Corn Flour
-
Recipe: నోరూరించే పొటాటో పాప్‌కార్న్.. ట్రై చేయండిలా!
భిన్న రుచులు ట్రై చేయడం అలవాటా? అయితే, ఇంట్లో ఇలా పొటాటో పాప్ కార్న్ చేసి చూడండి! కావలసినవి: ►బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) ►చాట్ మసాలా – పావు టీ స్పూన్ ►కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►ఉప్పు – తగినంత ►కారం – కొద్దిగా ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ►కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. ►అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. ►అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. ►తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు.. -
Recipe: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ!
ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడి గుడ్లతో ఇలా ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్లకు సండే ఇలా స్పెషల్ వంటకం చేసి పెట్టండి! కావలసినవి: ►ఆపిల్ ►గుడ్లు – 2 చొప్పున ►పాలు – పావు కప్పు ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార, బటర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►నూనె, దాల్చిన చెక్క 1 టీ స్పూన్ చొప్పున ►పుదీనా – కొద్దిగా ►పంచదార పొడి – కొద్దిగా తయారీ: ►ముందుగా రెండు వేరువేరు బౌల్స్ తీసుకుని.. గుడ్లలోని తెల్లసొన ఒకదానిలో.. పసుపు సొన ఒకదానిలో వేసుకోవాలి. ►తెల్లసొనలో పంచదార వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా కలపాలి. ►పసుపు సొనలో మొక్కజొన్న పిండి, పాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి. ►ఈలోపు ఆపిల్స్ పైతొక్క తొలగించి.. గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని.. మధ్యలో గింజలు ఉండే భాగాన్ని తీసేసుకోవాలి. ►అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం పెట్టుకుని.. దానిపై బటర్ వేసుకోవాలి. ►బటర్ కరిగిన తర్వాత నూనె కూడా వేసుకుని.. ఒక్కో ఆపిల్ ముక్కని రెండు బౌల్స్‌లో బాగా ముంచి.. ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం.. ఘీ రైస్ కావలసినవి: ►బాస్మతి బియ్యం – కప్పు ►నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలకులు – రెండు ►లవంగాలు – రెండు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►అనాస పువ్వు – ఒకటి ►మరాటి మొగ్గ – ఒకటి ►జీలకర్ర – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను ►పచ్చిబఠాణీ – అరకప్పు ►స్వీట్ కార్న్ – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి). తయారీ: ►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి. ►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి. ►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్ కార్న్ వేసి మీడియం మంటమీద వేయించాలి. ►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి. ►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పనీర్ జిలేబీ కావలసినవి: ►పనీర్ ముక్కలు– అరకప్పు ►మైదా – అరకప్పు ►వంటసోడా – చిటికెడు ►కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూను ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను ►పాలు – పావు కప్పు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. సుగర్ సిరప్ కోసం: పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ►పనీర్ ముక్కలను బ్లెండర్లో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి ►పనీర్ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ►ఇప్పుడు టేబుల్ స్పూన్ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి. ►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. ►జిలేబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి పాకంలో వేయాలి. ►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా!
మొక్కజొన్న పిండి, మైదాపిండితో బొప్పాయి హల్వా ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►బొప్పాయి – 1(ఒక కేజీ) ►మొక్కజొన్న పిండి, మైదాపిండి – పావు కప్పు చొప్పున ►పంచదార – ముప్పావు కప్పు, చిక్కటి పాలు – 2 కప్పులు ►నెయ్యి – 6 టేబుల్ స్పూన్ల పైనే ►కొబ్బరి తురుము – గార్నిష్ కోసం తయారీ విధానం: ►ముందుగా బొప్పాయి తొక్క, లోపల గింజలు తీసి.. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►దానిలో మొక్కజొన్న పిండి, మైదాపిండి, పంచదార, చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపాలి. ►పంచదార కరిగేంత వరకూ కలిపి.. కళాయిలో పోసుకుని.. చిన్న మంట మీద.. ఆ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి దగ్గరపడేంత వరకూ. ►మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ ఉండాలి. ►దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని, బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని.. చల్లారనివ్వాలి. ►ఆపై నచ్చిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makka Sattu Muddalu: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే! Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Bathukamma: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ‘అమ్మ’కు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక బతుకమ్మ అంటేనే సత్తుపిండి ఘుమఘుమలు ఉండాల్సిందే! ఎక్కువగా పెసరపప్పు, నువ్వులు, పల్లీలతో సత్తుపిండిని తయారు చేసుకుంటారు. వీటితో పాటు మొక్కజొన్న గింజలతో చేసే సత్తు(మక్క సత్తు అని కూడా అంటారు)తో చేసిన ముద్దలు(లడ్డూలు) కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలు, బెల్లం లేదంటే చక్కెర.. నెయ్యి ఉంటే చాలు మక్క సత్తు ముద్దలు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోండి ►ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి. ►అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ►ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ. మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ►మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►దీనిలో విటమిన్- ఏ, విటమిన్- బీ, సీ ఎక్కువ. ►మొక్కజొన్నలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఇందులో విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలం. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి.. రక్తహీనతను నివారించేందుకు దోహదపడతాయి. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుంది. చదవండి: Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Recipe: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారు చేసుకోవచ్చు!
బోన్‌లెస్ చికెన్.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్ పొటాటో నగ్గెట్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారీకి కావలసినవి: ►బోన్‌లెస్ చికెన్ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి) ►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున ►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 2 (ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్ స్పూన్ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి) ►బ్రెడ్ పౌడర్ – గార్నిష్ కోసం ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి. ►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా! Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్!
చికెన్, కోడిగుడ్లు, మొక్కజొన్న పిండి, నువ్వులు సెసెమీ క్రస్టెడ్ చికెన్ ఇలా తయారు చేసుకోండి! కావలసినవి: ►బోన్‌లెస్ చికెన్ – ఒక కేజీ (ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి) మారినేషన్ కోసం: ►పెరుగు – కప్పు ►నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు ►పచ్చి బొప్పాయి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్ ►గరం మసాలా పొడి– ఒక టీస్పూన్ ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►నూనె – 3 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినంత) కోటింగ్ కోసం: ►కోడిగుడ్లు – 3 ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – అర టీ స్పూన్ ►నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి – 6 (సన్నగా తరగాలి) ►వెల్లుల్లి పేస్ట్– టీస్పూన్ ►మిరప్పొడి – టీ స్పూన్ ►వెనిగర్ – టేబుల్ స్పూన్ ►బెల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్.. తయారీ: ►చికెన్‌ను శుభ్రం చేసి, మారినేషన్ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి కలపాలి. ►మారినేట్ చేసిన చికెన్ ముక్కలను కోటింగ్ మిశ్రమంలో వేసి తీసి నువ్వులలో వేసి (చికెన్ ముక్కల మసాలాలకు నువ్వులు అంటుకునేటట్లు) కలపాలి. ►అవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Til Ki Barfi And Sesame Veg Salad: నువ్వులతో ఆరోగ్యం.. తిల్ కీ బర్ఫీ, సెసెమీ వెజ్ సలాడ్ తయారీ ఇలా! Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్, బటాడా వడ తయారీ -
Beauty Tips: బీట్రూట్ రసం, కార్న్ ఫ్లోర్.. గులాబీ రేకుల్లాంటి పెదాలు!
పెదాలు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి! బ్రష్‌తో ఇలా ►ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ►ఇలా రోజూ చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ►పెదాలకు మర్ధన జరిగి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. ►పెదవులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంతో.. ►ఉదయం బ్రష్‌తో మర్ధన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ►ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. ►అలా వేడిచేసిన రసంలో అరటీస్పూను కార్న్‌ప్లోర్ వేసి ఐదు నిమిషాలు కలియబెట్టి తర్వాత దించేయాలి. ►చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో అరటీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేయాలి. ►ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ►ఉదయం నీటితో కడిగేయాలి. ►ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబిరేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చదవండి: Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం! Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!
కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...! ►పెరుగు, ఫ్రెష్ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి. ►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది. ►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి. ►నానాక జీడిపప్పుని నేతిలో వేయించాలి. ►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ►కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది. ►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి. ►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? -
Recipe: మొక్క జొన్న పిండి, ఉప్పు, వాము.. మక్కి రోటీ ఇలా ఈజీగా!
మక్కి రోటీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో ఇలా సులభంగా తయారు చేసుకోండి. కావలసినవి: ►మొక్కజొన్న పిండి – రెండు కప్పులు ►వాము – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►వేడి నీళ్లు – కప్పు ►నెయ్యి – రోటి ఫ్రైకి సరిపడా. తయారీ.. ►మొక్కజొన్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, వాము వేసి చక్కగా కలుపుకోవాలి. ►దీనిలో కొద్దికొద్ది గా వేడి నీళ్లు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ►ఈ పిండి ముద్దను పదినిమిషాలు నానబెట్టాలి. ►తరువాత పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేయాలి. ►ఒక్కో ఉండను మందపాటి చపాతీలా వత్తుకోవాలి∙ ►ఉండలన్నింటిని ఇలా వత్తుకున్న తరువాత, నెయ్యి వేసి రోటిని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మక్కీ కి రోటీ రెడీ అయినట్లే. ►ఏ గ్రేవీ కర్రీలోనైనా ఈ రోటీ నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీ! Recipe: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్ తయారీ ఇలా!