Pistachio Almond
-
ఒంటికి పట్టేస్తుంది
పైన పెంకుతో లోపల నట్తో చాలా వైవిధ్యం కనిపించే పిస్తాలో ఎన్నెన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా విశిష్టమైనవి. వాటిలో ఇవి కొన్ని. పిస్తాలో క్యాలరీలు చాలా ఎక్కువ. కాబట్టి పరిమితంగా తీసుకున్నా సరే... పిస్తా వల్ల లభించే శక్తి చాలా ఎక్కువ. ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ. కానీ పిస్తాలో లభ్యమయ్యే కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు కావడం వల్ల దాని గురించి అంతగా బెంగ అక్కర్లేదు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా కాస్త పరిమితంగా తినడమే మంచిది. పిస్తాలో ప్రోటీన్లతో పాటు.. వాటిని సరిగా జీర్ణమయ్యేలా చేసి, ఒంటికి ప్రోటీన్లు పట్టేలా చేసే విటమిన్–బి6 కూడా ఎక్కువే. ఇందులో పీచు కూడా అధికం. అందువల్ల పిస్తా వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరగడమే కాకుండా, పేగుల్లో ఆహారం సాఫీగా ముందుకు జరుగుతుంది. పిస్తాలోని పీచు కారణంగా మలబద్దకం సమస్య కూడా నివారితమవుతుంది. ఇందులో విటమిన్ బి–కాంప్లెక్స్, విటమిన్–సి ఉన్నాయి. వీటి కారణంగా అవి చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇస్తాయి. పిస్తాలో విటమిన్–ఈ కూడా ఎక్కువే. దీనివల్ల పురుషుల్లో వ్యంధ్యత్వాన్ని నిరో«ధించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేగాక... చర్మాన్ని నిగారించేలా చేయడం, దీర్ఘకాలం పాటు యౌవనంగా ఉంచేలా చూడటంతో పాటు వృద్ధాప్యాన్ని వీలైనంతగా వెనక్కునెడుతూ... ఆలస్యమయ్యేలా చూడటానికీ పిస్తా బాగా తోడ్పడుతుంది. పిస్తాలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రసరించేలా చూడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. పిస్తాలో ఫాస్ఫరస్, క్యాల్షియమ్ కూడా ఎక్కువే అయినందున ఇది ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. మెగ్నీషియమ్, ఇతర ఖనిజలవణాలు మెండుగా ఉన్నందున మెదడు, వెంట్రుకలు, చర్మం ఆరోగ్యానికి పిస్తా ఎంతగానో తోడ్పడుతుంది. -
వీర్యవృద్ధికి... బాదాం, పిస్తా, వాల్నట్, జీడిపప్పు
జీవనశైలి మార్పులతో సంతాన లేమి సమస్యలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. బాదాం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొంతమంది ఆరోగ్యవంతమైన పురుషులపై తాము 14 వారాలపాటు అధ్యయనం చేశామని.. వీరందరినీ రెండు గుంపులుగా విడగొట్టి.. ఒకరికి సాధారణ ఆహారం.. ఇంకొక వర్గానికి డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా నట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అందించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. రోజుకు 60 గ్రాముల బాదాం, హేజల్, వాల్నట్స్లు అందించామని, 14 వారాల తరువాత చూసినప్పుడు వీరి వీర్యకణాలు 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని, కదలికలు ఆరు శాతం పెరిగినట్లు తెలిసిందని అలన్ పేసీ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ సంతానలేమికి కారణమని భావిస్తున్న ఇతర అంశాల్లోనూ సానుకూల ఫలితాలు రావడం తమ అంచనాలను ధ్రువపరుస్తున్నట్లు వివరించారు. -
పిస్తా బాదం కుల్ఫీ
క్విక్ ఫుడ్ కావలసినవి పాలు – 2 కప్పు, పంచదార – 4 టీస్పూన్లు ఏలకులపొడి – చిటికెడు పిస్తా పప్పులు – 1 టీస్పూను తయారి : మందంగా వున్న పాన్లో పాలుపోసి ఎక్కువ మంటమీద మరిగిస్తూ కలుపుతుండాలి. పాలు ఒక కప్పు గా మరిగాక స్టౌ మంట తగ్గించాలి. ఈ మిశ్రమానికి పంచదార, ఏలకులపొడి బాదం, పిస్తా కలిపి దించేయాలి. కుల్ఫీట్రేలో పోసి ఫ్రీజర్లో ఆరు గంటలపాటు వుంచితే కుల్ఫీ రెడి.