స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి.
పనీర్ హల్వా తయారీకి కావలసినవి:
►పనీర్ తురుము – 500 గ్రాములు
►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున
►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)
►పాలు – 200 మిల్లీలీటర్లు
►కోవా – 200 గ్రాములు
►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్
►బెల్లం కోరు – 100 గ్రాములు
►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్
►పిస్తా – గార్నిషింగ్ కోసం
తయారీ:
►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి.
►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి.
►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి.
►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి.
►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా.
ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా
Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ..
Comments
Please login to add a commentAdd a comment