సాధారణంగా ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!
పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
తక్కువ కేలరీలు
పుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.
మెగ్నీషియం
జీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.
జింక్
ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇనుము
ఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం.
మంచి కొవ్వులు
గుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment