల సందడితో కళకళలాడుతోంది. దీపావళి వచ్చింది.. సందడి తెచ్చింది.. సినీప్రియులకు ఎన్నో తీపి వార్తలు అందించింది. పండగ ముందు రోజు.. పండగ నాడు వరుసగా బోలెడన్ని కబుర్లు అందించింది. ఈ దీపావళి... ‘సినిమావళి’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఏషియన్ సినిమాస్‌పై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతూ, పల్లవి పెళ్లి బట్టల్లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. నవంబర్ 23 నుంచి ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ అని చిత్రబృందం తెలిపింది. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రామ్ తళ్లూరి నిర్మాత. ఈ సినిమాకు ‘కిన్నెరసాని’ అనే టైటిల్‌ను ప్రకటించారు. సుశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యస్. దర్షన్ దర్శకుడు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంద్రగంటితో మూడో సినిమా సుధీర్ బాబు కమిట్ అయిన మరో సినిమాని కూడా ప్రకటించారు. సుధీర్‌తో ‘సమ్మోహనం, వి’ చిత్రాలు చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ నటి సీత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భద్రకాళి’. కేఎం ఆనంద్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో చిక్కవరపు రాంబాబు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఎ.మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాధ పాత్రలో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించనున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ‘అభిమన్యుడు, హీరో’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు పీయస్ మిత్రన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు కార్తీ. ఈ సినిమా ప్రారంభం దీపావళి రోజు జరిగింది. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. మరోవైపు కార్తీ లేటెస్ట్ చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నటన సూత్రధారి’. అమిత్ రంగనాథ్, సుశీల మాధవ పెద్ది జంటగా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ మోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇదో కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ అని చిత్రబృందం పేర్కొంది. రాముడు లంకకు వెళ్లడానికి వంతెన నిర్మించాడు. ఆ గురుతులు ఇంకా ఉన్నాయి అనడానికి రామసేతు సాక్ష్యం అంటారు. ఇంతకీ నిజానిజాలు ఏంటి? అనే కథాంశంతో ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ‘రామ సేతు’ అనే చిత్రాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకుడు. చలం రాసిన ‘మైదానం’ నవల సినిమాగా తెరకెక్కనుంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రం ఫేమ్ వేణు ఊడుగుల నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. కవి సిద్ధార్థ్ దీనికి దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ కోసం ఈ సినిమాను చేస్తున్నారు. ‘తెలుగు సినిమా సంతకాన్ని రీజెనొవేట్ (చైతన్యం) చేసే అవకాశం ఇస్తుంది కనుక ఈ ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నాం’ అన్నారు వేణు. -
దీపావళి.. కొత్త సినిమాల సందడి
పండగొస్తే కొత్త సినిమా విశేషాలతో భలే సందడి. ఒకరేమో కొత్త పోస్టర్‌ను చూపిస్తారు. మరొకరు కొత్త పాట వినిపిస్తారు. ఇంకొకరు టీజర్‌తో చిన్న శాంపిల్ రుచి చూపిస్తారు. ఇలా ఈ దీపావళికి మన స్టార్స్ కొత్త పోస్టర్లతో, టీజర్లతో, ప్రకటనలతో వెలుగులు పంచారు. ఆ విశేషాలు. ► దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం. హీరోలు ఎన్టీఆర్‌ను, రామ్‌చరణ్‌ను దర్శకులు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారట. పండగ రోజు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. అందులోని స్టిల్ ఇది. ► లాక్డౌన్, ఆ తర్వాత పెళ్లితో బిజీ బిజీ అయ్యారు రానా. దీంతో ఇంకా షూటింగ్ సెట్లో అడుగుపెట్టే వీలులేకుండా అయింది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత సెట్లో అడుగుపెడుతున్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్తున్నాను. చాలా బావుంది’ అన్నారు రానా. ‘విరాటపర్వం’ చిత్రీకరణలో ఆయన జాయిన్ అయ్యారని తెలిసింది. ► నాగ శౌర్య, రితూ వర్మ జంటగా నూతన దర్శకులు సౌజన్య డైరెక్షన్లో ‘వరుడు కావలెను’ సినిమా తెరకెక్కుతోంది. ఇదో రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ► విజయ్ ఆంటోనీ కొత్త చిత్రానికి ‘విజయ రాఘవన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ విడుదల చేశారు. ► విశ్వంత్, చిత్రా శుక్ల నటించిన ‘కాదల్’ చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేశారు. కల్యాణ్ జీ గోగిన దర్శకత్వం వహించారు. ఇంకా పలు చిత్రాల అప్డేట్లతో తెలుగు ఇండస్ట్రీలో దీపావళి సందడి కనబడింది. ► రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా కోసం రవితేజ, అప్సర రాణి పై చిత్రీకరించిన ‘భూమిబద్దల్..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. తమన్ సంగీతం అందించారు. ► అఖిల్, పూజా హెగ్దే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హర్షగా కనిపిస్తారు అఖిల్. స్టాండప్ కమేడియన్‌గా పూజా పాత్ర ఉంటుంది. దీపావళి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ► విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇంగ్లిష్, తెలుగు క్రాస్ఓవర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఇందులో సునీల్ శెట్టి పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ► ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చేస్తున్నారు నాని. దీని తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తారు. ఆ తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ద్వారా మలయాళ నటి నజ్రియా నజీమ్ తెలుగుకు పరిచయం కాబోతున్నారు. నవంబర్ 21న టైటిల్ ప్రకటిస్తారు. -
ఆర్ఆర్ఆర్ నుంచి దీపావళి సర్ప్రైజ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. చదవండి: రాజమౌళి చాలెంజ్ స్వీకరించారు కాగా రేపు(శనివారం) దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్(రణం, రుధిరం, రౌద్రం) చిత్ర యూనిట్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ట్విటర్ అకౌంట్లో శుక్రవారం రామ్ చరణ్, జూ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి ముచ్చటిస్తున్న ఫోటోలను పోస్టు చేసింది. ఈ మేరకు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరి జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని పేర్కొంది. ఈ ఫోటోల్లో ముగ్గురు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక దీపావళికి ఆర్ఆర్ఆర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ఫోటోలు పోస్టు చేయడంతో ఖుషీగా ఫీల్ అవుతున్నారు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీన్ తొలగించాల్సిందే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Here’s a pleasant surprise by #RRRMovie team to make this Diwali more special. #RRRDiwali @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/udVqmpVNdQ — Vamsi Kaka (@vamsikaka) November 13, 2020 To all our beloved fans, here's to add bright lights to the festive spirit! 🤗🔥🌊 Happy #RRRDiwali... #RRRMovie pic.twitter.com/0hoEHWombU — DVV Entertainment (@DVVMovies) November 13, 2020 -
రానా ఎంత కట్నం తీసుకున్నారు?
కొత్త వరుడు కొంటె పోరడు ► కొత్త పెళ్లికొడుకు రానా ఎంత కట్నం తీసుకున్నారు? పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి పండగను ఎలా జరుపుకోబోతున్నారు? ► టపాసుల్లో ప్రభాస్‌ని రానా ఏ బాంబుతో పోల్చారు? అనుష్క గురించి రానా ఏమన్నారు? ► ఇలాంటి విషయాలన్నీ భలే ఆసక్తకిరంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు.. రానా ఇంకొన్ని విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. ► పెళ్లి చేసుకునే టైమ్ వస్తే ఎవరూ ఆపలేరు. అది ప్రభాస్‌కైనా, నాకైనా ఎవరికైనా ఒకటే. ప్రభాస్ స్టార్ రాకెట్ లాంటివాడు. అది పేలినప్పుడు ఆకాశమంతా కనపడుతుంది. అనుష్క కూడా ప్రభాస్‌లాంటి రాకెట్ కానీ, ఈమెకు ఇంకా కొన్ని కలర్స్ తోడవుతాయి. అనుష్క చిచ్చుబుడ్డిలాంటిది. కట్టప్ప (సత్యరాజ్) భూచక్రంలాంటివాడు. నేను థౌజండ్‌వాలా లాంటివాణ్ని. ► కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకోవటం మంచిదే. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్స్ అందర్నీ కలుస్తున్నాను. ► కట్నం ఎంత తీసుకున్నారు? అని యాంకర్ బిత్తరి సత్తి అడిగితే.. ‘నువ్వెంత తీసుకున్నావ్’ అని రానా ఎదురు ప్రశ్నించారు. సత్తి ఏం చెప్పారు? రానా తీసుకున్న కట్నం ఎంత? ► ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ‘అరణ్య’ చిత్రం ఒకటి. ఆ సినిమాలో 15 నిజమైన ఏనుగులతో కలిసి నేను పెరుగతాను. థాయ్‌ల్యాండ్‌లోని గాభి ఐల్యాండ్‌లో, కేరళ అడవుల్లో ఈ సినిమా తీశాం. ‘హిరణ్యకశ్యప’ని వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తాం. ‘విరాటపర్వం’ 1990లకు సంబంధించిన నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. ‘గరమ్ సత్తి’తో రానా పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం రాత్రి 8.30 గం‘‘లకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. పండగ సిరి తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను. ఇంకా ఈ జంట చెప్పిన బోలెడన్ని కబుర్లు ‘సాక్షి టీవీ’లో శనివారం రాత్రి 7.30 గం‘‘లకు తిరిగి ఆదివారం ఉదయం 11.30 గం‘‘లకు చూడండి. శ్రీహరి కోట ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగిస్తున్నారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం మధ్యాహ్నం 1.30 గం‘‘లకు తిరిగి ఆదివారం సాయంత్రం 6.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. -
ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్‌ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్‌ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘భీష్మ’లో రష్మిక, నితిన్ -
గరాజీ.. భలే రుచి..
సాక్షి, మామిడికుదురు (పి.గన్నవరం): బియ్యం పిండి, పంచదారతో తయారు చేసే ‘గరాజీ’లు నోరూరిస్తాయి. మామిడికుదురు, నగరం గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ వంటకం ముస్లిం వంటకంగా ప్రాచుర్యం పొందింది. పై రెండు గ్రామాల్లో 216వ నంబర్ జాతీయ రహదారి పక్కన గాజు సీసాల్లో వీటిని ఉంచి విక్రయిస్తుంటారు. సైజును బట్టి ఒక్కొక్క గరాజీని రూ.నాలుగు, రూ. ఐదుకు విక్రయిస్తారు. మళ్లీమళ్లీ తినాలనిపించే గరాజీలను ఇతర ప్రాంతాల వారు మిక్కిలిగా ఇష్టపడతారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర సుదూర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వీటిని తీసుకు వెళుతుంటారు. 12 గంటల పాటు బియ్యం నానబెట్టిన తరువాత ఆ బియ్యాన్ని మెత్తగా దంచి పిండిని గుడ్డతో జల్లిస్తారు. పంచదారను తీగలా సాగే విధంగా పాకం పెడతారు. రెండు కిలోల బియ్యం పిండికి అర కిలో పంచదారను పాకంగా పెడతారు. ఈ పాకంలో బియ్యం పిండి కలిపిన తరువాత ఈ రెండింటి మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయిస్తారు. గుండ్రంగా వేయించిన గరాజీని బయటకు తీసి దానిని మడచి మళ్లీ వేయిస్తారు. ఈ విధంగా గరాజీలు తయారు చేస్తారు. గరాజీలను వేడివేడి పాలలో వేసుకుని తింటే సేమ్యాను మించిన రుచి ఉంటుంది. ఈ ప్రాంతంలో గరాజీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని వర్గాల వారు వీటిని అమితంగా ఇష్టపడతారు. -
పండగ తెచ్చారు
ఈ దీపావళికి సినిమా అభిమానుల మనసుకి సంతోషమనే వెలుగును అందించింది టాలీవుడ్. కొత్త సినిమా ప్రకటనలు, చిత్రీకరణ విశేషాలు, కొత్త పోస్టర్స్‌తో దీపావళి సంబరాలను డబుల్ చేసింది. బాలకృష్ణ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు విజయశాంతి. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌తో పాటు, విజయశాంతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ‘అల.. వైకుంఠపురమలో..’ని ‘రాములో రాములా’ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ‘రాములో రాములా’ పూర్తి పాటను విడుదల చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి మరోసారి పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేయనున్నారు రవితేజ. పూజా హెగ్డే, అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా తన కొత్త సినిమా మొదలుకానున్నట్లు ప్రకటించారు రవితేజ. బి. మధు నిర్మించనున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ‘‘టైటిల్‌ని బట్టి ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు కానీ, ఈ చిత్రకథాంశం అది కాదు. ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా చిత్రీకరణ ఈ నెల 31 నుంచి నవంబరు 10వరకు కేరళలో జరగనుంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో ఓ దృశ్యం శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. సాయితేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కేఎన్ సహ–నిర్మాత. డిసెంబరు 20న విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఐబీ కార్తికేయన్ నిర్మాత. పి. ప్రభాప్రేమ్, మనోజ్, హర్ష సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ నిఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. నవీన్‌చంద్ర హీరోగా జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ‘హీరో హీరోయిన్’ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ దీపావళి పండగ ఇంకా చాలా పోస్టర్లను మోసుకొచ్చింది. బోలెడన్ని విశేషాలను తెచ్చింది. -
ఫన్ పటాస్
-
టాలీవుడ్ ‘బాంబు’లు : పేలినవెన్ని.. తుస్సుమన్నవెన్ని!
సుతిల్ బాంబులు పేలకపోతే.. ఆశ్చర్యపోతాం కలర్ పెన్సిళ్లు పేలితే.. మరింత ఆశ్చర్యపోతాం చిచ్చుబుడ్డి తుస్సుమంటే.. భూచక్రాలు తిరగకుంటే.. బాధపడతాం అయితే మన సినీ ఇండస్ట్రీలో తయారైన బాంబుల్లో రీసౌండ్ వచ్చేలా ఎన్ని పేలాయో.. ఎన్ని తుస్సుమన్నాయో ఓ సారి చూద్దాం.. సుతిల్ బాంబులాంటి ‘అజ్ఞాతవాసి’ సుతిల్ బాంబులకు తిరుగులేదు. వాటిని పేల్చుతున్నామంటే.. చెవులు గిల్లుమనాల్సిందే. ఎప్పుడో కానీ అవి తుస్సుమనవు. అవి తుస్సుమంటే మనసు కూడా ఏదోలా అయిపోతుంది. అందుకే సుతిల్ బాంబులవి ప్రత్యేక స్థానం. టాలీవుడ్లో కూడా ఇలాంటివి కొన్నే ఉంటాయి. వాటిలో పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ప్రత్యేకమే. వీరి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అలానే ఉంటాయి. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫలితం చూస్తే ఏమైంది.. తుస్సుమంది. పేల్చిన మొదటి బాంబే తుస్సుమంటే.. అందులోనూ..సుతిల్ బాంబ్ అయ్యేసరికి టాలీవుడ్ నిరాశచెందింది. లక్ష్మీబాంబ్ల్లాంటి సినిమాలు.. నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా, అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి, రవితేజ.. నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, సాయి ధరమ్ తేజ్.. ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, నితిన్ ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం లాంటివి బాగానే పేలుతాయని ఆశిస్తాం. కానీ పేలొచ్చు..పేలకపోవచ్చు. ఇలా ఈసారి లక్ష్మీ బాంబ్‌లు ఎక్కువగా పేలలేకపోయాయి. కొన్ని లక్ష్మీ బాంబ్‌లు తుస్సుమన్నాయి. ఆర్డీఎక్స్లా పేలిన ‘ఆర్ఎక్స్ 100’ ఇక గంపగుత్తగా తెచ్చుకునే ఎర్ర బాంబులు, ఉల్లిగడ్డ బాంబులపై అంతగా పేలుతాయని ఆశించకపోయినా.. అందులో కొన్ని లక్ష్మీ బాంబ్లను తలపిస్తాయి. టాలీవుడ్లో చిన్న సినిమాలు కూడా అలాంటివే. ఏడాదికి వీటి సంఖ్య ఎంతో చెప్పడం కష్టమే అయినా.. రీసౌండ్ ఇచ్చి చెవులను మోతెక్కించినవెన్నో ఇట్టే చెప్పొచ్చు. ఇలా ఈ ఏడాదిలో మొదటగా చెప్పుకోవాల్సింది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం గురించే. బోల్డ్ కంటెంట్‌తో బౌండరీల మీద బౌండరీలు కొట్టేశాడు. ఆర్డీఎక్స్ పేలితే ఎంత విధ్వంసం సృష్టిస్తుందో.. బాక్సాఫీస్‌పై అంతగా విజృంభించేసింది. గీత గోవిందం కూడా ఇదే కోవకు వస్తుంది. పెద్ద నిర్మాత ఉన్నా, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నా.. కూడా ఇది చిన్న సినిమాగానే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ దీని విజయం మాత్రం పెద్ద హీరోకి సైతం వీలుకాలేనంతగా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేసింది. వందకోట్లను కలెక్ట్ చేసేసి ‘గీత గోవిందం’ అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇవి రెండూ మరిచిపోలేని చిత్రాలే. కానీ ఈ రెండింటికి పొంతనే ఉండదు. సక్సెస్‌రేట్ దృష్ట్యా ఇవి రెండూ ప్రత్యేకమే. భూ చక్రాలు, సుర్ సుర్బాణాల్లాంటివి.. ఇక సౌండ్ వచ్చే పటాకులే కాక కొన్ని వెరైటీ టపాసులను కూడా కొంటుంటాం. ఇవి పేలవు..కాని మనకు ఆనందాన్ని ఇస్తాయి. వాటిని చూస్తే మనకు ఆనందం వస్తుంది. భూచక్రాలు, రాకెట్లు, సుర్‌సుర్ బాణాల్లాంటివి ఇందులోకి వస్తాయి. సమ్మోహనం, నీదీ నాదీ ఒకే కథ, నన్ను దోచుకుందువటే, ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్, చిలసౌ, గూఢాచారి, కేర్ ఆఫ్ కంచెరపాలెం, యూ టర్న్ లాంటివి ఒకసారి చూడాలి అనుకుంటాం. అయితే వీటికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. కొన్నింటికీ డిమాండ్ ఉండదు. అంతగా అమ్ముడుపోవు. సమ్మోహనం, గూఢాచారి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసేశాయి. ఆగకుండా పేలి అందరి చేత శభాష్ అనిపించాయి. కొత్త బాంబులు.. రీసౌండ్కే రీసౌండ్ ఇచ్చిన బాంబులు.. రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి, అరవింద సమేతలు ఇచ్చిన రీసౌండ్ ఇప్పటికీ మోగుతూనే ఉంది. అప్పటివరకు మూసధోరణిలో ఉన్న రామ్ చరణ్ బ్రూస్లీతో గుణపాఠం తెచ్చుకుని పంథా మార్చుకున్నాడు. లెక్కల మాష్టారు సుకుమార్‌తో కలిసి రంగస్థలం అనే బాంబును ప్రేక్షకుల మీదికి వదిలేశాడు. పేలడం మొదలుపెట్టింది..కానీ ఆగడం మాత్రం మరిచిపోయింది. ఇక మహేష్ బాబు-కొరటాల శివ గతంలో శ్రీమంతుడి లాంటి ఓ క్లాస్ పటాసును వదలగా.. ఈసారి భరత్ అనే నేను లాంటి మరో విభిన్నమైన టపాసును విసేరేశారు. అది పేలితే అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా పేలుతూనే పోయింది. అలనాటి మహానటి సావిత్రి.. అంతటి నటి జీవితాన్ని వెండితెరపై ‘మహానటి’ని అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కొన్ని విమర్శలను మూటగట్టుకున్నా.. అందరినీ అప్పటి కాలానికి తీసుకెళ్లి సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ కసితో రగిలిపోయి తీశాడేమో అనేట్టుగా ‘అరవింద సమేత’లాంటి అదిరిపోయే సీమబాంబును తయారుచేశాడు. క్లాస్ లుక్స్‌తో, పంచ్ డైలాగ్‌లతో నడిపించే త్రివిక్రమ్.. తనశైలిని మార్చి మాస్కు కొత్త అర్థం చెప్పేశాడు. ఈ కొత్తబాంబులు టాలీవుడ్‌ను కళకళలాడేలా చేశాయి. బాధను మిగిల్చినవి.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టివని ఇక కొన్ని బాంబులు మనల్సి ఇట్టే ఆకర్షిస్తాయి. కానీ తీరా చూస్తే.. అవి పేలవు. ఇలాంటివాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ విసిరిన ‘నా పేరు సూర్య’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఛలో, తొలిప్రేమ, హలో గురు ప్రేమ కోసమే, శైలజా రెడ్డి అల్లుడు, దేవదాస్, నోటా లాంటి బాంబులు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు బాగానే పేలుతాయి. మరికొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతూ ఉంటాయి. వీటిలో ఛలో, తొలిప్రేమ లాంటి సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. పాము బిళ్లలు, కలర్ అగ్గిపుల్లలు, రీల్ పటాకుల్లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు చాలానే వస్తాయి. వీటి గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది. ఎందుకుంటే ఏడాదిలో అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయో లెక్కపెట్టడానికి కూడా వీలుండదు. ఏదేమైనా.. ఈ ఏడాది ఇప్పటివరకు టాలీవుడ్ తయారు చేసిన బాంబుల్లో బాగా పేలి ఆనందాన్ని ఇచ్చినవీ, అంచనాలు తప్పి తుస్సుమన్నవీ గుర్తుండిపోతాయి. వచ్చే దీపావళికి అణుబాంబుల్లాంటి సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రావాలని ఆశిద్దాం.. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
రాగ దీపం
-
వొడాఫోన్ 399 ప్లాన్
సాక్షి,న్యూఢిల్లీ: దివాళీకి ముందే వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మెగా ఆఫర్ ప్రకటించింది.కొత్తగా రూ 399 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో ప్రీపెయిడ్ యూజర్లు 90 జీబీ 4జీ డేటాను వాడుకోవడంతో పాటు రీచార్జ్ చేయించుకున్నప్పటి నుంచి ఆరు నెలల వరకూ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమేనని తెలిసింది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో 399 ప్లాన్‌కు దీటుగా పండగ సీజన్ ఆరంభంలోనే కొత్త ప్లాన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేసింది. ఎయిర్టెల్ 399 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల పాటు 4జీ హ్యాండ్సెట్ యూజర్లకు అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రిలయన్స్ జియో 399 ప్లాన్‌లో తన ప్రైమ్ యూజర్లకు 84 రోజుల పాటు 84 జీబీ డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ప్లాన్‌లో జియో ప్రైమ్ యూజర్లు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్ చేసింది.ఇక దివాళీ ఆఫర్లలో భాగంగా రూ 399 రీచార్జి చేసుకునే కస్టమర్లకు వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. రూ 50 డినామినేషన్‌తో ఉండే ఈ వోచర్లు నవంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
దీపావళి
-
సరదాగా నవ్వుకోండిలా : బాంబు పేలింది!!
-
చూపు లేకున్నా.. ఏది వెలుగో మాకూ తెలుసు!
-
దీపావళి స్పెషల్ : జబర్దస్త్ టీంతో చిట్‌చాట్