రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. స్కూలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే ఎంత త్వరగా లేచినా సమయం సరిపోకపోగా రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలు విసుగు పుట్టించేస్తుంటాయి. ఇటువంటి వారు వెరైటీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయొచ్చు..
మసాలా ఫ్రెంచ్ టోస్ట్
కావలసినవి:
►బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – మూడు
►గుడ్లు – నాలుగు
►బటర్ – వేయించడానికి సరిపడా
►పాలు – రెండు టేబుల్ స్పూన్లు
►బరకగా దంచిన ఎండు మిర్చి పొడి – టేబుల్ స్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
►మిరియాల పొడి – పావు టేబుల్ స్పూను
►ఉల్లిపాయ –ఒకటి(సన్నగా తరగాలి)
►పచ్చిమిర్చి –మూడు (సన్నగా తరగాలి)
తయారీ:
►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేసుకోవాలి.
►దీనిలోనే పాలు, బరక మిరప పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
►స్టవ్ మీద పాన్‌పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైస్‌ను గుడ్ల సొనలో ముంచి పాన్‌పై పెట్టాలి.
►బ్రెడ్‌స్లైస్ ఒకవైపు కాలుతుండగానే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును పైన వేయాలి.
►ఈ ముక్కలపైనే కొద్దిగా గుడ్లసొన మిశ్రమం వేయాలి.
►బ్రెడ్ స్లైస్‌ను రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు కాల్చి సర్వ్‌చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Egg Poha Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment