Cashew nuts
-
శ్రీవారి చెంతకు పలాస జీడిపప్పు
-
వెయిట్ లాస్ జర్నీలో.. ఈ డ్రైఫ్రూట్స్ పని అద్భుతం!
బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్‌లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం! తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్‌కు, వెయిట్ లాస్‌కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది. ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి. చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి. జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్‌తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది. -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి. పనీర్ హల్వా తయారీకి కావలసినవి: ►పనీర్ తురుము – 500 గ్రాములు ►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున ►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►పాలు – 200 మిల్లీలీటర్లు ►కోవా – 200 గ్రాములు ►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్ ►బెల్లం కోరు – 100 గ్రాములు ►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్ ►పిస్తా – గార్నిషింగ్ కోసం తయారీ: ►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. ►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి. ►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా. ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. -
Health Tips: హై బీపీ ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..
ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది బీపి. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. తక్కువ వయసు వారు కూడా హైబీపితో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం.. పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలో చూద్దాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్‌ను దూరం పెడుతుంటారు. వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోననే అపోహతో. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. పల్లీలు పల్లీలు లేదా వేరుసెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల వంటి పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ వంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్ ముందుంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్లెం వేయడం సులభం అవుతుంది కాబట్టి రోజూ నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. బాదం పప్పు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పెడు వేరుసెనగ గింజలను, నాలుగైదు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. జీడిపప్పులు జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అది సరికాదు.. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు, ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మానికి ప్రయోజనకరం డ్రై ఫ్రూట్స్‌లో చాలావరకు విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పేననడంలో ఎలాంటి సందేహం లేదు. చాపకింద నీరులా గుండె కవాటాలను పూడ్చివేసి, గుండె పనితీరును మందగింపజేసే బీపీని అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునంటున్నారు ఆహార నిపుణులు. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్ చేయడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!
కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...! ►పెరుగు, ఫ్రెష్ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి. ►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది. ►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి. ►నానాక జీడిపప్పుని నేతిలో వేయించాలి. ►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ►కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది. ►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి. ►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? -
పచ్చి జీడిపప్పు తింటున్నారా?
-
Jeedipappu: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా.. అయితే...
జీడిపప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇతరత్రా విశేషాలు మీకు తెలుసా! Health Benefits Of Cashew Nuts: జీడిమామిడి పండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పును సేకరిస్తారు. దీనిని ఎక్కువగా ఉష్ణ మండలాల్లో సాగు చేస్తారు. బ్రెజిల్‌ను దీనికి పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఇక మన దేశం నుంచి కూడా జీడి ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతోంది. సాధారణంగా జీడిపండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. జీడిపప్పులో ఉండే పోషకాలు ►జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ. ►విటమిన్ ఇ, కె, బి6 పుష్కలం. ►క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండు. ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల జీడిపప్పులో ఉండే పోషకాలు కాలరీలు- 157 ప్రొటిన్- 5 గ్రాములు ఫ్యాట్- 12 గ్రాములు కార్బోహైడ్రేట్లు- 9 గ్రాములు ఫైబర్-1 గ్రా. కాపర్- డైలీ వాల్యూలో 67 శాతం మెగ్నీషియం- 20 శాతం జింక్- 15 శాతం మాంగనీస్- 20 శాతం ఫాస్పరస్- 13 శాతం ఐరన్- 11 శాతం సెలీనియమ్- 10 శాతం థయామిన్- 10 శాతం విటమిన్ కె- 8 శాతం విటమిన్ బీ6- 7 శాతం జీడిపప్పు- ఆరోగ్య ప్రయోజనాలు: ►జీడిపప్పు తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ►జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. ►కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా దీనిని డైట్లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది. ►దీనిలో అన్శాటురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. హృద్రోగాల ముప్పును నివారిస్తాయి. ►ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్ ఉంటుంది. ►ఇందులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ►మెగ్నీషియం, మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►వేయించుకుని లేదంటే, గ్రైండ్ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది. ►మధుమేహ రోగులు, టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సంతాన లేమితో బాధపడే వారు జీడిపప్పు తింటే మంచిది! ఇందుకు సంబంధించి గతంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. బాదం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా వివరించారు. నోట్: కిడ్నీ ఆకారంలో కనిపించే జీడిపప్పును పచ్చిగానే తింటారు చాలా మంది. అయితే, ఇది శ్రేయస్కరం కాదంటున్నారు పరిశోధకులు. ఇందులోని ఉరుషియోల్ అనే రసాయన పదార్థం కొంతమందిలో స్కిన్ రియాక్షన్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి జీడిపప్పును రోస్ట్ చేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
పలాస జీడి పప్పుకు కరోనా ఎఫెక్ట్
పలాస: కరోనా లాక్డౌన్లో జీడి పరిశ్రమలకు సడలింపులు ఇవ్వడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అయితే వాటి ఉత్పత్తులకు మాత్రం గిరాకీ లేకపోవడంతో సంబంధిత యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడి పప్పు ఉత్పత్తి ఎగుమతుల్లో జాతీయ స్థాయిలోనే పలాస జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. కరోనా ప్రభావంతో దీనికి గతేడాది కన్నా ఈ ఏడాది గిరాకీ తగ్గింది. ఫలితంగా జీడి పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతి తర్వాత నుంచి జీడి పప్పు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. మార్చి నుంచి మే వరకు వివిధ శుభకార్యాలు, పండగలు, ఉత్సవాలు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు జీడి పప్పు ఎగుమతి కావడం వల్ల ధరలు కూడా అందుకనుగుణంగా పెరుగుతూ వచ్చేవి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావంతో వర్తక, వాణిజ్యం స్తంభించింది. ఆ ప్రభావం పలాస జీడి పప్పు మార్కెటుపైనా పడింది. దీంతో ధరలు అనూహ్య రీతిలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది కిలో జీడి పప్పు నాణ్యత బట్టి రూ.700 నుంచి రూ.750 వరకు ఉండేది. ఈ ఏడాది నంబరు వన్ జీడి పప్పు రూ.650కు తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. గిరాకీ తగ్గడంతో ముడిసరుకు జీడి పిక్కల ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. ఉద్దానం ప్రాంతంలో ఈ సీజన్లో జీడి పిక్కలకు మంచి డిమాండ్ ఉండేది. కొనుగోలు అమ్మకాలు బాగా సాగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతులు తమ పంటకు కనీసం గిట్టుబాటు ధర 80 కిలో జీడి పిక్కల బస్తాకు రూ.15 వేలు కావాలని కోరుతుండటంతో వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ఉద్దానంలో పిక్కలు అమ్మకాలు కొనుగోలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం పలాస మార్కెట్లో 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.8 వేలు ఉంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఎదురు చూస్తున్నారు. -
వేడివేడి గుమ్మడి
ఇంట్లో గుమ్మడి నెలలో మహా అయితే ఒకసారి కనిపించొచ్చు. తెలిసిన ఒకటీ అరా కూరలు దానితో చేస్తుండవచ్చు. గుమ్మడి రుచిలో మేటి... పోషకాలకు సాటి... అంతేకాదు ప్రయత్నించి చూస్తే పదహారు రకాల కూరలు కూడా చేసి ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎంచి ఎనిమిది ఇచ్చాం. మరో ఎనిమిది మీరు ట్రై చేయండి. గుమ్మడి రుచులతో కమ్మటి విందు చేసుకోండి. గుమ్మడి పాయసం కావలసినవి: గుమ్మడి కాయ తురుము – ఒక కప్పు; చిక్కటి పాలు – రెండున్నర కప్పులు; బాదం పప్పులు – 12; జీడిపప్పులు – 6; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; కిస్మిస్ – 10; బెల్లం తరుగు – 5 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర టీ స్పూను; పాల పొడి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర కప్పుల పాలు పోసి కొద్దిగా కాగిన తరవాత, గుమ్మడికాయ తురుము జత చేసి ఉడికించాలి ►బాదం పప్పులు, జీడి పప్పులు, ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, సుమారు పావుగంట సేపు ఉడికించాలి (మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►గుమ్మడికాయ తురుము బాగా మెత్తపడిందనుకున్నాక దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో కప్పుడు పాలు, పాల పొడి జత చేసి, సన్నటి మంట మీద కాచాక, మెత్తగా చేసిన గుమ్మడికాయ తరుగు జత చేసి, బాగా ఉడికించాలి ►మిశ్రమం బాగా ఉడికి, చిక్కబడ్డాక బెల్లం తరుగు వేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి ►బెల్లం కరిగేవరకు గరిటెతో కలుపుతుండాలి ∙కిస్మిస్ జత చేయాలి ►బాదం పప్పు తరుగుతో అలంకరించి, బౌల్స్‌లోకి తీసుకుని, అందించాలి. కేరళ గుమ్మడి పచ్చడి కావలసినవి: తీపి గుమ్మడి కాయ – 300 గ్రా.; పసుపు – అర టీ స్పూను; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మసాలా కోసం: తాజా కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 1; అల్లం తురుము – 1 టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు. తయారీ: ►గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద కుకర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి, ఒక విజిల్ రాగానే దింపేసి, కుకర్ మీద చల్ల నీళ్లు పోసి, మూత తీసేయాలి ►గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీసి, గుమ్మడి కాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఒడిషా గుమ్మడి సెనగపప్పు బంగాళ దుంప కూర కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు (అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి); గుమ్మడి కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; జీలకర్ర – 4 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – రెండున్నర టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో సెనగ పప్పు, బంగాళ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ►అల్లం తురుము జత చేసి బాగా కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన గుమ్మడికాయ మిశ్రమం జత చేసి బాగా కలియబెట్టాలి ►కొబ్బరి తురుము జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►జీలకర్ర పొడి, మిరప కారం, కొత్తిమీరలతో అలంకరించి దింపేయాలి ►పూరీ, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గోవా గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగాక గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించాలి ►ఉల్లి తరుగు, మిరపకారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ►చివరగా తాజా కొబ్బరి తురుము వేసి మరోమారు కలియబెట్టి, తడి పోయేంత వరకు ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. స్పైసీ గుమ్మడి కాయ కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – అర కేజీ; టొమాటో ముక్కలు – ఒక కప్పు; గసగసాలు – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక గసగసాలు వేసి రంగు మారే వరకు వేయించాలి ►వెల్లుల్లి తరుగు జతచేసి కొద్దిసేపు వేయించాలి ∙పసుపు, ధనియాల పొడి, గరం మసాలా జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, గుమ్మడికాయ ముక్కలు జత చేసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలిపి మూత ఉంచాలి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించాలి) ►మధ్యమధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►ఈ వంటకం భోజనంలోకి రుచిగా ఉంటుంది. గుమ్మడి రైతా కావలసినవి: గుమ్మడి కాయ తురుము – 200 గ్రా.; పెరుగు – 400 మి.లీ.; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు, గుమ్మడి తురుము వేసి ఉడికించి, నీళ్లు పిండేయాలి ►స్టౌ మీద మరో బాణలిలో నూనె వేసి కాగాక ఉడికించిన గుమ్మడి తురుము, ఉప్పు వేసి తడిపోయే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి, బాగా ఉడికిన తరవాత ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి ►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర జత చేయాలి ►చివరగా గుమ్మడికాయ తురుము జత చేసి బాగా కలపాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. ఉడిపి గుమ్మడి సాంబార్ కావలసినవి: కంది పప్పు – అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; సాంబార్ మసాలా కోసం; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 3 రెమ్మలు. ఇంకా... నూనె – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో ముక్కలు – ఒక కప్పు; మునగ కాడలు – 2 (ముక్కలు చేయాలి); గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; చింత పండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం –అర టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►కందిపప్పును సుమారు రెండు గంటల పాటు నానబెట్టాక, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►మునగకాడ ముక్కలు, ఒక కప్పుడు నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి ►గుమ్మడి కాయ ముక్కలు, మిరప కారం జత చేసి మరి కాసేపు ఉడికించాలి ►ముక్కలన్నీ ఉడికిన తరవాత, టొమాటో తరుగు జత చేయాలి ►ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి, ఉడుకుతున్న సాంబారుకు జత చేసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం తరుగు, మసాలా ముద్ద జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించి దింపేయాలి. చింతపండు గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర – పావు టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2 ; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; చింతపండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – అర టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి, గుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ►ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ►ఐదు నిమిషాల తరవాత ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసి, చింత పండు గుజ్జు జత చేయాలి ►బెల్లం తరుగు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి తడిపోయే వరకు ఉడికించాలి ►పరాఠా, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. -
రోజూ ఇవి తింటే బరువెక్కరు!
ఊబకాయం వచ్చేస్తోందని బాధపడుతున్నా రా? అయితే రోజూ బాదం, జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే సరి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. శుద్ధి చేసిన మాంసం, చిప్స్, ఫ్రై లలో సగం మోతాదును ఈ ఆరోగ్యకరమైన గింజలు, పప్పులతో భర్తీ చేసినా బరువు పెరగడం తగ్గుతారని పరిశోధకులు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం ఎక్కువగా కేలరీలు మాత్రం తక్కువగా ఉండటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం 14 గ్రాముల గింజలు, పప్పులు అధికంగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నది వీరి అంచనా. మొత్తం మూడు వర్గాల వారిని దీర్ఘ కాలం పాటు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకొచ్చారు. సుమారు 51, 529 మంది (40–75 మధ్య వయస్కులు) పురుషులు, 1,21,700 మంది నర్సుల (35–55 మధ్య వయస్సు)తో పాటు సుమారు 1.16 లక్షల మంది యువ నర్సులపై ఇరవై ఏళ్ల పాటు బరువు, ఆహారం, వ్యాయామం వంటి వివరాలను సేకరించి మరీ ఈ అధ్యయనం చేశారు. నాలుగేళ్లకోసారి బరువును ప్రకటించడంతో పాటు అంతకు ముందు సంవత్సరంలో ఎంత తరచుగా గింజలు, పప్పులు తిన్నారో కూడా తెలిపేలా అధ్యయనం జరిగింది. పప్పులు, గింజల్లో దేని వాడకం ఎక్కువైనాసరే.. దీర్ఘకాలంలో బరువు పెరగడం తగ్గినట్లుగా తెలిసింది. -
పళ్లెంలో ముత్యాలు
సగ్గుబియ్యం తెల్లగా ఉంటుంది. అందరినీ ఆకర్షిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది. ప్రొటీన్లను ఇస్తుంది. ముత్యాలను పోలిన రూపం.. రుచికి ప్రతిరూపం. వడియాలు.. పాయసం రొటీన్. లడ్డు, దోసె, కిచిడీ, వడ ట్రై చేయండి. మీ మొగ్గు దీనికే అని చాటి చెప్పండి. సాబుదానా లడ్డు కావలసినవి: సగ్గుబియ్యం – ఒక కప్పు (సన్న సగ్గు బియ్యం); ఎండుకొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పంచదార పొడి – అర కప్పు; నెయ్యి – 7 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు 10 (చిన్న ముక్కలు చేయాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను; జాజికాయ పొడి – చిటికెడు. తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, సగ్గుబియ్యం వేసి దోరగా వేయించి (సన్న మంట మీద కాస్తంత సమయం పడుతుంది) ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి ►చల్లారిన సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, వేగుతున్న ఎండు కొబ్బరికి జత చేసి మరోమారు వేయించాలి ►పంచదార పొడి కూడా జత చేసి రెండు నిమిషాలు బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, సగ్గుబియ్యం పొడి మిశ్రమానికి జత చేయాలి ►ఏలకుల పొడి, జాజికాయ పొడి కూడా జత చేయాలి ►కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు లడ్డూ మాదిరిగా ఉండ కట్టి, ప్లేట్లోకి తీసుకోవాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సాబుదానా దోసె కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – పావు కప్పు; మెంతులు – అర టీ స్పూను; అటుకులు – పావు కప్పు; బియ్యం – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మినప్పప్పు, మెంతులు, అటుకులు వేసి సుమారు ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►ఒక పెద్ద పాత్రలో బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►నానబెట్టిన సగ్గు బియ్యం మిశ్రమాన్ని, నానబెట్టిన బియ్యానికి జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి, పన్నెండు గంటల పాటు వదిలేయాలి ►మరుసటి రోజు ఉప్పు జత చేయాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు దోసె పిండి వేసి, సమానంగా పరిచి, రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేటులోకి తీయాలి ►కొబ్బరి చట్నీతో వేడివేడిగా అందించాలి. సాబు దానా థాల్పీ కావలసినవి: సగ్గుబియ్యం – ముప్పావు కప్పు; బంగాళదుంపలు – 2; జీలకర్ర పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లలో శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టాలి ►నీటిని ఒంపేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ∙బంగాళ దుంపలను ఉడికించి తొక్క వేరు చేసి, దుంపలను చేతితో మెత్తగా మెదపాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మెదిపిన బంగాళ దుంప వేసి బాగా కలిపి, మిగిలిన పదార్థాలను (నెయ్యి తప్పించి) జత చేసి బాగా కలపాలి ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక నెయ్యి వేయాలి ►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, సగ్గు బియ్యం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి ►బంగారు రంగులోకి వచ్చి, బాగా కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకోవాలి ►పెరుగు చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా కిచిడీ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2; వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూను; నిమ్మరసం – ఒక టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని నీళ్లలో శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు ఆరు గంటల పాటు నానబెట్టాలి ►నీరు తీసేసి సగ్గు బియ్యాన్ని పక్కన ఉంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్కి తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి రవ్వలా పొడి చేయాలి ►పల్లీల పొడి, ఉప్పు, పంచదార జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి ►తరిగిన బంగాళ దుంప జత చేసి మరోమారు వేయించాక, సగ్గు బియ్యం మిశ్రమం జత చే సి కొద్దిసేపు ఉడికించి (ఎక్కువ ఉడికించకూడదు) దింపేయాలి ►నిమ్మ రసం, కొత్తిమీర తరుగు జత చేయాలి ►కిచిడీ అందించే ముందు కొద్దిగా కొత్తిమీర, నిమ్మ రసం, కొబ్బరి తురుములతో అలంకరించితే బాగుంటుంది వేడివేడిగా అందించాలి. సాబుదానా వడ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; నీళ్లు – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – రెండు; అల్లం తురుము – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; రాజ్ గిర్ పిండి – 3 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); సైంధవ లవణం – చిటికెడు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర కప్పు నీళ్లు జత చేసి ఒక రోజు రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపేయాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యాన్ని వేసి చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదపాలి ►పల్లీ ముక్కలు, జీడి పప్పు ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, జీలకర్ర జత చేసి మెత్తగా అయ్యేలా కలపాలి ►కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ►రాజ్ గిర్ పిండి, కొద్దిగా నీళ్లు జత చేసి వడల పిండి మాదిరిగా కలపాలి ►అర టీ స్పూను పంచదార, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►కొద్దికొద్దిగా పిండి తీసుకుని వడ మాదిరిగా చేతితో ఒత్తాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న వడలను ఒక్కొక్కటిగా వేస్తూ, దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చింత పండు పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా చివ్డా కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; పల్లీలు – పావు కప్పు; కిస్మిస్ – పావు కప్పు; జీడి పప్పులు – పావు కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పంచదార పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కొద్దికొద్దిగా (అన్నీ ఒకేసారి వేయకూడదు) సగ్గు బియ్యం వేసి డీప్ ఫ్రై చేసి, బాగా పొంగిన తరవాత కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ►పల్లీలు, కిస్మిస్, జీడి పప్పులను కూడా ఇదే విధంగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►వేయించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకుని, ఉప్పు, పంచదార పొడి, మిరప కారం, పచ్చి మిర్చి తరుగు జత చేసి స్పూను సహాయంతో బాగా కలపాలి ►కొద్దిగా చల్లారాక సర్వ్ చేయాలి. సాబుదానా భేల్ కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; బంగాళ దుంప – 1; మిరప కారం – చిటికెడు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ’ తగినన్ని నీళ్లు జత చేసి ఒక రాత్రంతా నానబెట్టాలి ►బంగాళ దుంప తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, బంగాళ దుంప ముక్కలు వేసి, దోరగా వేయించి తీసేయాలి ►ముక్కలు చల్లారాక సన్నగా తురమాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కాగాక సగ్గు బియ్యం వేసి బాగా వేయించాలి ►సగ్గు బియ్యం బాగా ఉడికి, మెత్తబడ్డాక, బంగాళ దుంప తురుము, వేయించిన పల్లీలు, వేయించిన జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరప కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి దింపేయాలి ►కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. సగ్గు బియ్యంతో ఆరోగ్యం ►సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం నుంచి తీసిన పొడితో తయారుచేస్తారు ►సగ్గు బియ్యంతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు ►కొన్ని ప్రాంతాలలో ఉపవాసం ఉన్న సమయంలో సగ్గుబియ్యం వంటకాలను మాత్రమే స్వీకరిస్తారు ►పేరులో బియ్యం అని ఉన్నప్పటికీ, ఇది బియ్యం జాతికి సంబంధించినది కాదు ►పాయసం, ఉప్మా, వడియాలు, వడలు, ఇడ్లీలు... ఇలా ఎన్నో రకాల వంటకాలు సగ్గు బియ్యం వల్ల రుచిగా ఉంటాయి ►ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగాను, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి ►బరువు తగ్గాలనుకునేవారికి సగ్గు బియ్యం మంచి ఔషధం ►ఇందులో గంజి ఎక్కువగా ఉంటుంది ►జ్వరం, వాంతులు, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి తక్షణ శక్తి కోసం సగ్గుజావను ఇస్తారు ►సగ్గుబియ్యం తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ►సగ్గు బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి ►కండరాల పటుత్వానికి సగ్గుబియ్యం ఎంతగానో ఉపయోగపడతాయి ►ఇందులో క్యాల్షియం శాతం ఎక్కువే ►రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు సగ్గు బియ్యం మంచి ఉపయోగకారి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఇందులో ఉంది ►గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది ►ప్రతిరోజూ సగ్గు బియ్యాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రోజంతా శక్తిగా ఉండొచ్చు ►అజీర్ణ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది ►వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి కాబట్టి, గర్భిణీలు నిత్యం సగ్గు బియ్యం తీసుకోవచ్చు ►ఇందులో ఉండే విటమిన్ కె కారణంగా మెదడు చురుకు అవుతుంది. -
తుపాను మిగిల్చిన వేదన తనువు చాలించిన మహిళ
వజ్రపుకొత్తూరు రూరల్/టెక్కలి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను మిగిల్చిన నష్టాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తమకు జీవనాధారమైన జీడి పంట కళ్ల ముందే నాశనం కావడంతో తట్టుకోలేకపోయింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో చోటు చేసుకుంది. సైని నారాయణమ్మ(49) భర్త అనందరావు ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. వారు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం విజయవాడకు వలస వెళ్లారు. తుపాన్ వల్ల పాడైపోయిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండడంతో నారాయణమ్మ పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ స్వగ్రామానికి వచ్చాడు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న రెండున్నర ఎకరాల జీడితోటను చూసేందుకు నారాయణమ్మ, దిలీప్‌కుమార్ కలిసి శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడ తిత్లీ తుపాన్ ధాటికి విరిగి పడిపోయిన చెట్లను చూసి నారాయణమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ విలపించింది. కొడుకును తోట వద్దే వదిలేసి ఇంటికి చేరుకుంది. ఇంటి చూరుకు తాడుతో ఉరివేసుకుంది. ఈ ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపిరి ఆగిన ఉద్దానం ఉద్దానం... ఉత్తరాంధ్ర కోనసీమ. ఇది ఒకప్పటి మాట. ప్రకృతి పగబట్టింది. తిత్లీ తుపాన్ ఉద్దానంను కబళించింది. పచ్చటి చేలు, తోటలతో అరారుతున్న ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి డివిజన్లోని 11 మండలాలు, పాలకొండ డివిజన్లోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాలను తిత్లీ తుపాన్ దారుణంగా దెబ్బతీసింది. జీడితోటలు గంటల వ్యవధిలో నేలకూలాయి. తిత్లీ తుపాన్ వచ్చి పోయి 10 రోజులు గడిచినా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. ఉద్దానం ప్రాంతంలో దాదాపు 84 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. తుపాన్ ధాటికి ఇందులో దాదాపు 74 వేల ఎకరాల్లో తోటలు ధ్వంసమయ్యాయి. కాపు కొచ్చిన జీడితోటలు నేలకూలడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జీడిపప్పు పరిశ్రమపై ఆధారపడిన 19,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తిత్లీ తుపానుతో జీడి పరిశ్రమకు రూ.450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పలాస ప్రాంతంలో 220 వరకు జీడి పరిశ్రమలు ఉండగా, వీటిలో 183 పరిశ్రమలు నేలమట్టం అయ్యాయి. ఉద్దానం ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. బోరుమంటున్న జీడి రైతులు 30, 40 సెంట్లు మొదలు 5, 10 ఎకరాల వరకు ఉన్న జీడిరైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ఉద్దానం ప్రాంతంలో ఏ రైతును కదిపినా గుండెల్ని పిండేసే కథలే. ఈ ప్రాంతానికి తుపాన్లు, అల్పపీడనాలు కొత్త కాకపోయినా ఇప్పుడు జరిగినంత విధ్వంసం గత 60, 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వాపోతున్నారు. తమ తోటల్లో తామే కూలీలుగా మారాల్సి వస్తుందని ఊహించలేదని బావురుమంటున్నారు. ఇప్పుడు కూలిపోయిన చెట్లను తీసివేయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు సాయం కూలిపోయిన చెట్లను తీసివేయడానికి కూడా సరిపోదు. తిరిగి తోటలు వేస్తే మరో ఐదేళ్ల వరకు పంట చేతికి రాదు, ఎలాంటి ఆదాయం ఉండదు. అప్పటిదాకా తామెలా బతకాలని రైతులు ఆవేదనతో కుమిలిపోతున్నారు. పండుగ నాడూ పస్తులే గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కోలాహలంగా కనిపించిన ఉద్దానం ప్రాంతం ఈసారి వెలవెలబోయింది. పండగ పూటా పస్తులే మిగిలాయి. పోయ్యిలో పిల్లి లేస్తే ఒట్టు. పండక్కి కనిపించే కోలాటాలు లేవు, కర్రసాములు లేవు, చెక్కభజనలు లేవు. అమ్మవారికి పూజలు లేవు. అరక సామాగ్రికి పూజలు లేవు. పశువుల అలంకరణ లేదు. సొంత వాహనాలకు పసుపు కుంకుమలు లేవు. కూలిపోయిన ఇళ్లు, గాలికెగిరిపోయిన ఇంటి పైకప్పులు, మొండి గోడల మధ్య తుపాన్ బాధితులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారు. స్వచ్ఛంద సంస్థలు వాహనాల్లో తీసుకొచ్చి పెట్టే తిండి కోసం, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు వండి పెట్టే భోజనం కోసం బాధితులు బారులు తీరుతుండడం చూపరులను కలచి వేస్తోంది. మీ కాళ్లు పట్టుకుంటా.. మంచినీళ్లు ఇవ్వండి తులశమ్మ అనే మహిళ ఆమనపాడు వద్ద జీడితోటల్లో నివాసం ఉంటోంది. ఐదారు కుటుంబాలు తోటల మధ్యనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయి. తిత్లీ తుపాన్ దెబ్బకు తోటలు నామరూపాల్లేకుండా పోయాయి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పిల్లాజెల్లలతో రోడ్డు మీదున్న ఓ ఇంట్లో తలదాచుకుంటున్న తులశమ్మ అక్కడ ఏదైనా వాహనం కనిపిస్తే ఆపండి ఆపండి అంటూ అడ్డం తగులుతోంది. అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా, మంచినీళ్లుంటే ఇవ్వండయ్యా అంటూ వేడుకుంటోంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. -
వీర్యవృద్ధికి... బాదాం, పిస్తా, వాల్నట్, జీడిపప్పు
జీవనశైలి మార్పులతో సంతాన లేమి సమస్యలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. బాదాం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొంతమంది ఆరోగ్యవంతమైన పురుషులపై తాము 14 వారాలపాటు అధ్యయనం చేశామని.. వీరందరినీ రెండు గుంపులుగా విడగొట్టి.. ఒకరికి సాధారణ ఆహారం.. ఇంకొక వర్గానికి డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా నట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అందించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. రోజుకు 60 గ్రాముల బాదాం, హేజల్, వాల్నట్స్లు అందించామని, 14 వారాల తరువాత చూసినప్పుడు వీరి వీర్యకణాలు 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని, కదలికలు ఆరు శాతం పెరిగినట్లు తెలిసిందని అలన్ పేసీ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ సంతానలేమికి కారణమని భావిస్తున్న ఇతర అంశాల్లోనూ సానుకూల ఫలితాలు రావడం తమ అంచనాలను ధ్రువపరుస్తున్నట్లు వివరించారు. -
క్విక్ ఫుడ్
పనీర్-కాజూ స్నాక్ కావలసినవి పనీర్: 100 గ్రా, జీడిపప్పు: 100 గ్రా (కచ్చాపచ్చాగా పలుకులు చేయాలి), కార్న్‌ఫ్లోర్: రెండు టీ స్పూన్లు , జీలకర్రపొడి : టీ స్పూన్, పసుపు: చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: చిన్నకప్పు, నూనె: ఫ్రైకి సరిపడ, కొత్తిమీర తరుగు: టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు: టీ స్పూన్, గరంమసాలా పౌడర్: టీ స్పూన్, ఉల్లికాడల తరుగు: టీ స్పూన్, ఉప్పు: తగినంత తయారి పనీర్‌ని పది నిమిషాల సేపు వేడినీటిలో ఉంచి తీశాక మెత్తగా చిదమాలి. అందులో కార్న్‌ఫ్లోర్, జీలకర్రపొడి, గరంమసాలాపొడి, ఉల్లిపాయ తరుగు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు పలుకులను ఒక గిన్నెలో వేసి... తగినన్ని నీటితో ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని అరచేతిలో వేసి కావలసిన షేప్‌లో ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే పేపర్ అదనంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. ఈ పనీర్- కాజు స్నాక్‌కు టొమాటో సాస్ మంచి కాంబినేషన్. ఈవెనింగ్ స్నాక్‌గా చాలా బాగుంటుంది. -
ఇంటిప్స్
గులాబ్‌జామ్ పిండిలో కొద్దిగా పన్నీరు తురుము కానీ జీడిపప్పు పొడి కానీ కలిపితే జామూన్లు ఎంతో మృదువుగా వస్తాయి! చీమలకు ఉప్పు అంటే పడదు. కాబట్టి చీమలు పడుతున్న చోట కాస్త ఉప్పు కలిపిన నీళ్లు చల్లితే సరి! సోఫా మీద నూనె మరకలు పడితే... ముందుగా వాటి మీద నిమ్మరసం చల్లాలి. తర్వాత దూదిని పెట్టి ఒత్తితే మరకలు పోతాయి. పులుసులు పెట్టినప్పుడు కొద్దిగా శెనగపిండి వేస్తే... పులుసు మరీ నీళ్లగా కాకుండా చిక్కగా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. -
జింజర్‌బ్రెడ్ ఎనర్జీ బార్స్
కావలసినవి: బాదం గింజలు - 3/4 కప్పు, జీడిపప్పు - 3/4 కప్పు, సన్నగా తరిగిన ఖర్జూరం - 1 కప్పు, కిస్మిస్ - అరకప్పు, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా, యాలకుల పొడి - అరకప్పు, ఎండబెట్టిన అల్లం పొడి - అరచెంచా, ఉప్పు - చిటికెడు, నీళ్లు - పావుకప్పు తయారీ: బాదం గింజలు, జీడిపప్పును పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఆపైన వాటితో పాటు ఖర్జూరం, కిస్మిస్, యాలకుల పొడి, అల్లం పొడి, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్... అన్నిటినీ కలిపి మిక్సీలో వేయాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసి కాసేపు మిక్సీ పడితే అవన్నీ గుజ్జులా మారతాయి. అప్పుడా గుజ్జును ఓ ప్లేట్లోకి తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఓ గంట తర్వాత బయటకు తీసి చాకుతో ఫొటోలో కనిపిస్తున్నట్టు ముక్కలుగా కోసుకోవాలి. వాటిని గాలి తగలని డబ్బాలో పెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 వారాల వరకు తాజాగా ఉంటాయి. -
జీడిపప్పు గోదాములో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యువశంకర్ ట్రేడర్స్‌కు చెందిన గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం 7 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2వేల బస్తాల జీడిపప్పు తగలబడి పోయిందని గోడౌన్ నిర్వహాకులు తెలిపారు.