పండగంటే పెద్దగా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది. మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీ మధుర స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా.
డ్రై ఫ్రూట్స్ బాస్కెట్
మీ లైఫ్‌లో ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ బెస్ట్! ఇదేకాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు, టోఫీలు, కప్‌కేక్‌లు వంటి ఇతర తినగలిగిన వస్తువులు ఉన్న బాస్కెట్లను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చు.
కుకీస్ గిఫ్ట్
కుకీస్‌లను బహుమతిగా ఇవ్వవడం మంచి ఎంపిక. టీ, కాఫీలతో తినడానికి ఇవి ఉత్తమమైనవి. ఈ రోజుల్లో, చోకో చిప్, జీడిపప్పు బాదం, తాజా పండ్లు వంటి అనేక రకాల కుకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ప్రియమైన వ్యక్తులకు ఇస్తే అస్సలు వద్దనరు.
చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
ఫ్రూట్ బాస్కెట్
మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా సర్ది కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు.
స్నాక్స్
మీరు ఏదైనా విభిన్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. అల్పాహారంగా తినగలిగే స్నాక్స్ ఐటమ్స్ మిక్స్ చేసిన గిఫ్ట్ బాక్స్‌ను తయారు చేసి ఇవ్వొచ్చు. ఇందులో పోహా, ఓట్స్ మ్యాగీ, ఇడ్లీ దోస పిండి, రవ్వ ఇడ్లీ పిండి, చాక్లెట్లు, టోఫీ పెట్టుకోవచ్చు.
టెట్రా జ్యూస్ ప్యాక్ మిక్స్
విభిన్న రుచుల్లో ఉండో టెట్రా జ్యూస్ ప్యాక్‌లతో కూడా గిఫ్ట్ బాక్స్‌లను తయారు చేయవచ్చు. వీటిని కూడా మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా అందించవచ్చు.
చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..
Comments
Please login to add a commentAdd a comment