Recipe: మొక్క జొన్న పిండి, ఉప్పు, వాము.. మక్కి రోటీ ఇలా ఈజీగా! | Recipes In Telugu: How To Make Makki Roti | Sakshi
Sakshi News home page

Makki Roti: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో సులువుగా మక్కి రోటీ తయారీ!

Published Wed, Jun 22 2022 10:16 AM | Last Updated on Wed, Jun 22 2022 10:24 AM

Recipes In Telugu: How To Make Makki Roti - Sakshi

మక్కి రోటీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో ఇలా సులభంగా తయారు చేసుకోండి.

కావలసినవి:
►మొక్కజొన్న పిండి – రెండు కప్పులు
►వాము – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►వేడి నీళ్లు – కప్పు
►నెయ్యి – రోటి ఫ్రైకి  సరిపడా.

తయారీ..
►మొక్కజొన్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, వాము వేసి చక్కగా కలుపుకోవాలి.
►దీనిలో కొద్దికొద్ది గా వేడి నీళ్లు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి.
►ఈ పిండి ముద్దను పదినిమిషాలు నానబెట్టాలి.
►తరువాత పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేయాలి.
►ఒక్కో ఉండను మందపాటి చపాతీలా వత్తుకోవాలి∙
►ఉండలన్నింటిని ఇలా వత్తుకున్న తరువాత, నెయ్యి వేసి రోటిని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మక్కీ కి రోటీ రెడీ అయినట్లే.
►ఏ గ్రేవీ కర్రీలోనైనా ఈ రోటీ నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది.  

ఇవి కూడా ట్రై చేయండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్‌ సలాడ్‌ శాండ్‌విచ్‌ తయారీ!
Recipe: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్‌ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement