దీపావళి పండుగ వేళ నోటిని తీపి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, కొందరు డైట్‌లో ఉన్న కారణంగా అన్ని స్వీట్లు తినలేరు. ముఖ్యంగా పంచదారకు దూరంగా ఉంటారు చాలా మంది! బెల్లం తినగలిగే వారైతే పండుగనాడు ఇలా బెల్లం గవ్వలతో నోరు తీపి చేసుకుంటే సరి!
బెల్లం గవ్వల తయారీకి కావలసిన పదార్థాలు:
►గోధుమ పిండి – ఒక కప్పు
►బెల్లం – ఒక కప్పు
►నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
►వంట సోడా – చిటికెడు.
బెల్లం గవ్వల తయారీ విధానం
►ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, వంట సోడా వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి.
►ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద ఒత్తుకోవాలి
►అవి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి
►ఆ తర్వాత బాణలిలో నూనె పోసి, వేడి చేయాలి.
►అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టాలి
►మరో గిన్నెలో బెల్లం వేసి, మునిగేంత వరకు నీరు పోయాలి
►దీనిని స్టవ్ మీద పెట్టి, ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి
►బెల్లం పాకం వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయాలి.
►అప్పటికే వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి.
►వాటిని నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి
►చల్లారిన తర్వాత గవ్వలు విడివిడిగా వస్తాయి.
ఇది కూడా ట్రై చేయండి: Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment