భిన్న రుచులు ట్రై చేయడం అలవాటా? అయితే, ఇంట్లో ఇలా పొటాటో పాప్ కార్న్ చేసి చూడండి!
కావలసినవి:
►బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి)
►చాట్ మసాలా – పావు టీ స్పూన్
►కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
►ఉప్పు – తగినంత
►కారం – కొద్దిగా
►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ:
►ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
►కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి.
►అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి.
►అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి.
►తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్‌లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి.
చదవండి: తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్
అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు..
Comments
Please login to add a commentAdd a comment