కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...!
►పెరుగు, ఫ్రెష్ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి.
►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది.
►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి.
►నానాక జీడిపప్పుని నేతిలో వేయించాలి.
►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది.
►కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది.
►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి.
►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment