జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.
ఇందుకోసం ఏం చేయాలంటే..?
రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త.
ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట.
అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment