Best Sweet Recipes In Telugu: How To Prepare Papaya Halwa Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా

Published Thu, Sep 29 2022 5:01 PM | Last Updated on Thu, Sep 29 2022 6:14 PM

Recipes In Telugu: How To Prepare Papaya Halwa - Sakshi

మొక్కజొన్న పిండి, మైదాపిండితో బొప్పాయి హల్వా ఇలా తయారు చేసుకోండి.
కావలసినవి:  
►బొప్పాయి – 1(ఒక కేజీ)
►మొక్కజొన్న పిండి, మైదాపిండి – పావు కప్పు చొప్పున
►పంచదార – ముప్పావు కప్పు, చిక్కటి పాలు – 2 కప్పులు

►నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్ల పైనే
​​​​​​​►కొబ్బరి తురుము –  గార్నిష్‌ కోసం

తయారీ విధానం:
​​​​​​​►ముందుగా బొప్పాయి తొక్క, లోపల గింజలు తీసి.. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
​​​​​​​►దానిలో మొక్కజొన్న పిండి, మైదాపిండి, పంచదార, చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపాలి.
​​​​​​​►పంచదార కరిగేంత వరకూ కలిపి.. కళాయిలో పోసుకుని.. చిన్న మంట మీద.. ఆ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి దగ్గరపడేంత వరకూ.

​​​​​​​►మధ్య మధ్యలో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున నెయ్యి వేస్తూ ఉండాలి.
​​​​​​​►దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని, బాగా కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
​​​​​​​►ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని.. చల్లారనివ్వాలి.
​​​​​​​►ఆపై నచ్చిన షేప్‌లో ముక్కలు కట్‌ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Makka Sattu Muddalu: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!
Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement