bread pieces
-
Diwali 2024 : దివ్యంగా వండుకోండిలా
దీపావళి వస్తోంది...ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది.పిల్లల ముఖాల్లో మతాబులు వెలుగుతాయి.మరి... వంటిల్లు బోసిపోతే ఎలాగ?ఫ్రిజ్‌లోంచి బ్రెడ్... క్యారట్ తీయండి.స్టవ్ వెలిగించండి... చక్కెర డబ్బా మూత తీయండి. దివ్యంగా వండండి! షాహీ తుకడాకావలసినవి: బ్రెడ్ స్లయిస్‌లు –5; నీరు – టీ స్పూన్; పాలు– 3 కప్పులు; జీడిపప్పు– గుప్పెడు; పిస్తా– గుప్పెడు; బాదం – గుప్పెడు; యాలకులు – 2 (పొడి చేయాలి); నెయ్యి – అరకప్పు; చక్కెర – అర కప్పు; కుంకుమ పువ్వు – 6 రేకలు;తయారీ: బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న పెనంలో చక్కెరలో నీటిని పోసి సన్న మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తరవాత అందులో కుంకుమ పువ్వు రేకలు వేయాలి. చక్కెర తీగపాకం వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి. ఒక పాత్రలోపాలు పోసి మరిగించాలి. మధ్యలో గరిటెతో అడుగు పట్టకుడా కలుపుతూ పాలు చిక్కబడి పావు వంతుకు వచ్చే వరకు మరిగించి యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత పైన తయారు చేసి సిద్ధంగా ఉంచిన చక్కెరపాకంలో నాలుగవ వంతు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ఇది రబ్రీ. బ్రెడ్ స్లయిస్‌లను అంచులు తీసేసి త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ∙మరొక పెనంలో నెయ్యి వేడి చేసి బ్రెడ్ ముక్కలను అన్ని వైపులా దోరగా కాల్చాలి. పెనం మీద నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి వెడల్పుగా, అంగుళం లోతు ఉన్న ప్లేట్లో అమర్చాలి. ఇలా అన్ని స్లయిస్‌లను వేయించి, చక్కెర పాకంలో ముంచి తీసి ప్లేట్లో సర్దాలి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న బ్రెడ్ స్లయిస్ల మీద రబ్రీ పోసి, ఆ పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను చల్లాలి.గమనిక: పాలను రబ్డీ చేసే సమయం లేకపోతే కండెన్స్డ్ మిల్క్ వాడవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు తినాలంటే చక్కెర బదులుగా మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ లేదా స్టీవియాలను వాడవచ్చు. క్యారట్ బర్పీకావలసినవి: క్యారట్ – అర కిలో; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు పాలు – కప్పు; చక్కెర – అర కప్పు; యాలకుల పొడి– అర టీ స్పూన్; పిస్తా – గుప్పెడు (తరగాలి);తయారీ: క్యారట్‌ను కడిగి చెక్కు తీసి తురమాలి. మందపాటి బాణలిలో రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో క్యారట్ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి సన్నమంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారట్ తురుములో పాలు పోసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల సేపు ఉడికించాలి. క్యారట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేకొద్దీ మిశ్రమం ద్రవంగా మారుతుంటుంది. కొద్ది సేపటికి తిరిగి దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మిశ్రమం అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా దగ్గరయ్యే వరకు ఉంచాలి. ఈ లోపు ఒక ట్రేకి నెయ్యి రాసి క్యారట్ మిశ్రమంపోయడానికి సిద్ధం చేసుకోవాలి. క్యారట్ పాకం గట్టి పడిన తరవాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి రాసిన ట్రేలో పోసి సమంగా సర్ది పిస్తా పలుకులను అద్దితే క్యారట్ బర్ఫీ రెడీ. బర్ఫీ వేడి తగ్గిన తర్వాత చాకుతో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కలను ప్లేట్ నుంచి సులువుగా వేరు చేయవచ్చు.గమనిక: క్యారట్ మిశ్రమాన్ని ఎప్పుడు ట్రేలోపోయాలనేది స్పష్టంగా తెలియాలంటే... స్పూన్‌తో కొద్దిగా తీసుకుని చల్లారిన తరవాత చేత్తో బాల్‌గా చేసి చూడాలి. తురుము జారిపడకుండా బాల్ గట్టిగా వస్తే అప్పుడు మంట మీద నుంచి దించేయవచ్చు. -
Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి!
పండుగ అంటేనే తియ్యని వేడుక. ఇక దీపావళి అంటే చిన్నా పెద్దా.. అందరికీ ఇష్టమే. ఇంటి ముందు దీపాలు వెలిగించి.. లక్ష్మీ దేవిని పూజించే పండుగ వేళ నోరు తీపి చేసుకోకపోతే ఎలా? సాధారణంగా అందరి ఇళ్లలో అందుబాటులో ఉండే ఈ పదార్థాలతో ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి. బ్రెడ్ కాజా తయారీకి కావలసిన పదార్థాలు: ►బ్రెడ్ స్లైసెస్ – ఆరు ►చక్కెర – అర కప్పు ►యాలకుల పొడి – చిటికెడు ►పిస్తా, బాదం తురుము– తగినంత ►నీళ్లు – పావు కప్పు ►నూనె – సరిపడా. తయారీ విధానం: ►బ్రెడ్ స్లైసెస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేయాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి వేయించటానికి సరిపడా నూనె అందులో వేయాలి. ►కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి ►వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ►ఆ తర్వాత ఓ పాత్రలో పంచదార, నీళ్లు వేసి కలియబెట్టాలి ►స్టవ్ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలపాలి ►అందులో యాలకుల పొడి వేసుకుని ఓ సారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ►వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో ముంచి కాసేపటి తర్వాత తీసేయాలి ►పాకంలో ముంచి తీసిన బ్రెడ్ ముక్కలను పళ్లెంలో పరుచుకోవాలి ►తడిగా వున్నప్పుడే, తరిగిన పిస్తా పప్పులను, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ ఇలా! నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఇలా తయారు చేసుకోండి!
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. స్కూలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే ఎంత త్వరగా లేచినా సమయం సరిపోకపోగా రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలు విసుగు పుట్టించేస్తుంటాయి. ఇటువంటి వారు వెరైటీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయొచ్చు.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ కావలసినవి: ►బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – మూడు ►గుడ్లు – నాలుగు ►బటర్ – వేయించడానికి సరిపడా ►పాలు – రెండు టేబుల్ స్పూన్లు ►బరకగా దంచిన ఎండు మిర్చి పొడి – టేబుల్ స్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►మిరియాల పొడి – పావు టేబుల్ స్పూను ►ఉల్లిపాయ –ఒకటి(సన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి –మూడు (సన్నగా తరగాలి) తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ►దీనిలోనే పాలు, బరక మిరప పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్‌పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైస్‌ను గుడ్ల సొనలో ముంచి పాన్‌పై పెట్టాలి. ►బ్రెడ్స్లైస్ ఒకవైపు కాలుతుండగానే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును పైన వేయాలి. ►ఈ ముక్కలపైనే కొద్దిగా గుడ్లసొన మిశ్రమం వేయాలి. ►బ్రెడ్ స్లైస్‌ను రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చి సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! Egg Poha Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా! -
పోయిన నగలు ‘భలే’గా దొరికాయి.. సుందరి ప్రాణం లేచొచ్చింది
అరుదైన ఘటనలు అంటారు కదా! ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కచ్చితంగా ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి బాకీలు తీర్చాలనుకున్న ఓ తల్లికి.. ఊహించని కష్టం వచ్చిపడింది. ఆమె మంచి మనసే.. ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. చివరకు పోలీసుల ప్రయత్నంతో కథ సుఖాంతం కావడమే కాదు.. పోయిన ఆమె పది తులాల బంగారం ఓ డ్రైనేజీలో ‘భద్రం’గా దొరికింది కూడా. ఆమె అదృష్టం చేజారిపోలేదని నిరూపించిన ఘటన.. మహారాష్ట్ర ముంబై ఆరే కాలనీలో జరిగింది. స్థానిక నివాసి అయిన 45 ఏళ్ల సుందరి ప్లనిబెల్.. గోరేగావ్ గోకుల్ ధామ్ కాలనీలోని ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తనకున్న పది తులాల బంగారు నగలను.. బ్యాంకులో డిపాజిట్ చేసి అప్పులు తీర్చాలని అనుకుందామె. జూన్ 13వ తేదీన పని ముగించుకుని బ్యాంకుకు వెళ్తున్న టైంలో.. ఓ ఇంటి ఓనర్ మిగిలిపోయిన కడక్ పావ్‌ను సుందరికి ఇచ్చింది. అయితే సుందరి బ్యాంకుకు వెళ్తున్న మార్గంలో.. ఓ తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. బిడ్డ ఆకలితో ఉందేమో అనుకుని తన దగ్గరున్న కడక్పావ్ సంచిని ఆ తల్లికి ఇచ్చేసిందామె. తీరా బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. రోడ్డు మీద కనిపించిన ఆ తల్లికి ఇచ్చిన సంచిలోనే నగలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. పరుగున వెళ్లి ఆ తల్లీబిడ్డల కోసం చూసింది. కానీ, వాళ్లు కనిపించలేదు. ఆలస్యం చేయకుండా.. దిన్దోషి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పి విలపించింది సుందరి. ఆ నగలు లేకపోతే అప్పులు తీర్చలేనని, తనకు చావే శరణ్యమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమె కన్నీళ్లకు కరిగిపోయి.. పోలీసులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన ఆ తల్లీబిడ్డల ఆచూకీ కోసం ఏరియాలో అందరినీ అడిగారు. చుట్టుపక్కల గల్లీలన్నీ జల్లెడ పట్టారు. రెండు గంటల వెతుకులాట తర్వాత.. మొత్తానికి వాళ్లను దొరకబుచ్చుకున్నారు. అయితే.. ఆ బ్రెడ్డు మీద ఆసక్తి లేకపోవడంతో అక్కడే చెత్త కుప్పలో దానిని పడేశామని ఆ తల్లి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాను గనుక దానిని ఎత్తేసి ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటూనే.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్తలో ప్రతీ సంచినీ క్షుణ్ణంగా వెతికి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో.. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాపై ఏఎస్సై సూరజ్ రౌత్ కన్నుపడింది. దానిని పరిశీలించాడాయన. అయితే అందులో ఓ సంచి దానికి అదే కదులుతూ వెళ్లడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అందులో బ్రెడ్డు ఉండడంతో అది ఎలుకల పనే అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. దగ్గర్లోని ఎలుకల కలుగులను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. చెత్త కుప్పకు కాస్త దగ్గర్లో.. మురికినీరు పోయే ఓ రంధ్రంలో ఎలుకలు అటు ఇటు కదలాడుతున్నాయి. ఆ రంధ్రం నుంచి తొంగి చూసిన పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని బయటకు తీసి చూడగా.. అందులో నగలు భద్రంగానే ఉన్నాయి. ఆ నగలను అలాగే అప్పగించిన దిన్దోషి పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. నమ్మశక్యంగా లేదు కదూ!. -
ఎరేజర్‌ను ఎలా కనుగొన్నారో తెలుసా?
పెన్సిల్ మార్క్‌లను చెరపడానికి ఒకప్పుడు ఏం వాడేవారో తెలుసా? బ్రెడ్ ముక్కలను వాడేవారట. ఇంగ్లండ్ కంటి వైద్యుడు, సైంటిఫిక్ పరికరాల తయారీదారైన ఎడ్వర్డ్ నైన్ 1770లో రబ్బరు ముక్కను పెన్సిల్ మార్క్‌లు చెరపడానికి ఉపయోగించాడట. పక్కనే ఉన్న బ్రెడ్ ముక్క బదులుగా రబ్బరు ముక్కను తీసుకోవడంతో అది ఎరేజర్గా ఉపయోగపడుతుందన్న విషయం ఎడ్వర్డ్‌కి తెలిసింది. ఆ తర్వాత ఆయనే రబ్బర్‌తో ఎరేజర్లను తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. తప్పులను సరిచేయడం కోసం ఉపయోగపడుతున్న ఎరేజర్లు అలా ఓ పొరపాటు కారణంగా పుట్టాయన్నమాట.