బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్‌లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్‌లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం!
తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి.
బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి.
ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.
అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్‌కు, వెయిట్ లాస్‌కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది.
ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి.
చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్‌గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి.
జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్‌తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్.
నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్‌లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment