Recipe: వాల్‌నట్‌ హల్వా.. ఇలా ట్రై చేసి చూడండి! | Diwali 2022: Walnut Halwa Sweet Recipe In Telugu | Sakshi
Sakshi News home page

Walnut Halwa: వాల్‌నట్‌ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి!

Published Wed, Oct 19 2022 11:44 AM | Last Updated on Wed, Oct 19 2022 11:51 AM

Diwali 2022: Walnut Halwa Sweet Recipe In Telugu - Sakshi

Recipes In Telugu: వాల్‌నట్‌ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. అయితే చాలా మంది నోటికి అంతగా రుచించదు ఈ డ్రైఫ్రూట్‌. అలాంటి వారికి ఈ దీపావళి పండుగ వేళ వాల్‌నట్స్‌తో హల్వా చేసి పెట్టండి. నోరు తీపి చేయడంతో  పాటు పోషకాలూ అందించినట్లవుతుంది!

వాల్‌నట్‌ హల్వా తయారీకి కావాలసిన పదార్థాలు: 
►వాల్‌నట్స్‌ – ఒక కప్పు
►పంచదార – అర కప్పు
►పాలు – అర కప్పు
►నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు
►కుంకుమ పువ్వు – చిటికెడు
►గార్నిషింగ్‌ కోసం సిల్వర్‌ ఫాయిల్‌

వాల్‌నట్‌ హల్వా తయారీ విధానం
►వాల్‌నట్స్‌ను బరకగా దంచుకోవాలి.
►పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి
►ఒక గిన్నెలో పంచదార, పాలు, కుంకుమ పువ్వు వేయాలి
►పంచదార కరిగి పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టాలి.

►ఆ తర్వాత మూకుడులో మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి
►అందులో వాల్‌నట్స్‌ పొడి వేసి, సన్నని మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించాలి
►వేగిన తర్వాత దీనిలో పాల మిశ్రమం పోయాలి. రెండు నిమిషాలు బాగా కలపాలి
►ఆ తర్వాత మరో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి
►అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి
►నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారనివ్వాలి
►దీని పైన సిల్వర్‌ ఫాయిల్‌ అద్ది, ముక్కలుగా కట్‌ చేసుకుంటే వాల్‌నట్‌ హల్వా రెడీ!

ఇవి కూడా ట్రై చేయండి: Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా!
ఈసారి దీపావళికి బ్రెడ్‌ కాజా ఇలా తయారు చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement