జీవనశైలి మార్పులతో సంతాన లేమి సమస్యలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. బాదాం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొంతమంది ఆరోగ్యవంతమైన పురుషులపై తాము 14 వారాలపాటు అధ్యయనం చేశామని.. వీరందరినీ రెండు గుంపులుగా విడగొట్టి.. ఒకరికి సాధారణ ఆహారం.. ఇంకొక వర్గానికి డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా నట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అందించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు.
రోజుకు 60 గ్రాముల బాదాం, హేజల్, వాల్‌నట్స్‌లు అందించామని, 14 వారాల తరువాత చూసినప్పుడు వీరి వీర్యకణాలు 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని, కదలికలు ఆరు శాతం పెరిగినట్లు తెలిసిందని అలన్ పేసీ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ సంతానలేమికి కారణమని భావిస్తున్న ఇతర అంశాల్లోనూ సానుకూల ఫలితాలు రావడం తమ అంచనాలను ధ్రువపరుస్తున్నట్లు వివరించారు.
వీర్యవృద్ధికి... బాదాం, పిస్తా, వాల్‌నట్, జీడిపప్పు
Published Sat, Jul 7 2018 1:25 AM | Last Updated on Sat, Jul 7 2018 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment