Diwali Food And Recipes
-
Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా
పండుగ వస్తోంది... ఇంటికి కొత్త ప్రమిదలు వచ్చేసి ఉంటాయి. ఇంటి ముందు ముగ్గులు... వాకిటికి పూలతోరణాలు వెలుస్తాయి. పండుగ అంతా ఇంటి ముందే ఉంటే... ఇంటి లోపల ఏముంటుంది? పండుగ సంతోషంలో నేను లేనా అని వంటగది ఎదురు చూస్తుంటుంది. పిండివంటల పాత్రల కోసం భోజనాల గది దొంగచూపులు చూస్తుంది. తియ్యటి రుచుల కోసం ఇంటిల్లిపాది నోట్లో నీళ్లూరుతుంటాయి. చక్కగా వండండి... ప్రేమగా వడ్డించండి... హాయిగా ఆస్వాదించండి. పిల్లల ముఖాలు పగలే మతాబుల్లా వెలగకపోతే అడగండి. బాణలి పెట్టండి... స్టవ్ వెలిగించండి... పండగ చేసుకుందాం. మాల్ పువా కావలసినవి: ►గోధుమ పిండి– ముప్పావు కప్పు ►సూజీ (బొంబాయి) రవ్వ– పావు కప్పు ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►సోంపు పొడి– పావు టీ స్పూన్ ►వేడి పాలు – ఒకటిన్నర కప్పు ►పాల మీగడ– రెండు టేబుల్ స్పూన్లు ►చక్కెర – కప్పు ►కుంకుమ పువ్వు – పది రేకలు ►నెయ్యి – వేయించడానికి తగినంత ►బాదం – పది (సన్నగా తరగాలి), పిస్తా – పది. తయారీ ►పెద్ద పాత్రలో గోధుమపిండి, రవ్వ, యాలకులపొడి, సోంపు పొడి వేసి బాగా కలపాలి. ►ఇందులో పాలు పోసి కలుపుకోవాలి. ►ఇప్పుడు పాల మీగడ వేసి గరిటజారుడుగా కలిపి మూతపెట్టి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ►స్టవ్ మీద వెడల్పు పాత్రలో చక్కెరలో అదే మోతాదులో నీరు పోసి మీడియం మంట మీద మరిగించాలి. ►అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బాదం తరుగు, పిస్తా వేసి కలపాలి. ►చక్కెర పాకం చిక్కబడేటప్పుడు మంట తగ్గించాలి. ►తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ►ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి సరి చూసుకోవాలి. ►మరీ గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు పోసి కలపాలి, మరీ వదులుగా ఉంటే కొంచెం గోధుమ పిండి వేసి కలపాలి. ►ఈ పిండిని చిన్న గరిటెతో తీసుకుని కాగిన నెయ్యిలో పోసి దోరగా వేగే వరకు కదిలించకూడదు. ►రెండు వైపులా దోరగా కాలిన తరవాత చిల్లుల గరిటెతో తీసి మరొక చెక్క గరిట సాయంతో నెయ్యి జారిపోయేటట్లు వత్తి చక్కెర పాకంలో వేయాలి. ►మూడు– నాలుగు నిమిషాల పాటు పాకంలో మునిగేటట్లు ఉంచి తీసివేయాలి. ►ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి! Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి -
Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. ఇలా ఈజీగా
ఈ దీపావళికి ఇంట్లో వాళ్ల కోసం మీ చేతులతో స్వయంగా ఇలా కోవా రవ్వ బర్ఫీ తయారు చేయండి. నోటిని తీపి చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. కోవా రవ్వ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు: ►బొంబాయి రవ్వ – అర కప్పు ►పచ్చి కోవా –అర కప్పు ►పాలు – అర కప్పు ►పంచదార – అర కప్పు ►యాలకుల పొడి – అర టీస్పూన్ ►నెయ్యి – పావు కప్పు ►కుంకుమ పువ్వు – చిటికెడు కోవా రవ్వ బర్ఫీ- తయారీ విధానం: ►ముందుగా పాలు వేడి చేసుకోవాలి ►రెండు స్పూన్ల వేడి పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి ►నెయ్యి వేడి చేయాలి. తర్వాత.. అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టాలి ►అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగేంత వరకు కలబెట్టాలి ►ఇందులో చక్కెర కూడా వేసి కరిగేంత వరకు తిప్పాలి ►ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి జత చేయాలి ►ఈ మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ►మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ►నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకుని.. తరిగిన డ్రైఫ్రూట్స్‌ను వాటిపై చల్లి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ►కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా! -
Recipe: వాల్నట్ హల్వా.. ఇలా ట్రై చేసి చూడండి!
Recipes In Telugu: వాల్నట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. అయితే చాలా మంది నోటికి అంతగా రుచించదు ఈ డ్రైఫ్రూట్. అలాంటి వారికి ఈ దీపావళి పండుగ వేళ వాల్‌నట్స్‌తో హల్వా చేసి పెట్టండి. నోరు తీపి చేయడంతో పాటు పోషకాలూ అందించినట్లవుతుంది! వాల్నట్ హల్వా తయారీకి కావాలసిన పదార్థాలు: ►వాల్నట్స్ – ఒక కప్పు ►పంచదార – అర కప్పు ►పాలు – అర కప్పు ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ►కుంకుమ పువ్వు – చిటికెడు ►గార్నిషింగ్ కోసం సిల్వర్ ఫాయిల్ వాల్నట్ హల్వా తయారీ విధానం: ►వాల్‌నట్స్‌ను బరకగా దంచుకోవాలి. ►పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ►ఒక గిన్నెలో పంచదార, పాలు, కుంకుమ పువ్వు వేయాలి ►పంచదార కరిగి పొంగు వచ్చే వరకు వేడి చేసి, దించి పక్కన పెట్టాలి. ►ఆ తర్వాత మూకుడులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి ►అందులో వాల్నట్స్ పొడి వేసి, సన్నని మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించాలి ►వేగిన తర్వాత దీనిలో పాల మిశ్రమం పోయాలి. రెండు నిమిషాలు బాగా కలపాలి ►ఆ తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి ►అంచులు విడిచే వరకు ఉడికించుకోవాలి ►నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారనివ్వాలి ►దీని పైన సిల్వర్ ఫాయిల్ అద్ది, ముక్కలుగా కట్ చేసుకుంటే వాల్నట్ హల్వా రెడీ! ఇవి కూడా ట్రై చేయండి: Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా! ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి! -
Sweet Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా!
దీపావళి పండుగ వేళ నోటిని తీపి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, కొందరు డైట్లో ఉన్న కారణంగా అన్ని స్వీట్లు తినలేరు. ముఖ్యంగా పంచదారకు దూరంగా ఉంటారు చాలా మంది! బెల్లం తినగలిగే వారైతే పండుగనాడు ఇలా బెల్లం గవ్వలతో నోరు తీపి చేసుకుంటే సరి! బెల్లం గవ్వల తయారీకి కావలసిన పదార్థాలు: ►గోధుమ పిండి – ఒక కప్పు ►బెల్లం – ఒక కప్పు ►నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ►వంట సోడా – చిటికెడు. బెల్లం గవ్వల తయారీ విధానం ►ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, వంట సోడా వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. ►ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద ఒత్తుకోవాలి ►అవి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి ►ఆ తర్వాత బాణలిలో నూనె పోసి, వేడి చేయాలి. ►అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టాలి ►మరో గిన్నెలో బెల్లం వేసి, మునిగేంత వరకు నీరు పోయాలి ►దీనిని స్టవ్ మీద పెట్టి, ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ►బెల్లం పాకం వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయాలి. ►అప్పటికే వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి. ►వాటిని నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ►చల్లారిన తర్వాత గవ్వలు విడివిడిగా వస్తాయి. ఇది కూడా ట్రై చేయండి: Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి! -
Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి!
పండుగ అంటేనే తియ్యని వేడుక. ఇక దీపావళి అంటే చిన్నా పెద్దా.. అందరికీ ఇష్టమే. ఇంటి ముందు దీపాలు వెలిగించి.. లక్ష్మీ దేవిని పూజించే పండుగ వేళ నోరు తీపి చేసుకోకపోతే ఎలా? సాధారణంగా అందరి ఇళ్లలో అందుబాటులో ఉండే ఈ పదార్థాలతో ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి. బ్రెడ్ కాజా తయారీకి కావలసిన పదార్థాలు: ►బ్రెడ్ స్లైసెస్ – ఆరు ►చక్కెర – అర కప్పు ►యాలకుల పొడి – చిటికెడు ►పిస్తా, బాదం తురుము– తగినంత ►నీళ్లు – పావు కప్పు ►నూనె – సరిపడా. తయారీ విధానం: ►బ్రెడ్ స్లైసెస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేయాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి వేయించటానికి సరిపడా నూనె అందులో వేయాలి. ►కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి ►వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ►ఆ తర్వాత ఓ పాత్రలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టాలి ►స్టవ్ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలపాలి ►అందులో యాలకుల పొడి వేసుకుని ఓ సారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ►వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో ముంచి కాసేపటి తర్వాత తీసేయాలి ►పాకంలో ముంచి తీసిన బ్రెడ్ ముక్కలను పళ్లెంలో పరుచుకోవాలి ►తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ ఇలా! నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా..