ఈ దీపావళికి ఇంట్లో వాళ్ల కోసం మీ చేతులతో స్వయంగా ఇలా కోవా రవ్వ బర్ఫీ తయారు చేయండి. నోటిని తీపి చేసి శుభాకాంక్షలు తెలియజేయండి.
కోవా రవ్వ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు:
►బొంబాయి రవ్వ – అర కప్పు
►పచ్చి కోవా –అర కప్పు
►పాలు – అర కప్పు
►పంచదార – అర కప్పు
►యాలకుల పొడి – అర టీస్పూన్
►నెయ్యి – పావు కప్పు
►కుంకుమ పువ్వు – చిటికెడు
కోవా రవ్వ బర్ఫీ- తయారీ విధానం:
►ముందుగా పాలు వేడి చేసుకోవాలి
►రెండు స్పూన్ల వేడి పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి
►నెయ్యి వేడి చేయాలి. తర్వాత.. అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టాలి
►అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగేంత వరకు కలబెట్టాలి
►ఇందులో చక్కెర కూడా వేసి కరిగేంత వరకు తిప్పాలి
►ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి జత చేయాలి
►ఈ మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి
►మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి
►నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకుని.. తరిగిన డ్రైఫ్రూట్స్‌ను వాటిపై చల్లి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి
►కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: వాల్‌నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి!
Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా!
Comments
Please login to add a commentAdd a comment