జీడిపప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇతరత్రా విశేషాలు మీకు తెలుసా!
Health Benefits Of Cashew Nuts: జీడిమామిడి పండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పును సేకరిస్తారు. దీనిని ఎక్కువగా ఉష్ణ మండలాల్లో సాగు చేస్తారు. బ్రెజిల్‌ను దీనికి పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఇక మన దేశం నుంచి కూడా జీడి ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతోంది. సాధారణంగా జీడిపండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది.
జీడిపప్పులో ఉండే పోషకాలు
►జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ.
►విటమిన్ ఇ, కె, బి6 పుష్కలం.
►క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండు.
ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల జీడిపప్పులో ఉండే పోషకాలు
కాలరీలు- 157
ప్రొటిన్- 5 గ్రాములు
ఫ్యాట్- 12 గ్రాములు
కార్బోహైడ్రేట్లు- 9 గ్రాములు
ఫైబర్-1 గ్రా.
కాపర్- డైలీ వాల్యూలో 67 శాతం
మెగ్నీషియం- 20 శాతం
జింక్- 15 శాతం
మాంగనీస్- 20 శాతం
ఫాస్పరస్- 13 శాతం
ఐరన్- 11 శాతం
సెలీనియమ్- 10 శాతం
థయామిన్- 10 శాతం
విటమిన్ కె- 8 శాతం
విటమిన్ బీ6- 7 శాతం
జీడిపప్పు- ఆరోగ్య ప్రయోజనాలు:
►జీడిపప్పు తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంటుంది.
►జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి.
►కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా దీనిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
►దీనిలో అన్‌శాటురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. హృద్రోగాల ముప్పును నివారిస్తాయి.
►ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్ ఉంటుంది.
►ఇందులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
►మెగ్నీషియం, మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
►వేయించుకుని లేదంటే, గ్రైండ్ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది.
►మధుమేహ రోగులు, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
సంతాన లేమితో బాధపడే వారు జీడిపప్పు తింటే మంచిది!
ఇందుకు సంబంధించి గతంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. బాదం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా వివరించారు.
నోట్: కిడ్నీ ఆకారంలో కనిపించే జీడిపప్పును పచ్చిగానే తింటారు చాలా మంది. అయితే, ఇది శ్రేయస్కరం కాదంటున్నారు పరిశోధకులు. ఇందులోని ఉరుషియోల్ అనే రసాయన పదార్థం కొంతమందిలో స్కిన్ రియాక్షన్‌కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి జీడిపప్పును రోస్ట్ చేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు.
చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..
Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment