Recipe: ఆపిల్‌, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్‌ ఎగ్‌ రింగ్స్‌ తయారీ! | Recipes In Telugu: How To Prepare Apple Egg Rings | Sakshi
Sakshi News home page

Apple Egg Rings: ఆపిల్‌, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్‌ ఎగ్‌ రింగ్స్‌ తయారీ!

Published Sun, Dec 11 2022 5:29 PM | Last Updated on Sun, Dec 11 2022 7:33 PM

Recipes In Telugu: How To Prepare Apple Egg Rings - Sakshi

ఆపిల్‌, మొక్కజొన్న పిండి, కోడి గుడ్లతో ఇలా ఆపిల్‌ ఎగ్‌ రింగ్స్‌ తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్లకు సండే ఇలా స్పెషల్‌ వంటకం చేసి పెట్టండి!
కావలసినవి:
►ఆపిల్
►గుడ్లు – 2 చొప్పున
►పాలు – పావు కప్పు
►మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు

►పంచదార, బటర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
►నూనె, దాల్చిన చెక్క 1 టీ స్పూన్‌ చొప్పున
►పుదీనా – కొద్దిగా
►పంచదార పొడి – కొద్దిగా

తయారీ:
►ముందుగా రెండు వేరువేరు బౌల్స్‌ తీసుకుని.. గుడ్లలోని తెల్లసొన ఒకదానిలో.. పసుపు సొన ఒకదానిలో వేసుకోవాలి.
►తెల్లసొనలో పంచదార వేసుకుని.. హ్యాండ్‌ బ్లెండర్‌తో నురుగు వచ్చేలా బాగా కలపాలి.
►పసుపు సొనలో మొక్కజొన్న పిండి, పాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి.
►ఈలోపు ఆపిల్స్‌ పైతొక్క తొలగించి.. గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకుని.. మధ్యలో గింజలు ఉండే భాగాన్ని తీసేసుకోవాలి.
►అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పెనం పెట్టుకుని.. దానిపై బటర్‌ వేసుకోవాలి.
►బటర్‌ కరిగిన తర్వాత నూనె కూడా వేసుకుని.. ఒక్కో ఆపిల్‌ ముక్కని రెండు బౌల్స్‌లో బాగా ముంచి.. ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.
►వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement