Diwali 2022 Sweet Recipes: How To Prepare Bread Kaja Easy Sweet Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్‌ కాజా ఇలా తయారు చేసుకోండి!

Published Tue, Oct 18 2022 4:35 PM | Last Updated on Wed, Oct 19 2022 6:03 PM

Diwali 2022: Bread Kaja Easy Sweet Recipe In Telugu - Sakshi

పండుగ అంటేనే తియ్యని వేడుక. ఇక దీపావళి అంటే చిన్నా పెద్దా.. అందరికీ ఇష్టమే. ఇంటి ముందు దీపాలు వెలిగించి.. లక్ష్మీ దేవిని పూజించే పండుగ వేళ నోరు తీపి చేసుకోకపోతే ఎలా? సాధారణంగా అందరి ఇళ్లలో అందుబాటులో ఉండే ఈ పదార్థాలతో ఈసారి దీపావళికి బ్రెడ్‌ కాజా ఇలా తయారు చేసుకోండి.

బ్రెడ్‌ కాజా తయారీకి కావలసిన పదార్థాలు:
►బ్రెడ్‌ స్లైసెస్‌‌ – ఆరు
►చక్కెర – అర కప్పు
►యాలకుల పొడి – చిటికెడు
►పిస్తా, బాదం తురుము– తగినంత
►నీళ్లు – పావు కప్పు
►నూనె – సరిపడా.

తయారీ విధానం:
►బ్రెడ్ స్లైసెస్‌ అంచులు తీసేసి ముక్కలుగా కట్‌ చేయాలి
►స్టవ్‌ మీద బాణలి పెట్టి వేయించటానికి సరిపడా నూనె అందులో వేయాలి.
►కట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కలను దోరగా వేయించుకోవాలి
►వేయించిన ముక్కలను కిచెన్‌ పేపర్‌ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి 

►ఆ తర్వాత ఓ పాత్రలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టాలి
►స్టవ్‌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలపాలి
►అందులో యాలకుల పొడి వేసుకుని ఓ సారి కలిపి స్టవ్‌ మీద నుంచి దించేయాలి
►వేయించిన బ్రెడ్‌ ముక్కలను పాకంలో ముంచి కాసేపటి తర్వాత తీసేయాలి
►పాకంలో ముంచి తీసిన బ్రెడ్‌ ముక్కలను పళ్లెంలో పరుచుకోవాలి
►తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులతో గార్నిష్‌ చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్‌, చిలగడ దుంప సూప్‌ తయారీ ఇలా!
నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్‌ హల్వా తయారీ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement