Beauty Tips: బీట్‌రూట్‌ రసం, కార్న్‌ ఫ్లోర్‌.. గులాబీ రేకుల్లాంటి  పెదాలు! | Beauty Tips In Telugu: Follow These For Beautiful Pink Lips | Sakshi
Sakshi News home page

Beauty Tips: బీట్‌రూట్‌ రసం, కార్న్‌ ఫ్లోర్‌.. గులాబీ రేకుల్లాంటి  పెదాలు!

Published Thu, Jul 28 2022 12:28 PM | Last Updated on Thu, Jul 28 2022 12:38 PM

Beauty Tips In Telugu: Follow These For Beautiful Pink Lips - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెదాలు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి!

బ్రష్‌తో ఇలా
►ఉదయాన్నే బ్రష్‌ చేసిన తరువాత.. బ్రష్‌ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి.
►ఇలా రోజూ చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.
►పెదాలకు మర్ధన జరిగి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది.
►పెదవులు మృదువుగా మారతాయి.

బీట్‌రూట్‌ రసంతో..
►ఉదయం బ్రష్‌తో మర్ధన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి.
►ఇందుకోసం.. కొద్దిగా బీట్‌రూట్‌ రసాన్ని వేడి చేయాలి.
►అలా వేడిచేసిన రసంలో అరటీస్పూను కార్న్‌ప్లోర్‌ వేసి ఐదు నిమిషాలు కలియబెట్టి తర్వాత దించేయాలి.
►చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో అరటీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేయాలి.

►ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి.
►ఉదయం నీటితో కడిగేయాలి.
►ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబిరేకుల్లా కోమలంగా పింక్‌ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 
చదవండి: Apple Cider Vinegar Benefits: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!
Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement