పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..! | Beauty Tips Just Do This For Soft And Healthy Lips | Sakshi
Sakshi News home page

Beauty Tips: కోమలమైన పెదవుల నిగారింపుకై ఇలా చేస్తే చాలు..!

Published Thu, May 9 2024 1:36 PM | Last Updated on Thu, May 9 2024 1:36 PM

పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!

పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!

పెరుగుతున్న ఎండవేడికి చర్మంతోపాటు, పెదవులపై నలుపు రంగు పేరుకుపోతూంటుంది. పెదవులపై చీలికలతో పాటు మెరిసేతత‍్వం కూడా తగ్గుతుంది. మరి పెదవులు సహజంగా, కోమలంగా ఉండాలంటే ఈ ట్రిక్స్‌ ట్రై చేయండి..!

ఇలా చేయండి..

  • రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసిన తరువాత.. బ్రష్‌ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. మర్ధన వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదవులు మృదువుగా మారతాయి.

  • ఉదయం బ్రష్‌తో మర్దన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి. ఇందుకోసం.. కొద్దిగా బీట్‌రూట్‌ రసాన్ని వేడి చేయాలి. వేడిచేసిన రసంలో అర టీస్పూను కార్న్‌ఫ్లోర్‌ వేసి ఐదు నిమిషాలపాటు బాగా కలిపి దించేయాలి. తరువాత ఈ మిశ్రమంలో అర టీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేయాలి. ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ఉదయం నీటితో కడిగేయాలి

  • ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబి రేకుల్లా కోమలంగా పింక్‌ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఇవి చదవండి: Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement