ముఖం అందంగా ఉండాలంటే పార్లర్‌ల వద్దకే వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కటి నిగారింపును సొంతం చేసుకోవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకోసం ముఖంపై కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లో ఉంటే సహజసిద్ధమైన వాటిని అప్లై చేసి మచ్చలేని చందమామలా ఉండే ముఖాన్ని సొంతం చేసుకుండి. అందకు ఈ సింపుల్ రెమిడీస్‌ని ఫాలోకండి.
- రోజూ పెదవులకు కాస్తంత మీగడ రాసి సున్నితంగా మర్దన చేస్తే పెదవులు పగలకుండా గులాబీ రేకుల్లా మెరుస్తాయి.
- ముఖాన్ని రోజుకు రెండు మూడుసార్లు గోరువెచ్చటి నీటితో కడుక్కుని పొడి టవల్‌తో చక్కగా తుడిచేస్తే మొటిమల వంటివి రావు.
- లేతకొబ్బరిని మెత్తగా మెదిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే ముఖం చక్కగా అందంగా కనబడుతుంది.
- రకరకాల షాంపూల బదులు కుంకుడు కాయ రసం లేదా సీకాయ పొడితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు, కేశ సంబంధమైన సమస్యలు రాకుండా జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.
- తల స్నానం పూర్తయిన తర్వాత, చివరి మగ్గు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తలమీద పోసుకుంటే జుట్టు, చర్మ సమస్యలు రావు.
Comments
Please login to add a commentAdd a comment